-రాష్ట్రాన్ని కరువు రక్కసి కబళిస్తుంటే…జగన్ కు చీమకుట్టినట్టు కూడా లేదు
• అకాలవర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లకుండా సహాయకచర్యలకు ఆటంకమని తప్పించుకున్న జగన్ రెడ్డి..నేడు కరువుకోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న రైతుల ముఖం చూడటానికి తాడేపల్లి వదిలి ఎందుకు రావడంలేదు?
• పక్కరాష్ట్రం అన్నపూర్ణలా మారిందని అక్కడి పాలకులు చెబుతుంటే..మన అన్నపూర్ణమ్మ (ఏపీ) బిడ్డల ఆకలి తీర్చలేని అభాగ్యస్థితికి రావడానికి ఈ ముఖ్యమంత్రే కారణం
• వర్షాలను తమఘనతగా చెప్పుకొని..వరుణుడు తమ మనిషే అన్న జగన్.. అతని పార్టీ రాష్ట్రంలో నెలకొన్న కరువును ఎలా సమర్థించుకుంటుంది?
• సైకో పాలనలో తనకు కూడా పిచ్చెక్కుతుందని వరుణుడు కూడా రాష్ట్రం విడిచాడా?
• జలవనరులశాఖ మంత్రిగా ఉండి.. జలనిర్వహణ సక్రమంగా చేపట్టి… కర్షకజనానికి కష్టాలు రాకుండా చూడాల్సిన వాడు ప్రజలు, ప్రతిపక్షాలపై .. కాట్లకుక్కలా మొరుగుతుంటాడు
• సేద్యం మంత్రిగా వెలగబెడుతున్న ఫైళ్ల దొంగేమో పైల్స్ రోగం వచ్చినవాడిలా ఇల్లొదిలి పొలాల్లోకి రాడు. ఇదీ వీళ్లవరస.
• తనపార్టీపేరులో ఉన్న రైతుని గుర్తించలేని జగన్ రెడ్డి… రైతుల కష్టాలు.. వారు కోల్పోయిన సర్వస్వాన్ని గుర్తిస్తాడా?
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్
“రాష్ట్రాన్ని కరువు రక్కసి కబళిస్తే..సైకో జగన్ సొంతపార్టీవాళ్లతో పిచ్చాపాటీ కబుర్లు చెబు తూ, ప్రజల్ని ఎలా మోసగించాలి.. ప్రతిపక్షాలను ఎలా తప్పుడుకేసులతో రాష్ట్రంలో లేకుండా చేయాలని మంతనాలు జరుపుతున్నాడు. అకాలవర్షాలతో నష్టపోయిన రైతాంగం ముఖం చూడకుండా.. సహాయచర్యలకు విఘాతం కలుగుతుందని చెప్పి తప్పించుకున్న జగన్ రెడ్డి… కరువుబారిన పడిన రైతాంగాన్ని పరామర్శించడానికి, బీటలువారిన పంటపొలాల్ని చూడటానికి తాడేపల్లి వదిలి ఎందుకు రాలేదో రైతులకు సమాధానం చెప్పాలి.
తన పార్టీ పేరులో ఉన్న రైతుని గుర్తించలేని జగన్ రెడ్డి… రైతుల కష్టాలు.. వారు కోల్పోయిన సర్వస్వాన్ని గుర్తిస్తాడా? అధికారులతో మొక్కుబడిగా కరువు మండలాలు ప్రకటించి.. చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి ..చేతల మనిషి కాదు.. రైతులకు గుండెకోత మిగిల్చేవాడని ఇప్పటికైనా రైతాంగానికి అర్థమై ఉంటుంది. ప్రతిపక్షాలు..గిట్టనివారిపై అక్రమకేసులు పెట్టడంలో చూపుతున్నశ్రద్ధలో అరవంతుకూడా జగన్ రైతులపై చూపని పర్యవసానమే రాష్ట్రంలో తలెత్తిన దుర్భిక్షం. పక్కరాష్ట్రం అన్నపూర్ణలా మారిందని అక్కడి పాలకులు ప్రచారం చేసుకుంటుంటే..మన అన్నపూర్ణమ్మ (ఏపీ) తన బిడ్డల ఆకలి తీర్చలేని అభాగ్యస్థితికి రావడానికి కారణం ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కాదా?
రైతులు కష్టసుఖాలు గుర్తించి.. వారిని అన్నివిధాల ఆదుకోవడానికి విత్తనం నుంచి పంటల విక్రయం వరకు తెలుగుదేశంపార్టీ అన్నివిధాలా రైతాంగానికి అండగా నిలిస్తే.. నాలుగేళ్లుగా ఈ సైకో రెడ్డి వ్యవసాయంలో వ్యయం పెంచి…కయ్యలను గొయ్యిలుగా మార్చి.. రైతుల్ని ఉరికొయ్యలకు వేలాడేట్టు చేసింది నిజం కాదా? కేంద్రమిచ్చే సొమ్ముకి అరకొర సాయం కలిపి కొందరికే ఇచ్చి.. రైతుల కొండనాలుక్కి మందేస్తానని అసలు నాలుకే లేకుండా చేశాడు. దోపిడీకోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సంకనాకించిన జగన్.. ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలి.. జలాశయాల్లోని నీటిని వృథాచేసి, నేడు రైతులు ఆకాశం వైపు చూసే దుస్థితి కల్పించాడు.
వరుణుడిది మాపార్టీ అని చెప్పుకున్న జగన్ రెడ్డి.. అతని పరివారం నేడు ఆ వరుణుడు రాష్ట్రంపై ఎందుకు కనికరం చూపడంలేదో చెప్పాలి. రాష్ట్రంలోని పిచ్చిపాలనతో, ఎక్కడ తనకు కూడా పిచ్చెక్కుతుందోనని వరుణుడు రాష్ట్రం విడిచాడా? జలవనరులశాఖ మంత్రిగా ఉండి.. జలనిర్వహణ సక్రమంగా చేపట్టి… కర్షకజనానికి కష్టాలు రాకుండా చూడాల్సిన వాడు ప్రజలు ప్రతిపక్షాలపై .. కాట్లకుక్కలా మొరుగుతుంటాడు. సేద్యం మంత్రిగా వెలగబెడుతున్న ఫైళ్ల దొంగేమో పైల్స్ రోగం వచ్చినవాడిలా ఇల్లొదిలి పొలాల్లోకి రాడు. ఇదీ వీళ్లవరస.
వ్యవసాయాన్ని గాలికొదిలేసి.. రైతుల ఆత్మహత్యలకు కారకుడైన వ్యవసాయమంత్రిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదుచేయాలి దద్మమ్మలు.. అసమర్థులు.. రైతులగోడు పట్టని రాక్షసుల్ని రాష్ట్రం నుంచి తరమక పోతే ఆంధ్రప్రదేశ్ అనాథప్రదేశ్ గా మారి..ఆకలి తీర్చు కోవడానికి అన్య రాష్ట్రాల ఎదుట చెయ్యి చాచాల్సిన దుర్భరత్వానికి దిగజారుతుందని చెప్పడానికి బాధపడుతున్నాం.”