– శాసనమండలి మాజీ సభ్యులు కర్నె ప్రభాకర్
హైదరాబాద్: అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది దానిలో భాగంగానే ఓట్ల కోసం బీసీలను మోసం చేస్తూ, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఒక దొంగ నాటకం ఆడి బీసీల ఓట్లు దండుకొని బీసీ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగమే ఇచ్చిన హామీని నెరవేర్చమని అనేక సందర్భాలలో బీసీ వర్గాలు మొత్తుకున్న, మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ బీసీ రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోలేదు. దాని పర్యావసానమే ఇవాళ సాయి ఈశ్వర చారి చావుకు కారణం.
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చేసిన హత్య . ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొని.. పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లుగా ప్రయత్నం చేసి, రాజ్యాంగ సవరణ ద్వారా బిసి 42 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించే విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని ఆర్డినెన్స్ , జీవోల పేరు మీద ప్రజలను మోసం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం బలిదానాలకు ఎవరు కూడా పాల్పడవద్దని, పార్లమెంట్ పద్ధతి ద్వారా ఏ విధంగా అయితే తెలంగాణను తెచ్చుకున్నామో, అదే పద్ధతిలో రిజర్వేషన్లు కూడా అమలయ్యేదాకా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని యువతకు హామీ ఇస్తున్నాం.