Suryaa.co.in

Andhra Pradesh

యువత కలలను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తున్నాడు

– మటన్, చేపలు అమ్మించడం.. మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలుచేయించడం వంటి పనులతో, యువతను, వారి కలలను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తున్నాడు
• యువతకు, నిరుద్యోగులకు న్యాయంచేయలేక, ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, వారిని మటన్ మార్టులకు, చేపలదుకాణాలకు పరిమితం చేస్తున్నాడు
• చదువుకున్నవారంటే ముఖ్యమంత్రికి కోపం. అందుకే వారితో నానాఛండాలపు పనులు చేయిస్తున్నాడు
• ఎంబీఏ, ఎంసీఏలుచదివిన వారు మరుగుదొడ్ల వద్ద నిలబడి 3, 4 రూపాయలు వసూలుచేస్తుంటే, ఉపాధ్యాయులేమో మద్యం దుకాణాల వద్ద మందుబాబులను సరిచేస్తున్నారు
• పోలీసులు, రెవెన్యూసిబ్బందేమో సినిమాహాళ్లవద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్నారు
• నిరుద్యోగులకు డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.
• సచివాలయ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి, వాలంటీర్లకు ఎప్పుడుజీతాలు పెంచుతాడో జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేయాలి
-కే.ఎస్.జవహర్

రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరిచూస్తుంటే , మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే మడిచిఎక్కడో పెట్టుకున్న తీరుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు..ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

విద్య యొక్కవిలువ, దానిగొప్పతనం, విశిష్టత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం సిగ్గుచేటు. ఉద్యోగమనే మాటకు అసలు ఈముఖ్యమంత్రికి అర్థం తెలుసా? ఎంబీఏ, ఎంసీఏల చదివిన వారిని 3, 4 రూపాయలవసూళ్లకోసం మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి తీరు దారుణాతి దారుణం. చదువుకున్నవారంటే ముఖ్యమంత్రికి కోపం, ఎందుకంటే తనే పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నని చెప్పుకుంటాడు.

అలాంటి వ్యక్తిని మించి మరెవరుబాగాచదివినా ఈ ముఖ్యమంత్రికి నచ్చదని ఆయనచర్యలతోనే అర్థమవతోంది. తాను తప్పులుచేస్తూ పాలనచేయడమేగాక, తప్పులు మాట్లా డుతూ, వాటిని సరిచేసుకోవడానికి తిప్పలుపడటం ఈ ముఖ్య మంత్రికి ఫ్యాషనైంది. నిరుద్యోగులకు డీఎస్సీ, ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.

తన అవినీతి, అక్రమసంపాదనకోసం ఈ ముఖ్యమంత్రి, ఉపాధ్యాయులను మద్యం దుకాణాలవద్దఉంచి మద్యాన్ని అమ్మిం చాడు. అంతటితో ఆగకుండా ఇటీవల, పోలీసులు రెవెన్యూ సిబ్బందినేమో బ్లాక్ లో సినిమాటిక్కెట్లు అమ్మడానికి పెట్టాడు. చూడబోతే రేపు ఐఏఎస్ లతో అరటికాయలు అమ్మిస్తాడేమో అనిపిస్తోంది.

రాష్ట్రంలోని పాఠశాలల్నికూడా తన అవినీతి వనరుగా మార్చు కున్నాడు. ఊరికే పాఠశాలల గదులకు, గోడలకు రంగులేస్తే విద్యార్థులు అన్నిఅంశాల్లోనిష్ణాతులుకారన్న వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు గ్రహించడు? పాఠశాలల్లోని ఉపాధ్యాయఖాళీలను భర్తీచేయకుండా నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థను జగన్ రెడ్డి నీరుగార్చాడు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వఉద్యోగుల అనిచెబుతూ, వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు. ఈముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులను ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తాడో సమాధానం చెప్పాలి.

25వేల ఉపాధ్యాయఖాళీల భర్తీ ఎప్పుడు అవుతుందోకూడా స్పష్టంచేయాలి. మరుగుదొడ్లవద్ద యువతను కాపలాపెట్టిన వ్యక్తి, రేపు ఐఏఎస్ లతో చేయకూడని పనులు చేయిస్తాడు.ఉద్యోగాలు ఇవ్వలేని విభాగాన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సవాంగ్ కు అప్పగించాడు. తాడేపల్లి మేడగదిలోకూర్చొని పోలీసులను అడ్డంపెట్టుకొని బతకడం పరిపాలన కాదని ముఖ్యమంత్రి గ్రహించాలి. తనతప్పులు, నేరాలు, అవినీతి కప్పిపుచ్చుకోవడం తప్ప, ముఖ్యమంత్రికి యువతకు మెరుగైనఉపాధి, ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనలేదు.ఇప్పటికైనా యువత, మరీముఖ్యంగా బాధ్యతగల ప్రభుత్వఉద్యోగులు ఎవరిపాలనలో తాము సంతోషంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం.

LEAVE A RESPONSE