Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల నుండి ఖజానా నింపుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు

– సినిమా టిక్కెట్ల ధరలు సామాన్యులకోసమే తగ్గించానంటున్న జగన్మోహన్ రెడ్డి, సిమెంట్, ఇసుక, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు, పన్నులభారాన్ని ఎందుకు తగ్గించడు?
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

పల్లెల్లో సంక్రాంతి సందడి ప్రారంభంకాకముందే, జగన్మోహన్ రెడ్డి తనదోపిడీ కార్యక్రమాన్ని షురూచేశాడని, పండుగను దృష్టిలోపెట్టుకొని ఈ ప్రభుత్వం స్పెషల్ బస్సులపేరుతో ఆర్టీసీఛార్జీలు 50శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని, సినిమాటిక్కెట్ల ధరలు తగ్గిస్తానంటున్న ముఖ్యమంత్రి, అదేసమయంలో బస్సుఛార్జీలరూపంలో ప్రజలను బాదడానికి సిద్ధమయ్యాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

కేవలం, ఒకటిరెండు వర్గాలపై తనకున్న కసితీర్చుకునే క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రపంచం గర్వించే తెలుగుచిత్రపరిశ్రమను మూసేయడానికి సిద్ధమయ్యాడు. సినిమాలు సామాన్యులే అధికంగా చూస్తారు కాబట్టి, టిక్కెట్లధరలు తగ్గించామనిచెబుతున్న ముఖ్యమంత్రి, మరి సామాన్యుల రవాణావ్యవస్థ అయిన ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నాడో ఆయనే సమా ధానంచెప్పాలి. ఆర్టీసీఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు కూడా సామాన్యులకు సంబంధించిన అంశాలే కదా?

ముఖ్యమంత్రి కేవలం రెండు, మూడు కులాలు, ఒకరిద్దరు నటులను లక్ష్యంగా చేసుకొని మొత్తంపరిశ్రమనే దెబ్బతీస్తున్నాడు. కొన్నిలక్షలమంది సినీపరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. వారిలో ఎస్సీ,ఎస్టీలు,

బీసీల, మైనారిటీ వర్గాలే అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో థియేటర్ల యజమానులతో పాటు, వాటిని నమ్ముకొని బతికే వివిధవర్గాల ప్రజల ఉసురు పోసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో వారంతా ఉపాధికోల్పోయి రోడ్డునపడ్డారు.

ధరలు పెంచితే ప్రజలకు షాక్ కొట్టాలంటూ మద్యంధరలు పెంచిన ముఖ్యమంత్రి, అదేపద్ధతిలో సిమెంట్, ఇనుము, ఇసుక ధరలు ఎందుకుపెంచాడో సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మద్యం తాగేవారిని, తద్వారా వచ్చేఆదాయాన్ని 20ఏళ్లకు తాకట్టుపెట్టి అప్పులు పొందిన జగన్మోహన్ రెడ్డి, అదేపద్ధతిలో సినిమారంగాన్ని, దానిపైవచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు పొందాలనిచూస్తున్నాడు. ముందు ముఖ్యమంత్రి తక్షణమే పెంచిన నిత్యావసరాలధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు,ఇసుకసహా తనహాయాంలో ప్రజలపై మోపిన వివిధరకాల పన్నులు, ఇతర ధరలు తగ్గించాలి. ఆ తరువాతే ఆయన సినిమాటిక్కెట్ల ధరలగురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం.

రాబోయే రోజుల్లో విద్యుత్ టారిఫ్ లు పెంచడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రణాళికలు వేసేశా డు. ఒకఇంట్లో ఇప్పటివరకు అద్దెకు ఉండేవారు సబ్ మీటర్లు వినియోగించి, వారు వాడుకున్న విద్యుత్ వినియోగానికి తగినట్టుగా బిల్లులుచెల్లించేవారు. కానీ ముఖ్యమంత్రి ఆ విధానానికి స్వస్తిచెప్పి, ఒకఇంట్లో ఒకటే మీటర్ విధానాన్ని తీసుకొచ్చి, దాన్ని కమర్షియల్ కేటగిరీలోకి మార్చి, భారీగా విద్యుత్ ఛార్జీలపెంపుతో దోపిడీకి సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి విద్యుత్ టారిఫ్ లపేరుతో చేస్తున్నదోపిడీని తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి, ఒకే ఇల్లు, ఒకటే మీటర్ విధానం అమలు పరచాలనుకుంటున్నాడు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఒకటే విద్యుత్ శ్లాబ్ విధానాన్ని అమలుచేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి, తన తాడేపల్లి ప్యాలెస్ లో, బెంగుళూరు ప్యాలెస్ లో, లోటస్ పాండ్, ఇడుపులపాయ ఎస్టేట్ లలోకూడా ఒకటే మీటర్ వాడుతుతున్నాడా, ఒకే టారిఫ్ ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నాడా అని ప్రశ్ని స్తున్నాం. తెలుగుదేశం పార్టీ తనతప్పుని ఎత్తిచూపేవరకు ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ ఇంటిపన్ను, ఇతరపన్నులుకూడా కట్టలేదు.

