ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు?
ఇది హత్య చేసే కుట్రనే: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి
అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్న బీజేపీ నేతలు సత్యకుమార్ , ఆదినారాయణ రెడ్డి మీద వైసీపీ గూండాల చేసిన దాడి దారుణం. ఈ దాడి కేవలం ఆదినారాయణ రెడ్డి మరియు సత్యకుమార్ ని చంపడం కోసం చేసిన కుట్ర.