Suryaa.co.in

Andhra Pradesh

మహానాడు వేదికగా మహిళలకు చంద్రబాబు ప్రకటించిన వరాలు వారి భవిష్యత్ కు బంగారు బాటలు

– మహిళాశక్తి పథకాలు ఆడబిడ్డల భద్రత, భవిష్యత్ కు సోపానాలు. జగన్ పాలనలో కన్నీరింకిన కళ్లతో కష్టాలు భరిస్తున్న ప్రతిమహిళ సంతోషమే ‘మహిళాశక్తి’ లక్ష్యం
• చంద్రబాబు మహిళలకోసం ప్రకటించిన పథకాలు కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది
• మహానాడు సాక్షిగా టీడీపీప్రకటించిన పథకాలపై మహిళాలోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది
• దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిపథంలో నడిపింది
• స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలోసమానహక్కు కల్పించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు
• చంద్రబాబునాయుడు డ్వాక్రాసంఘాలతో తెలుగుమహిళల శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నిరంగాల్లో ముందుండాలని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ తరుపున అనేక చారిత్రాతక్మక నిర్ణయాలు తీసుకు న్నారని, ఆస్తిలో మహిళలకు సమానహక్కు కల్పిస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అమలుచేయడం తెలుగుజాతికే గర్వకారణమని, ఆ మహానీయుని బాట లో నడిచిన చంద్రబాబనాయుడు తెలుగుమహిళల శక్తి యుక్తుల్ని ప్రపంచమంతా కొని యాడేలా చేశారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె తెలుగుమహిళలతో కలిసి మహాశక్తి ఆడియోను విడుదలచేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“ మహిళలను ప్రోత్సహించి, రాజకీయాల్లో వారు రాణించేలా చేస్తే దేశాన్నికూడా తీర్చిదిద్దగలరని నమ్మిన రాజకీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాని క సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. విద్యారంగంలో వారిని ఉన్నతస్థానంలో నిలిపేందుకు ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. తిరుపతి లోని పద్మావతీ మహిళావిశ్వవిద్యాలయం నేటికీ మహిళావిద్యలో అగ్రస్థానంలో కొనసాగుతోందంటే దానికి ఎన్టీఆర్ ముందుచూపే కారణం.

చంద్రబాబునాయుడు తెలుగుదేశంపార్టీ పగ్గాలు చేపట్టాక, మహిళలు ఆర్థికంగా నిలదొ క్కుకొని సమాజంలో రాణించేందుకు డ్వాక్రాసంఘాలు ఏర్పాటుచేశారు. మహిళా విద్య కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ చంద్రబాబు మహిళ లు, బాలికలకోసం అనేక ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇంటిపట్టాలు, భూమి పట్టాలు, రేషన్ కార్డుల వంటివాటిని మహిళలపేర్లతోనే అందించారు. చంద్రబాబు హయాంలో మహిళలకు అన్యాయంజరిగిందనే మాట ఎక్కడా వినపడలేదు. ఎక్కడైనా అనుకోకుండా ఏదైనా జరిగినా వెంటనే పోలీస్ శాఖను అప్రమత్తంచేసి నిందితుల్ని కఠి నంగా శిక్షించిన సందర్భాలు అనేకం.

దాచేపల్లిలో మహిళపై అత్యాచారంచేసిన నింది తుడిని పట్టుకునేందుకు చంద్రబాబు ఆరుప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తే, తప్పుచేసిన వ్యక్తి భయంతో ఉరేసుకొని చనిపోయాడు. అదీ ఆడబిడ్డల రక్షణ విషయంలో చంద్రబా బు కల్పించిన భరోసా. అలాంటివన్నీ ఇప్పుడు కథలుగానే మిగిలిపోవడం బాధాకరం.

2019లో ఒక సైకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రతిఆడబిడ్డ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి రావడానికి ఆడబిడ్డల తలలపై చేతులుపెట్టి, వారిని కల్లబొల్లిమాటలతో నమ్మించి, ముఖ్యమంత్రి అయ్యాక అవేచేతుల్ని మహిళల పాలిట భస్మాసురహస్తాలుగా మార్చాడు. కాలకేయుడి రాక్షసపాలనలో మహిళల జీవి తాలు నరకప్రాయంగా మారాయి. ఓట్లేసిన మహిళల్ని దారుణంగా వంచించిన జగన్ రెడ్డి, నాలుగేళ్లపాలనలో వారికి నరకంచూపాడనే చెప్పాలి. మహిళలపై పూటకో అఘా యిత్యం, రోజుకో అత్యాచారం జరుగుతున్నా, వైసీపీ కామాంధులు వారి మానప్రాణాలు హరిస్తున్నా జగన్మోహన్ రెడ్డిలో కించిత్ కూడా చలనంలేదు.

అవినీతి, అక్రమార్జన కోసం కల్తీమద్యం అమ్ముతూ, మహిళల తాళిబొట్లు తాకట్టుపెట్టి, 25వేలకోట్ల రుణం తెచ్చిన జగన్, మహిళల్ని నడిరోడ్డుపై నిలబెట్టాడు
పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన జగన్, మహిళల భద్రత, భవిష్యత్ ను గాల్లోదీపంగా మార్చాడు. అమ్మఒడి పేరుతో అమ్మల్ని, మద్యపాననిషేధం అమలనిచెప్పి, కల్తీమద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తూ, మహిళల్ని కన్నీళ్లలో ముంచాడు. చేయూత , డ్వాక్రా రుణమాఫీ వంటి వాటి ని కాగితాలకే పరిమితంచేసి అబద్ధాలుగా మార్చాడు. మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక కల్తీ మద్యాన్నిఅధికధరకు విక్రయి స్తూ, వీధికో మద్యందుకాణం పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడు.

మద్యం అమ్మకాలకోసం ఉపాధ్యాయుల్ని కూడా వాడుకు న్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకు తెగించాడో అర్థంచేసుకోవచ్చు. మద్యంఅమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని 25సంవత్సరాలు తాకట్టుపెట్టి 25వేలకోట్ల రుణం పొందిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. మహిళల యోగక్షేమా ల గురించి ఆలోచించేవాడు ఎవడైనా వారితాళిబొట్లుతాకట్టు పెట్టి అప్పులుతీసుకొచ్చి ఆ సొమ్ముని దిగమింగు తాడా? తనఅవినీతి, అక్రమార్జనకోసం కల్తీమద్యం అమ్ముతూ, ప్రతిమహిళని నడి రోడ్డుపై నిలబెట్టాడనే చెప్పాలి.

జగన్ పాలనలో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, ఏ.ఎన్.ఎంలు రోడ్డెక్కారు. వారి సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని అడిగినందుకు పోలీసులతో వారిని దారుణంగా హింసిస్తున్నారు. మహిళల్ని నిరోధించడానికి మహిళాపోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేస్థితికి ముఖ్యమంత్రి వచ్చాడంటే ఎంతదారుణమైన పరిస్థితులు రాష్ట్రం లో ఉన్నాయో అందరూ అర్థంచేసుకోవాలి. పరదాలు, పోలీసులమాటున నక్కే జగన్, చివరకు మహిళల్న చూసి భయపడే దుస్థితికి వచ్చాడు. సొంతతల్లిని, చెల్లిని గెంటేసి నవాడు, రాష్ట్రంలోని మహిళలకు న్యాయంచేస్తాడనుకోవడం అత్యాశే.

జగన్ దుర్మార్గపు పాలనలో అన్నివిధాలా నష్టపోయి, కన్నీరింకిన కళ్లతో తమను ఆదుకునేది ఎవరా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఒకఅన్నగా, ఒకబిడ్డగా తానున్నానని చంద్రబాబునాయుడు ముందుకొచ్చారు. మహిళల్ని ఆదుకోవడానికి మహాశక్తి పేరుతో, తెలుగుదేశం మహానాడువేదికపై గొప్ప పథకాలు ప్రకటించారు. ఆయన ప్రకటించిన పథకాలు కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. టీడీపీప్రభుత్వం రాగానే మహిళాభివృద్ధికి, వారిస్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు అధికప్రాధాన్య త ఇస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీఅధినేత ప్రకటించిన మహాశక్తిపై ఎవరెన్ని కారుకూతలు కూసినా వారికి ఎలాచెప్పాలో అలానే సమాధానంచెబుతాం.

భవిష్యత్ కు గ్యారంటీ… బాబు గ్యారంటీ. మహిళాశక్తి పథకాలపై ప్రతిమహిళ సంతోషంగా ఉంది.
మహాశక్తి పథకాలు వైసీపీప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయని, జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని చాలామంది మహిళలు చెబుతున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.1500చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే జమచేయడం. తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ఎంతమంది చదు వుకునే పిల్లలుంటే అందరికీ నెలకు రూ.15,000చొప్పున అందించడం. దీపంపథకం కింద గతంలోనే చంద్రబాబు మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించారు. దానిలో భాగం గా రేపు టీడీపీప్రభుత్వం రాగానే ప్రతికుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకు ఉచితబస్సు ప్రయాణసౌకర్యం కల్పించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన ఉచిత మంచినీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

మహిళాశక్తి పథకాలు అర్హులైన వైసీపీ మహిళా నేతలకు, మహిళా మంత్రులకు కూడా అందిస్తాం
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన మహిళాశక్తి పథకాలు అర్హత ఉన్న ప్రతి మహిళకు అందుతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మహిళలకు కూడా అందిస్తాం. మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రులు తానేటివనిత, రోజా, ఇలా ఎవరైనా మహశక్తిపథకాలు పొందవచ్చు. జగన్ రెడ్డిలాగా నిబంధనలపేరుతో కోతలుపెట్టి, మహిళలకు అన్యాయంచేయడం జరగదు. మహిళలపై జరిగే అత్యాచారాలు, నేరాలుఘోరాలపై ఎవరు ప్రశ్నించినా ప్రభుత్వం, అధికారపార్టీలోని మహిళలు బూతులుతిడుతున్నారు తప్ప, సాటిమహిళలకు న్యాయం చేయాలనే ఆలోచన చేయడంలేదు.” అని అనిత స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE