– మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్ళే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, మైన్స్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక సరఫరా విధానం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పి డి. నరసింహ కిశోర్, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ , ముప్పిడి వేంకటేశ్వర రావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇంచార్జీ జెసి జి నరసింహులు, మైన్స్ ఏ డి ఎమ్. సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ సి ఈ పుల్లా రావు, ఎస్ ఈ ఎస్. శ్రీనివాస రావు, డి ఎల్ ఎస్ ఏ సభ్యులు , లారీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పాయింట్ వద్ద, 71 లక్షల మెట్రిక్ టన్నుల డి సిల్టేషన్ పాయింట్ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసిపై కొంత ప్రజల్లో అపోహలు ఉన్నాయి, వాటినీ పరిష్కారం చేయాల్సి ఉందన్నారు.
ఈ రంగంలో ఆధారపడ్డ వారి జీవన భృతి కూడా దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. లారీ అసోసియేషన్ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే, ఒకటి రెండు నెలలు వేచి ఉంటే మీకు ప్రయోజనం చేకూరేలా సానుకూల నిర్ణయం ఉంటాయని తెలిపారు. అంత వరకు మీరు వేచి ఉండే దోరణి లో ఉండాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి డిమాండ్ రావడం వల్ల ఇసుక డిమాండ్ రావడం గుర్తించామన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ధరల కు అనుగుణంగా వినియోగదారులకు ఇసుక అందించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఉచిత ఇసుక రవాణా, చివరి వినియోగ దారులకు చేరే ప్రక్రియ పై సమగ్రంగా సమీక్షించినట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. కేవలం ఇసుక రవాణా ఖర్చులు మాత్రమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏ ఏ రీచ్ లలో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అన్న విషయాన్ని తెలియ చేస్తున్నట్లు, ఆమేరకు ట్రాన్స్పోర్ట్ సహకరించాలన్నారు. రాష్ట్రంలో అవసరమైనా ఇసుకలో ఎక్కువ మొత్తం ఇక్కడ నుంచే సరఫరా చెయ్యాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమన్వయ లోపాలని అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. బోట్స్ మ్యాన్ సొసైటి ద్వారా త్రవ్వకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సచివాలయం ద్వారా వినియోగదారులు ఇసుకను బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లక్ష్యం ఉచిత ఇసుక పాలసీ విధానం లో పక్కదారి పట్టకూడదని పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలని ఉంటాయని హెచ్చరించారు. మైనింగ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని, ప్రజలు సంతృప్తి చెందేలా ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 8 రీచ్ లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పేదలకు, ఇళ్ళ నిర్మాణం చేసే వారికీ ఇసుకని అందుబాటులోకి తీసుకుని వెళ్ళే క్రమంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఉచిత ఇసుక వినియోగదారునికి అందించే క్రమంలో సమర్ధవంతంగా అమలు చేసే దిశలో సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి చర్చించడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఉచిత ఇసుక విధాన అమలు తీరు, డి ఎల్ ఎస్ ఎ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సమర్ధవంతంగా ఇసుక రవాణా చేసేందుకు మూడు బృందాలు అధ్వర్యంలో రిజిస్ట్రేషన్, లోడింగ్, విజిలెన్స్ ప్రక్రియను పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఇసుక రీచ్ మేనేజర్ గా ఇంచార్జీ గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. రీచ్ ల వద్ద ఇసుక రవాణా ను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు.
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షణా చేస్తున్నట్టు తెలిపారు. అనధికార 8.82 లక్షలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు 14 కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. కార్యాచరణలో భాగంగా ఇరిగేషన్ ద్వారా 17 డిసల్టేషన్ పాయింట్స్ గుర్తించామని తద్వారా 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అవుతుందని అన్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రజల్లో ఉచిత ఇసుక రవాణా, లోడింగ్, తదితర అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల కొంత అపోహ ఉందన్నారు. వాహన రవాణా ఖర్చుల విషయంలో కూడా స్థిరమైన ధర నిర్ణయించాలన్నారు. పట్టా భూములలో ఇసుక విధానం పై మార్గదర్శకాలు జారీ కి సూచనలు చేశారు.
ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వర రావు మాట్లాడుతూ, ఇసుక రవాణా చేసే వాహనాల బరువు విషయం రహదారుల సామర్ధ్యం కు అనుగుణంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే వాహనం వేచి ఉండే సమయం తగ్గేలా క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని రీచ్ లు అందుబాటులోకి తీసుకుని రావడం, బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకి పెండింగ్ సొమ్ము చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇసుక వినియోగం దారులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా సరఫరా చెయ్యాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇసుక సరఫరా పై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు.
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ ప్రభుత్వ నిర్మాణ పనులకు ఇసుక లభ్యత ఉండాలన్నారు. ప్రభుత్వం ఏ ఆశయంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆ దిశగా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్లాల యంత్రాంగం పని చేయాలని సూచించారు.
లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, టోల్ గేట్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు నేపథ్యంలో డిమాండ్ కీ అనుగుణంగా ఇసుక ఉత్పత్తి పెంచాలన్నారు. ఆమేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం లో ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇంచార్జి జేసీ, డిఆర్ ఓ జి. నరసింహులు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంటటేశ్వరరావు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్ డి ఓ కె ఎల్ జ్యోతి, ఆర్ వి. రమణ నాయక్, ఇరిగేషన్ సీఈ పుల్లారావు, ఎస్ ఈ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ సుబ్రహ్మణ్యం, డీఎల్‌ఎస్ కమిటీ సభ్యులు తదితతులు పాల్గొన్నారు.