– పెళ్ళి సమయంలో 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేత
– అడిగినంత ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపు
– ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
– శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
వారిద్దరు యువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు….మనసులు కలవడంతో వారిద్దరు ఒక్కటయ్యారు… వారిద్దరి మధ్య బంధం స్వలింగసంపర్కానికి దారిదీసింది…. ఓ యువకుని పెళ్ళి సమయంలో 10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేశాడు. డబ్బుల కోసం తరచు వేధించడమే గాకుండా తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్‌కు పాల్పడడంతో సదరు యువకుడు 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాతబస్తీ శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
వివరాలలోకి వెళితే.. శాలిబండ కు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో ఆ యువకునికి మొఘల్‌పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరు యువకులు మధ్య జరిగిన పరిచయం కాస్త ప్రేమ కు దారితీసింది. షాలిబండాకుచెందిన యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఒక్కటయ్యారు. స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు.
అనంతరం శాలింబండాకు చెందిన యువకునికి మరో యువతితో రెండవ వివాహం జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిరువురు పీకలలోతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్‌పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండాకు చెందిన యువకుడు 10 లక్షలు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్‌పురా వాసి తన కలిసి ఉన్న నగ్నంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని .. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే నంటూ బ్లాక్మెయిల్ కు దిగాడు.
దీంతో అప్పట్లో మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఆతర్వాత కూడా తనను దగ్గరికి రానిస్తడం లేదని మొఘల్‌పురా వాస్తవ్యుడి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండాకు చెందిన యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతే గాకుండా అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.