-భూములు కబ్జా చేయడమే కాక బాధితులకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులా?
-పులివెందులలో వైసీపీ కూసాలు కదులున్నాయన్న భయంతోనే బీ.టెక్ రవిపై వేధింపులు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్ధాయికి చేరాయి. భూములు కబ్జా చేయడమే కాక బాధితులకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులా? పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగలగుట్టపల్లెలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని వైసీపీ నేత సుబ్బయ్య కబ్జా చేశారు. భాధితుల తరపున వెళ్లి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీ.టెక్ రవి, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడతారా? పులిందులలో వైసీపీ కూసాలు కదులున్నాయన్న భయంతోనే బీ.టెక్ రవిపై వేధింపులకు పాల్పడుతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేసి వెంచర్ వేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారు? సొంత నియోజకర్గంలో పేదల భూములు కబ్జాకు గురవుతుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు? జగన్ రెడ్డికి వీటిలో వాటాలున్నాయా ? లేకుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ? పోలీసులు కబ్జాదారులపై చర్యలు చేపట్టి బీ.టెక్ రవితో పాటు టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలి.