-కేంద్రమంత్రికిషన్‌రెడ్డి
బీజేపీపై సీఎం కేసీఆర్ అనేక విమర్శలు చేశారని, బీజేపీని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ కానీ, కేంద్రం కానీ భయపడదన్నారు. 2014లో కేంద్రం 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. ఇప్పుడు 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని, రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోందన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ వాస్తవ విషయాలు చెప్పకుండా రైతుల్ని తప్పుదోవ పట్టించడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. ఉపఎన్నికలో కూడా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. పంజాబ్ నుంచి కేంద్రం 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని, సమస్య మొత్తం దొడ్డు బియ్యం గురించేనన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎవరూ తినరని, కేరళలో కూడా తగ్గించారన్నారు. సాధ్యమైనంతవరకూ బాయిల్డ్‌రైస్ తగ్గించాలని చెప్పామన్నారు. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ దొడ్డు బియ్యం పంపించదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, దొడ్డు బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోతుందని కిషన్‌రెడ్డి అన్నారు.