చట్ట వ్యతిరేకంగా చేసే పనులు దారుణంగా ఉన్నాయి.
సుప్రీం కోర్టు నిర్ణయాలను లెక్కచేసే పరిస్థితి లేదు.
గతంలో జరిగిన సంఘటనల మీద కొన్ని కేసులు కోర్టులో ఉన్నా సీఐడీ కి భయం లేదు.
ఎంపీ రఘురామకృష్ణరాజును జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే,అతనిపై మీరు ప్రవర్తించిన తీరు దారుణం…కస్టోడియల్ మర్డర్ చేయాలని చూశారు.
కేంద్రం,గవర్నర్, కోర్టుల తలుపులు తట్టడంతో ఆయన మీ చెర నుండి బయటపెట్టాడు.
పోలీసుల క్రూరత్వాన్ని ఎంపీపై ప్రదర్శించారు.
ఎంపీని రాత్రి అంతా కొట్టి, భయపెట్టి, వైద్య పరీక్షలకు కూడా సరైన పద్దతిలో పంపలేదు. ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉంటే ఆ రోజే రాజీనామా చేసేవారు…
సొంత ఎంపీనే వైసీపీ ఇబ్బందులకు గురిచేసింది.
బాబాయ్ హత్య చేసి, దాన్ని వేరొకరిపై రుద్దారు…దీనిపై మీకు వ్యతిరేకంగా మట్లాడిన వారిపై చిత్రహింసలకు గురిచేశారు…
600 మంది మీద కేసులు పెట్టారు, 41ఏ నోటీసు ఇవ్వకుండా 120 మందిని అరెస్టు చేశారు..
వెంకటేష్, సాంబశివరావు కేసులో సీఐడీ అధికారులు వ్యవహరించన తీరు వారి పిచ్చికి పరాకాష్ట….
కొంత మంది టెయిన్టెడ్(కళంకం ఉన్న) అధికారులపై ఆరోపణలు, సైకో ప్రవర్తన ఉందో అటువంటి వారిని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు…
ఇటువంటి వారంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే చూస్తూ ఊరుకోం.
చట్టం ముందు దోషులుగా నిలబెడతాం…ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం…
ఎన్ని వేలమందిని పోలీసు కస్టడీలో కొడతారో మేమూ చూస్తాం…
ఎన్నిసార్లు సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తారో మేమూ చూస్తాం…గుర్తు పెట్టకోండి..
నిజాయితీగా పనిచేసే అధికారులను మేం అభినందిస్తాం…
ప్రజావ్యతిరేక పార్టీలపై మేం రాజీలేని పోరాటం చేస్తాం…
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి కాని, చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు గుర్తు పెట్టుకోండి…టార్చర్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం.
మీ బాగోతం..మీ చిట్టా విప్పుతా..
మీకు ఈ అధికారం ఎవడిచ్చాడో మీ స్టేషన్ కు నేనే వచ్చి నిలదీస్తా…సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు…
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను…మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను…22 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మాది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే…ఈ విషయాన్ని గుర్తు పెట్టకోవాలి…
40సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇంత నీచమైన పరిపాలన చూడలేదు…ఇటువంటి నీచమైన పరిపాలనకు మీరు బలికావొద్దు….
మా పార్టీలో పనిచేస్తున్న ఫ్రీ లాన్సర్ ఉద్యోగిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా…
ఆయన చేసిన తప్పు ఏంటో చెబుతారు వినండి…
బాధితుడు సాంబశివరావు మాట్లాడుతూ…
‘’ఉదయం 7గంటలకు మా ఇంటి తలుపు తట్టారు. నేను తలుపు తీశాను. సాంబ అంటే నువ్వేనా అని అడిగితే, అవును అన్నాను. నీ ఫోను ఇటు ఇవ్వరా ఎర్రి….కా అని బెదిరించారు. కంగారు పడి నా బెడ్ రూమ్ లోకి పారిపోయాను. అక్కడ నా భార్య బిడ్డకు పాలు ఇస్తోంది. అక్కడికి కూడా పోలీసులు వచ్చి, నన్ను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. నా భార్య వచ్చి నా భర్తను ఎక్కడికి తీసుకెళుతున్నారని వారిని అడిగితే, గుంటూరు అని చెప్పి నన్ను లాక్కెళ్లారు. నన్న సీఐడీ కార్యాలయంలోకి తీసుకెళ్లి షర్టు, ఫ్యాంటు విప్పి మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. ఎస్.ఐ. జయకృష్ణ, కానిస్టేబుల్ శ్రీనివాస్ నాతో మాట్లాడుతూ..వెంకట్ చేసిన పోస్టును నువ్వే తయారు చేశావా యారా అని అడిగారు. అడుగుతూనే నా మోకాళ్లపై కర్రలతో ఇద్దరూ కొట్టారు. ఆ తర్వాత గోడకుర్చీ వేయించారు. కాసేపటి తర్వాత నన్ను అటూ, ఇటూ నడిపించి, కాళ్లు కడుక్కుని రారా..