– గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టు
– చాతీనొప్తి ఆసుపత్రిలో చేరిన డాక్టర్ లోకేష్
– పోలీసుల చర్యపై ఆగ్రహం
– అమెరికన్ ఎంబసీకి ఫిర్యాదు
(అన్వేష్)
గన్నవరం: ఈయన పేరు డాక్టర్ లోకేష్. ఇంతకూ ఆయన చేసిన నేరం సీఎం జగన్ లండన్‌కు వెళుతున్న సమయంలో, ఈ డాక్టర్ కూడా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉండటమేనట. పైగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారట. సెల్‌ఫోన్‌లో సీఎం టూర్‌కు సంబంధించి చాటి ంగ్ కూడా కూడా ఉందట. అందువల్ల ఈ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారట. విమానం ఎక్కేందుకు తాను కొన్న టికెట్‌ను కూడా పోలీసులకు చూపించినా నమ్మకుండా, తమదైన శైలిలో ‘విచారించారట’. దానితో పోలీసుల ఒత్తిళ్లకు తాళలేక సదరు డాక్టర్, ఛాతీ నొప్పికి గురైతే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
‘‘కడపలో మాజీ ఎంపి వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే గొడ్డలితో నరికితే, చంపిందెవరో ఐదేళ్లయినా కనిపెట్టలేని పోలీసులు.. అమెరికాలో ప్రఖ్యాత డాక్టర్‌ను మాత్రం అనుమానితుడిగా కనిపెట్టడమే వింత’’ అని, సోషల్‌మీడియాలో నెటిజన్లు పోలీసులపై ఫైరవుతున్నారు.
ఈయన పేరు డాక్టర్ తుళ్లూరు లోకేష్. ఆయన అమెరికాలోని వాషింగ్టన్‌లో వైద్యుడు. ఆయనకు అమెరికా సిటిజన్‌షిప్ కూడా ఉంది. అమెరికా లో పేరు పొందిన ప్రఖ్యాత వైద్యుడిని మన పోలీసులు అన్యాయం గా అరెస్ట్ చేసి, ఒక అమెరికన్ సిటిజన్‌షిప్ ఉన్న డాక్టర్ ని అతి హీనాతిహీనంగా కొట్టారు అని ఆయనే వెల్లడించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన సేవాకార్యక్రమాలు ఎన్నో ఎన్నో. అమరావతి రైతులు కోసం కూడా బాగా నిలబడ్డారు. న్యాయ సహాయం చేశారు. అలాంటి ఉన్నత వ్యక్తి పోలీసులు కొట్టారు. అమెరికన్ ఎంబసీ కి ఈ దారుణాన్ని తెలిపారు.