– ఉద్యోగ సంఘాల మాజీ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్: రిటైర్ అయిన తరువాత తమకు రావాల్సిన పెన్షన్ బకాయిలు తాము దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన చెందిన పెన్షనర్స్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమ కష్టాలు చెప్పుకోవాలని వస్తే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మార్చి 24 నుండి నేటివరకు రిటైర్ మెంట్ అయిన 20503 ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం వేధించడం దారుణం, ప్రభుత్వం 4500 కోట్లు విడుదల చేశామని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు, గత అయిదు నెలలుగా ప్రభుత్వం రెగ్యులర్ గా 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి కేవలం 400 కోట్లు కూడా పెన్షనర్స్ కు ఇవ్వలేదు.
ఇప్పటివరకు 42 మంది పెన్షనర్స్ తమ డబ్బులు రావనే ఆవేదనతో మరణించడం బాధాకరం. రావలసిన 5 డి ఏ విడుతల కోసం, పి ఆర్ సి అమలు కోసం, రిటైర్ మెంట్ బకాయిల కోసం పెన్షనర్స్ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం లో స్పందన లేకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
చివరకు వివిధ జబ్బులతో బాధపడుతున్న పెన్షనర్స్ కు వైద్యం కూడా అందడం లేదు,పెన్షనర్స్ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, సమస్యల పరిష్కారానికి కృషి చేయండి అరెస్ట్ లతో ఆందోళనలు ఆపలేరు మరింత తీవ్ర ఆందోళనలు తప్పవు