Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం

15వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించారు. అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ డివిజన్లోని లక్ష్మి అపార్ట్మెంట్ వెనుక ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో అవి దోమలకు నిలయాలుగా మారాయని, దాని వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల భారీన పడుతున్నామని స్థానికులు తెలిపారన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్ మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. అపార్ట్మెంట్లో ప్లాట్ల సమస్యపై కేసులు ఉన్నాయని, ప్రతి వారం ఏదో ఒక అపార్ట్ మెంట్ వాసులు కేసులు పని మీద కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకున్నాయని కాలనీ వాసులు తెలిపారన్నారు.

కేసులతో సంబంధం లేని వారు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకున్నాయని, ఈ సమస్యలపై కూడా కమిషనర్ తో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వారికి హామీ ఇచ్చారు. డివిజన్ లో నెలకున్న ఏ సమస్యను అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు వివరించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ డివిజన్ వాసులకు చెప్పారు.

జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు మాట్లాడుతూ లక్ష్మి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లోని ప్లాట్ సమస్యలతో, డ్రైనేజీ, వర్షం నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే సమస్యను స్వయంగా పరిశీలించడానికి వచ్చారన్నారు. ఈ సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

డివిజన్ నాయకులు రత్నం రమేష్ మాట్లాడుతూ డివిజన్లోని సమస్యను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే పరిశీలించడానికి వచ్చారన్నారు. గతంలో ఉమ్మడిగా ఉన్న ఈ డివిజన్ను దత్తత తీసుకుని అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేసి చూపించారన్నారు.

నియోజకవర్గంలోని ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో గద్దె రామమోహన్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని డివిజన్లల్లో ఉదయం వేళ పర్యటించడమే కాకుండా మధ్యాహ్నాం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభ్యుని కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అంటుబాటులో ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో పఠాన్ హయాత్బాన్, నందమూరి పూర్ణచంద్రరావు, కొండారెడ్డి, రాధాకృష్ణ, నారాయణ, మల్ల సాయికార్తీక్, బలరాం, నాగరాజు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE