-
11 సీట్లకే పరిమితమైనా తీరు మార్చుకోని జగన్
-
అబద్ధాల సాక్షిలో రోత రాతలు, విష ప్రచారాలు
-
టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మండిపాటు
మంగళగిరి: ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమైంది… మీ ఫేక్ ప్రచారాలు మీ కొంపలు ముంచినా కుక్క తోక వంకర చందాన జగన్ రెడ్డి బుద్ధి మారలేదు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఫేక్ ప్రచారమే పనిగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్న క్యాంటీన్లపై విషం కక్కుతున్నారు… మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే పేదవాళ్ల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్న క్యాంటీన్ల ఓపెన్ చేస్తే వాటిపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణకి అప్పగించామని, ఇంకా రివ్యూ దశలోనే ఉన్న అమ్మకు వందనంపై కూడా ఫేక్ ప్రచారాలు… భారతి రెడ్డి గారు… మీ సాక్షి పత్రికలోని సత్యమేవ జయతే అనే క్యాప్షన్ ను అసత్యమేవ జయతేగా మార్చుకుంటే బాగుంటుందేమో… 28వ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని 16 వ తేదీనే సర్కులర్ జారీ చేసాం. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా క్యాబినెట్ మీటింగ్ కావాలనే వాయిదా వేశారంటూ లోకేష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ఫేక్ ప్రచారాలతో పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మీరు వెలగబెట్టిన కార్యాలను ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లిచ్చారు. ఇప్పుడు కూడా అదే పంథాని కొనసాగిస్తూ నిజమయిన వార్తలను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలపైనా, నాయకులపైనా, లోకేష్ పై, చంద్రబాబు నాయుడుపై ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తే ఈ సారి 11 సీట్లు కాదు కదా పార్టీనే మూసేసుకుని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
జగన్ రెడ్డివి శవ రాజకీయాలు
ప్రజలు మీ ఫేక్ ప్రచారాలను గమనిస్తున్నారు… తెలుసుకుంటున్నారు కాబట్టే నంద్యాల, కర్నూలు లాంటి చోట్ల కూడా వైసీపీ కి ఎదురు దెబ్బ తగిలింది. నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు గొడవపడి హత్య జరిగితే అది టీడీపీ వాళ్ళే చేయించారంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్ని హత్యలు జరిగాయి. ఏ రోజయిన బయటికొచ్చారా. ఎంత మంది వైసీపీ కార్యకర్తలను ఆదుకున్నారు. ఎంత మంది కార్యకర్తలను పరామర్శించారు. హత్యలు చేసిన వారినే తన పక్కన పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి బధ్రతల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి అర్ధం కావటం లేదు.
రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?
కేంద్ర బడ్జెట్ లో రాయలసీమకు రైల్వేస్, ఇండస్ట్రీయల్ హబ్ ల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రాయలసీమ వ్యక్తే కదా మరి జగన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమ అభివృద్ధికి ఏం చేశారు. ఒక్క పరిశ్రమనైనా రప్పించారా… రాయలసీమలోని నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమయినా ఇప్పించారా అని అడుగుతున్నాను. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరయినా ఉన్నారా అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. గతంలో టీడీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు జగన్ మోహన్ రెడ్డి తెలివితక్కువ తనం, అసమర్ధత వల్ల మధ్యలో ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూడా చెప్పిన మాట అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని.. రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేస్తాం.