-ముఖ్యమంత్రికి విద్య పట్ల అవగాహన, విద్యావ్యవస్థ పట్ల దూరదృష్టి, విద్యాభివృద్ధిపై ధ్యాస లేవు
– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ
ముఖ్యమంత్రికి విద్య పట్ల అవగాహన, విద్యావ్యవస్థ పట్ల దూరదృష్టి, విద్యాభివృద్ధిపై ధ్యాస లేవని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలనే పేర్లు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కోవిడ్ కారణంగా అనేక ప్రైవేటు పాఠశాలలు మూతపడితే అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడంతో అదంతా తన ఘనతగా జగన్ చెప్పకుంటున్నారు. జగన్ వందిమాగదులను యూనివర్శిటీలలో వీసీలుగా నింపేశారు. ఉన్న విశ్వవిద్యాలయాల్లో శాశ్వత బోధకులు లేరు, రీసెర్చ్ లేదు మరో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదం.
జగన్.. మాయమాటలు, మభ్యపెట్టే పనులు, పసలేని ప్రసంగాలు మానాలి. విద్యార్థులకు మౌలిక వసతులు, సరిపడ ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధనకు చర్యలు తీసుకోలేదు. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా నాసిరకం కిట్లు ఇచ్చారు. ఇచ్చిన బ్యాగు పట్టుకోగానే ఊడిపోతోంది. బ్యాగు పొడవు, వెడల్పులు తగ్గాయి. విద్యార్థుల కాళ్ల కొలతలతో సంబంధం లేకుండా షూస్ ఇవ్వడంతో అవి పనికిరాకుండా పోయాయి. పాఠ్యపుస్తకాలు ఎక్కడా కూడ పూర్తిగా ఇవ్వలేదు. కొన్నిచోట్ల వంద మందిలో ఐదారుగురికి మాత్రమే పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. ఒక ప్రణాళిక లేకుండా కిట్లను పంపిణీ చేశారు. స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేశారు. అక్కడ నుంచి ఎంఈఓలు, హెడ్మాష్టర్లు, సంబంధిత సిబ్బంది స్కూళ్లకు పంపించాలి. కాంట్రాక్టరే స్కూళ్లకు డైరెక్టుగా చేర్చాల్సివుండగా అలా చేర్చలేదు. ఫస్ట్ సెమిస్టర్ లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెకండ్ సెమిష్టర్ లో ఇచ్చారు. అనేక గ్రామాల్లో తమ ఊళ్లల్లోని స్కూళ్లను తొలగించవద్దు అని నిరసనలు చేపట్టిన సంఘటనలు జరిగాయి. 117జీవోని అర్ధరాత్రి తీసుకొచ్చి అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ప్రైమరీ స్కూళ్లల్లో కలిపేయడంతో దాదాపు పది వేల స్కూళ్లు మూసేయాల్సి వచ్చింది. 10 వేల మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఎయిడెడ్ పాఠశాలలను విలీనం చేయడం వలన 10 వేల ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయి. మోడల్ స్కూళ్లలో టీజీటీ స్కూళ్లను పోస్టులను ఎస్జీటీలుగా మార్చడంవలన 6 వేల పోస్టులు రద్దయ్యాయి. ఒక్క సంవత్సరంలోనే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ వల్ల గత సంవత్సరం 26 వేలు, ఈ సంవత్సరం 20 వేల పోస్టులు రద్దయ్యాయి. మొత్తం 54 వేల పైచిలుకు పోస్టులు రద్దయ్యాయి.
2019 ఎన్నికలప్పుడు చాలా ఘీంకరించి ప్రతి సంవత్సరం డీఎస్సీ వస్తామన్నారు.. మెగా డిఎస్సీ దేవుడెరుగు ఒక్క బుల్లి డిఎస్సీని కూడా వేయలేదు. టీడీపీ హయాంలో ప్రైమరీ స్కూల్స్ ల లో 80 మంది ఉపాధ్యాయులుంటే ఐదుగురు టీచర్లను ఇచ్చాం. ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాష్టర్ ని ఇచ్చాం. రాష్ట్రంలోని 45 వేల స్కూళ్లని 11 వేల స్కూళ్లకు తగ్గించాలని చూస్తున్నారు. బైజూస్ తో ఒప్పందం చేసుకొని రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ బడ్జెట్ లో కోత విధించాలని చూస్తున్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. విద్యా వ్యవస్థ పట్ల అతి దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విద్యపై దెబ్బమీద దెబ్బ కొడుతోంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు చెడ్డపేరు వచ్చింది. ముఖ్యంగా సామాన్యుడు నష్టపోయే విధంగా విద్యా వ్యవస్థ ఉంది. చదువుకోవడానికి మూడు కిలోమీటర్లు నడిచివెళ్లే పరిస్థితిని కల్పించారు. కొఠారి కమిషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలని చెబుతోంది. జగన్ తన ఎడ్యుకేషన్ పాలసీనే అనుసరిస్తున్నాడు. 7 వ తరగతి విద్యార్థి 8 వ తరగతిలోకి పోగానే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. మూడు కిలోమీటర్లు వెళ్లి చదువుకోలేక బడి మానేసే అవకాశాలున్నాయి. ఇవన్నీ సామాన్యులను నష్టపరిచే పని. ప్రజలకి కుక్క బిస్కెట్లు విసిరేసి జగన్ మాత్రం బంగారు బిస్కట్లతో ఆనందిస్తున్నాడు. జనం నుంచి అనేక విధాలుగా డబ్బులు లాక్కుంటున్నారు. విద్యా విషయంలో జగన్ పరిపాలన సరిలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు.