Suryaa.co.in

Features

సీబీఐ- ఈడీ వాదనలు నిలబడాలి.. బలపడాలి

గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు సుమారుగా 7500 మంది మీద, సీబీఐ- ఈడీ దాడులు జరిపి కేసులు పెట్టారు. వీటిలో బ్యాంకులను మోసగించి అక్రమంగా సంపాదించిన కేసులు, రాజకీయ ముసుగులో రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమ డబ్బు, నల్ల వ్యాపారం , దొంగ వ్యాపారం చేసి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా, వందల వేల కోట్లు అక్రమ మార్గం ద్వారా విదేశాలకు పంపి, తిరిగి ఏదో ఒక రూపేణా ఈ దేశంలోకి తెప్పించుకొని కొన్న ఆస్తులు మీద, సిబిఐ,ఈడి దాడులు జరిపి కేసులు పెడుతుంది.

అయితే బీజేపీ వ్యతిరేకులు తమ సొంత మీడియా ద్వారా బీజేపీ.. సీబీఐ , ఈ డి లను రాజకీయానికి ఉపయోగించుకుని దాడులు చేస్తుందని, లొంగ తీసుకుంటుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేసులు ఉన్నవారు బీజేపీ పార్టీలో చేరితే కేసుల మీద తీవ్రత తగ్గిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది అంతా శుద్ధ అబద్ధం. పచ్చి అబద్ధం. ఇందులో ఒక్క నిజం ఉండదు. .అయితే కొంతమంది కేసులో ఉన్నవారు బిజెపిలో చేరి ఉండవచ్చు. అంత మాత్రాన కేసులు నీరు గారి పోతాయని తీవ్రత తగ్గుతుందని అనుకోవడం పిచ్చి భ్రమ.

బీజేపీ ఎప్పుడు కూడా అటువంటి మాటలకు, పోకడలకు అధిష్టానం అవకాశమే ఇవ్వదు .ఈ మధ్య జరిగిన సంఘటనలు ఒకసారి నెమరు వేసుకుందాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు ఒక పాన్ మసాలా వ్యాపారి మీద సీబీఐ , ఈ డి దాడి చేస్తే, ఎన్ని వందల కోట్లు నల్లధనం దొరికిందో మనం చూసాం. మహారాష్ట్రలో సీబీఐ ఈడీ దాడి చేసి 56 కోట్లను ప్రత్యక్షంగా పట్టుకొని సీజ్ చేసే విషయం మనం చూసాం.

దేశంలో నాకంటే నిజాయితీ పరురాలు లేదని గొప్పలు చెప్పుకుంటున్న మమతా బెనర్జీ ,వారిని మోస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి మీద దాడి చేస్తే 70 కోట్ల వరకు దొరికింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని కొన్ని ఇచ్చి.. కొంత మోసం చేసిన విషయం తెలుగులోకి వచ్చింది. మరి వీరిని కూడా సమర్థిస్తారా ?

ఏ కేసు విషయంలో కూడా కళ్ళు మూసుకుని సీబీఐ ఈడీ దాడులు చేస్తుందంటే , బీజేపీ చెప్పినట్టు చేస్తుందంటే మరి దీనిని బట్టి ఏమనుకోవాలో మీరే నిర్ణయం చేసుకోండి.
విజయ్ మాల్యా 9,000 కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పోయి దాంకున్న పరిస్థితుల్లో, ఈ దేశంలో వారికున్న ఆస్తులు పదివేల కోట్ల వరకు ప్రభుత్వం జమ చేసుకున్న విషయం మనం మర్చిపోలేదు.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE