-విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టం
-ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్ధుల్నీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
-ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
-సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు నిర్వహించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
-ఉప ముఖ్యమంత్రి భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, దీపదాస్ మున్షీ, మంత్రులు
-రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
-ప్రజా భవన్ లో అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
హైదరాబాద్: పేద సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ రాజ్యంలోని ఏర్పడిన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటి సీఎం భట్టి విక్రామర్క అన్నారు. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ప్రతిభ కేంద్రం బాలికల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రెసిడెన్షియల్ విద్యార్ధులతో కలిసి భోజనాలు చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యార్ధులకు డిప్యూటి సీఎం అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి డిప్యూటి సీఎం మాట్లాడారు. విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం మీ మధ్యకు రావడం జరిగిందన్నారు.
నేటి విద్యార్థుల భవిష్యత్తు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అందుకోసం రాష్ట్ర సంపదను విద్యకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్ధులను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్ధులు అభివృద్ధిని ఈ రాష్ట్ర అభివృద్ధిగా తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా. ప్రతి మండలంలో 20 నుంచి 25 ఎకరాలలో సమీక్రుత రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను విజిట్ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యా వైద్యం ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు పర్యటన చేయనున్నారని చెప్పారు. సంక్షేమ విద్యకు బడ్జెట్ కేటాయించడం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదన్నారు.
ఎన్ని నిధులైన విద్య వ్యాప్తికి ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజల సమస్యలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గాలికి వదిలేయదని చెప్పారు. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు మంచినీటి సమస్య ఉందని నా దృష్టికి తీసుకువచ్చినందున మంజీరా నీళ్లను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి కావలసిన పాఠ్యపుస్తకాలు, కోచింగ్ ఇచ్చేటువంటి నిష్ణాతులైన అధ్యాపకులను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తుందన్నారు. మీ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివిస్తున్నారని, మీ పైన ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకున్నందున వారి ఆశలను తీర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైన వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ప్రభుత్వం మీపై పెట్టుకున్న కళలను నిజం చేయడానికి ప్రతి నిమిషం ప్రతి క్షణం తపస్సు లాగా చదువుకొని మీ లక్ష్యాలను సాధించాలని విద్యార్ధులకు హితబోధ చేశారు.
విద్యార్ధుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆడంబరాలకు వెళ్లే రాజకీయ నాయకులు, ఆమాత్యులకు భిన్నంగా సాదా సీదాగా విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉన్న గొప్ప మనసుకు నిదర్శనమన్నారు.
నిత్యం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న తపన కలిగిన నాయకుడు కాబట్టే డిప్యూటీ సీఎం రెసిడెన్షియల్ పాఠశాలకు వచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
పీపుల్స్ మార్చ్ రథసారధి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ దీపదాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు, రోహిత్ చౌదరిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్ర అభివ్రుద్దికి, రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షల సందేశాన్ని భట్టికి పంపించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ్మ, ఎఐసిసి సెక్రటరి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్పు బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాంచందర్ నాయక్, బాలునాయక్, మాలోత్ రాందాస్ నాయక్, వీర్లపల్లి శంకర్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ రాజయ్య, ఎంపి బలరాం నాయక్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, ఐఏఎస్ అధికారులు రామక్రుష్ణరావు, హరిత, హనుమంతరావు, సుశీల్ శర్మ, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు. ఉన్నత విద్యాశాఖ చైర్మెన్ ప్రోఫేసర్ లింబాద్రి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లాలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ్మరెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఓయూ విద్యార్ధి జేఏసీ చైర్మెన్ లోకేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు కేక్ కట్ చేసి ర్యాలీ తీశారు. ఖమ్మంలో తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం భట్టి అభిమానులు పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎస్టిఎఫ్ ఆధ్వర్యంలో 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. ఖమ్మం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు
ప్రజా భవన్ లో అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
ప్రజా భవన్ లో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్ష్యంలో అభిమానులు తీసుకొచ్చిన 50కిలోల కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజాభవన్ లో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన ఆనంతరం సుమారు 200 మంది పూజారులకు కానుకలు పంపిణీ చేశారు.
యాదగిరిగుట్ట వేదపండితులు ప్రజాభవన్ కొచ్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం ప్రసాదము అందజేసి శ్వేత వస్త్రాన్ని కప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాభవన్ కు తరలివచ్చి శాలువాలు కప్పి, పూల బోకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కొందరు భారీ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు.
భట్టి అభిమానులతో కిక్కిరిసిన సెక్రటేరియట్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆయా జిల్లాల నుంచి అధికారులు, అభిమానులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సచివాలయానికి తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ఫైనాన్స్, విద్యుత్ శాఖలకు చెందిన ఉన్నత అధికారులు డిప్యూటి సీఎం ను కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు