ముల్లును ముల్లుతోనే తీస్తున్న మోడీ -1

370 ,35 ఎ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చి, లడ్డాక్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత గతంలో జరిగిన అల్లర్లు, రాళ్లు విసరడాలు, ఉగ్రవాద కార్యకలాపాలు టెర్రరిస్ట్ శిబిరాలు, అన్ని ధ్వంసం చేసిన తర్వాత కుడా ఉనికి కొసం అక్కడక్కడ టెర్రరిస్ట్ గ్రూపులు పనికట్టుకొని 23 మంది పండిట్లను చంపిన సంఘటనలు ఇంకా ఉన్నాయి .ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు ఆగలేదు కొనసాగుతున్నాయి అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం కోసమే వీరు ఈ పని చేస్తున్నారనేది స్పష్టం.

370 ,35 ఎ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ముఫ్థి మహమ్మద్ సయ్యద్ భారతదేశ జెండాని మోయడానికి ఇక్కడ ఎవరూ ఉండరని మాట్లాడిన విషయం మనం మర్చిపోలేదు . కానీ ఆగస్టు 15న జాతీయ జెండాను మిగతా దేశం మొత్తం ప్రభుత్వ కార్యాలయాల మీద స్కూలు మీద దేశభక్తి పౌరులు సొంత పార్టీ కార్యాలయాల మీద ఎగరవేసుకున్న విషయం మనకందరికీ తెలుసు.

వారి ఉద్దేశం, కష్టమేమిటంటే గతంలో 370 ఆర్టికల్ అమలులో ఉన్నప్పుడు బయట ప్రజలు ఎవరూ కూడా సెంటు భూమి కొనడానికి అక్కడ నివసించడానికి హక్కులు లేవు. ఈరోజున ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ భూములు కొనుక్కునే హక్కు పరిశ్రమలు పెట్టుకునే హక్కు అన్ని రకాల హక్కులు వచ్చివేసాయి. ఇక్కడి అందాలు స్విట్జర్లాండ్ కంటే కూడా ప్రకృతి సోయగాలు ఆకర్షితంగా ఉంటాయని చెప్పుకుంటుంటారు.

ఈ జి -20 సదస్సుకు ప్రతి దేశానికి ఒక ఇంచార్జ్ నియమిస్తారు మన దేశం నుండి ప్రతిభావంతుడు, రాజ్యసభలో బిజెపి నాయకుడు శ్రీ పియుష్ గోయిల్ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి గారిని నియమించారు ఆ సదస్సు నిర్వహించే వారిని ” షేర్ప” అని పిలుస్తారు.

ఈ సదస్సులో మొత్తం 190 సమావేశాలు వరకు జరగవచ్చు. కొన్ని సమావేశాలు ఢిల్లీలో కూడా జరగవచ్చు ఈ సదస్సులో పాజిటివ్ దృక్పథంతో దౌత్య సంబంధ విషయాలు కూడా చర్చించాలని భారత్ కోరిక.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గారి తోటి, త్రివిధ దళాధిపతులతోటి,ట్రాన్స్పోర్ట్ సెక్రెటరీ గారి తోటి ,టూరిజం సెక్రటరీ గారి తోటి, హాస్పిటలాలిటి సెక్రటరీ గారి తోటి చర్చలు జరిపి ప్లానింగ్ చేయడం జరిగింది .

గతంలో జమ్మూ కాశ్మీర్లో కన్జ్వల్ వన్ అనే గ్రామంలో అశోకుడు కాలంలో ప్రపంచ బౌద్ధ బిక్షువులు జ్ఞాన సమపార్జన కోసం అక్కడకొచ్చి ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకున్నట్టుగా ఆనమాళ్లు ఉన్నాయి .

ఈ సదస్సు జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ జమ్మూ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టి భారతదేశం ఆర్థికంగా ఎంతో ముందుకు పోయే దానికోసం, భారతదేశంలో మిగతా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో అదే విధంగా చెందిందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి .

సినిమా ప్రొడ్యూసర్లు కాశ్మీర్ అందాలను గతంలో సినిమాలలో చూపించేవారు షూటింగ్లు చేసేవారు ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి రాబోతుంది ఎందుకంటే చాలామంది ముంబై నుండి, హైదరాబాదు నుండి, చెన్నై నుండి ప్రొడ్యూసర్లు ,టెక్నీషియన్లు కాశ్మీర్ ను సందర్శించి వచ్చి ఉన్నారు .ఇప్పటికే
యూనియన్ అరబ్ ఎమిరేట్స్ వారు జమ్మూ కాశ్మీర్లో పరిశ్రమలు స్థాపించుటకు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ అధికారులతో సంప్రదింపులు జరిపి పోయి ఉన్నారు.

అరబ్ ఎమిరేట్స్ వారు పెట్టుబడులు పెట్టుట పాకిస్తాన్ కు ఏమాత్రం నచ్చడం లేదు .ఎందుకంటే వారిని వ్యతిరేకించి అక్కడ ఏదైనా జరగరాని చర్య జరపటానికి ఉగ్రవాద చర్యలు జరిపితే ప్రపంచ ముస్లిం దేశాలలో దోషిగా నిలబడిపోతారు .

ఇదంతా మోడీ గారి ముందుచూపుతోటి భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపాలనే దృడమైన ఆలోచనతోనే జరుగుతున్నాయి .కావున దేశ ప్రజలందరూ మోడీ గారిని ముక్తకంఠంతో బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది .

మీ ,
కరణం భాస్కర్ ,
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .

Leave a Reply