– కేసీఆర్ కుటుంబం.అనుభవిస్తున్న భోగాలన్నీ రాహుల్, సోనియా గాంధీ ల భిక్ష
– తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ కొరత ప్రభుత్వ అసమర్థత
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకు?మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా?
కేసీఆర్ కుటుంబం.అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీ ల భిక్ష. కేసీఆర్ ఒక పిరికి పాలకుడు.. ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉంది. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణం.వారిని కలిసేందుకు వెళితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని అరెస్ట్ చేస్తారా? వెంటనే అందరిని విడుదల చేయాలి.. రాహుల్ గాంధీ గారి పర్యటనకు అందరూ సహకరించాలి.
Nsui అధ్యక్షులు వెంకట్ తో పాటు విద్యార్థి నాయకుల అరెస్ట్ ను అప్రజాస్వామికం..దుర్మార్గం. రాహుల్ గాంధీ ఓ.యూ కు వస్తారు అంటే కేసీఆర్ ఇంత దుర్మార్గంగా అడ్డుకోవడం ఎందుకు? ఓ.యూ విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ మహామహులు చదువుకున్న ఓ.యూ ను రాహుల్ సందర్శించడం అంత నేరమా? Nsui విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్లలో పెట్టడం ఏమిటి. తెలంగాణ లో ఇంత దుర్మార్గమైన పాలన సాగుతుంది. వెంకట్ తో పాటు విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఏ టిఆర్ఎస్ నాయకులను బయట తిరగనివ్వం. ప్రతి రోజు తెలుగు అకాడమీ వెలుపల క్యూలో నిల్చునే ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పుస్తకాలను అందించడం లేదు.తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ కొరత ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, వారిని సిద్ధం చేయడం లేదు.సీఎం వెంటనే సంక్షోభాన్ని పరిష్కరించాలి.