2020 ఫిబ్రవరిలో 500యూనిట్లు దాటితే ఒకరకమైన బాదుడుబాదిన ముఖ్యమంత్రి, తరువాత కరోనా సమయంలో రెండునెలలకు ఒకసారి రీడింగ్ లు తీసి మరోరకంగా బాదాడు. కిలో వాట్ కు రూ.10నుంచి రూ.20వరకు అదనపు ఛార్జీలు పెంచడంద్వారా మరోబాదుడు బాదిన ముఖ్యమంత్రి, సెప్టెంబర్ 21లో ట్రూఅప్ ఛార్జీల పేరుతో వీరబాదుడుబాదాడు. ఇప్పుడేమో మినిమం విద్యుత్ వినియోగాన్ని 30 యూనిట్లకు కుదించి మరోరకమైన దోపిడీకి ప్రణాళికలు వేస్తున్నాడు.

ఇవన్నీ చాలవన్నట్లు రైతుల మోటార్లకు మీటర్లుబిగించి, వారినికూడా కోలుకోలేని విధంగా భవిష్యత్ లో ఉచిత విద్యుత్ ఎత్తేయాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ విద్యుత్ వినియోగదారులను ఏరకంగా ఎలాదోచుకోవాలనే అంశంచుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక కోతలు, కూతలు తప్ప, ప్రజలకు ఒరిగిందేమీలేదు. సంక్షేమపథకాల్లో విపరీతమైన కోతలుపెట్టిన ప్రభుత్వం, మరోపక్క ప్రజలను ఆచెంప, ఈ చెంప బాదే కార్యక్రమాన్నిమాత్రం నిరంతరాయంగా కొనసాగిస్తోంది.

పేదలఇళ్లపై ఎలాంటిఅప్పులు లేకపోయినా కూడా, అప్పులుఉన్నట్లు వాటిలో రూ.10వేలకోట్లు మాఫీచేస్తున్నట్లు నమ్మిస్తున్నాడు. ఓటీఎస్ పేరుతో ఇళ్లకు రూ.10, రూ.15, రూ.20వేలచొప్పున కట్టాలంటూ వేధిస్తున్నాడు. ఓటీఎస్ పేరుతో జగనన్నసంపూర్ణగృహ హక్కు అంటూ జగన్మోహన్ రెడ్డి తనఖజానా నింపుకునే చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ తీసుకొచ్చిన ఓటీఎస్ స్కీమ్ ను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని, నిన్న టీడీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలతో తేలిపోయింది.

మాయమాటలతో పేదలను బలిపశువుల్నిచేస్తూ, ముఖ్యమంత్రి తనఖజానా నింపుకుం టున్నాడు. జగన్మోహన్ రెడ్డి దోపిడీదెబ్బకు తాళలేక ఇప్పటికే రాష్ట్రంలోని అనేకరంగాలు కుదేలయ్యాయి. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ముఖ్యమంత్రి తమపై వేస్తున్నభారాలను ప్రతిఘటించే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టంచేస్తున్నాం. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని బస్సుఛార్జీలను 50శాతం పెంచాలన్న తననిర్ణయాన్ని ముఖ్యమంత్రి తక్షణమే వెనక్కుతీసుకోవాలి.

అలానే ఒకఇల్లు, ఒకటే మీటర్ విధానం అమలుకు కూడా ముఖ్యమంత్రి స్వస్తిచెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు సహా, నిత్యావసరాల ధరలు, ప్రజలపై మోపిన వివిధరకాల పన్నులను జగన్మోహన్ రెడ్డి తక్షణమే తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి తనబాదుడుకి స్వస్తి పలక్కపోతే, ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంనుంచి దించి, హోం క్వారంటైన్ కు పంపే రోజు తొందర్లోనే వస్తుంది.

LEAVE A RESPONSE