అని పంపారు. ఆ తర్వాత కూర్చోబెట్టి ఒకర ఒక కాలు, మరొకరు మరో కాలు పట్టుకుని చెరోవైపు కాళ్లను లాగుతూ ప్రశ్నలు వేశారు. కాసేపు తర్వాత మళ్లీ కాళ్లు కడుక్కుని రమ్మన్నారు. కాసేపటికి డీఎస్పీ వచ్చారు నా దగ్గరకు. నిన్ను ఎవరైనా కొట్టారా అని అడిగారు. కొట్టారు అని చెప్పాను. అందరూ కలిసి బయటికి వెళ్లి మాట్లాడుకుని వచ్చి పోలీసులు నిన్ను కొట్టలేదు, విచారించారు..కొట్టడం అంటే ఇలా ఉండదు…నీకు కేవలం ఒక్కశాతం మాత్రమే చూపించారు అని డీఎస్పీ అన్నారు. బయట ఎవరైనా అడిగితే కొట్టలేదు అని చెప్పారు. నన్ను కిందికి తీసుకొచ్చే సరికి నా ల్యాప్ టాప్ తెచ్చి ఉంచారు. ఈ-మెయిల్ ఓపెన్ చేయాలని కోరారు. కంగారులో నేను దాన్ని ఓపెన్ చేయలేకపోయాను. అక్కడున్న సీనియర్ ఆఫీసర్ లక్మణ్ నాటకాలు వే స్తున్నవా …అంటూ నన్ను గుండెల్లో గుద్దారు. గుండెల్లో నొప్పి వచ్చి గట్టిగా అరవడంతో లక్షణ్ నాటకాలు అంటూ… నా కొడకా అని తిట్టారు. మళ్లీ మళ్లీ పాస్ వర్డ్ కొట్టాలని కోరారు. నేనున్న కంగారులో పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీంతో నాకు 41ఏ నోటీసు ఇచ్చి ఇంటికి వెళ్లమన్నారు. వస్తూ ఉండగా..పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు…బయట ఎవరైనా అడిగితే కొట్టలేదని చెప్పాలని, కొట్టామని చెబితే గంజాయి కేసులు పెడతామని బెదిరించారు’’ అన్నాడు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… బాలింత తన బిడ్డకు పాలు ఇస్తుంటే పోలీసు ఆ గదిలోకి ఎలా వెళతాడు..అసలు అతనికి మానవత్వం ఉందా? మనిషి పుట్టుకేనా అతనిది? దీనికి డీజీపీ, సీబీసీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి…సాంబశివరావు కులం ఎందుకు అడిగారు? అతని జాతి మీకు ఎందుకు? కాపు కులంలో ఎలా పుట్టావురా అని ఎందుకు అడిగారు? మీరు ఏమైనా డిక్టేటర్లా? పిచ్చి పట్టిందా? పిచ్చి పరిపాలనలో మీకు కూడా ఏమైనా పిచ్చిపంట్టిందా? వెంకటేష్ ఇంటికి పోయిన విధానానికి సంబంధించిన వీడియోలను ప్రెస్ మీట్ లో స్క్రీన్ లో ప్రదర్శించారు… సోషల్ మీడియాలో నేరాలు జరిగితే 41ఏ నోటీసు ఇవ్వాలి. ఈ నోటీసు ఇవ్వడానికి అర్థరాత్రి వెళ్లాలా? వెంకటేష్ చేసిన నేరం ఏంటి….ఎవరో పెట్టిన పోస్ట్ ను షేర్ చేయడమేనా? అర్థరాత్రి గోడలు దూకడం ఏంటి? మీరు ఏమైనా దొంగలా? రౌడీలా? వైసీపీ గూండాలా?
గొప్ప టెయిన్టెడ్ ఆఫీసర్ సి.జగదీష్ కు గోడలు దూకే అలవాట్లు ఉన్నాయి….ఆంబోతులు మాదిరిగా ప్రవర్తిస్తారా?
మీరు నిజాయితీగా డ్యూటీ చేసేవారు అయితే ఇంటి తలుపులు పగులకొట్టడం, గడ్డ పలుగులతో తలుపులు పగులకొట్టడం, వీడియోలు తీస్తున్నారని లైట్లు పగులకొట్టడం ఏంటి? మొత్తం ఫోన్లు అన్నీ లాగేసుకున్నారు. వెంకటేష్ ను లాక్కెళుతుంటే అడ్డుపడిన తన సోదరిని బలవంతంగా నెట్టేసి, ఇంటి గదిలో పెట్టి తలుపు మూసేశారు. ఇది అరాచకం కాదా? అర్థరాత్రి అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లడం ఏంటి?
అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి….?
ఈ రెండు అరెస్టు కేసులను ప్రతిఒక్కరూ రాష్ట్రమంతా ప్రశ్నించాలి రానున్న కాలంలో…
డికె బసు, వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ విధంగా ఉంది…
1. పోలీసులు ఖచ్చితంగా తమ పేరు, పదవి తెలిసేలా ట్యాగ్ పెట్టుకోవాలి. దీని ప్రకారం ద గ్రేట్ గోడ దూకే సీఐ జగదీష్….నువ్వు నేమ్ ట్యాగ్ పెట్టుకున్నావా?
2. అరెస్టు మెమో ఇవ్వాలి, అరెస్టు చేస్తున్నవారిని ఏ సమయానికి అరెస్టు చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం? అనే విషయాలను సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.
దీనిపై డీజీపీ, సీబీసీఐడీ సమాధానం చెప్పాలి..
మా కార్యాలయంలో పనిచేస్తున్నాడని చెబితే కొడతారా? మా ఆఫీసులో పనిచేయకూడదా? మీరు కొడితే మా ఆఫీసులో ఎవరూ పనిచేయరు అనుకుంటున్నారా?
మా ఆఫీసు మీద దాడిజరిగితే ఇంత వరకు ఏ చర్యలూ తీసుకోలేదు. సిగ్గుండాలి ఇటువంటి అధికారులకు. ఇటువంటి అధికారులకు ఖాకీ బట్టలు వేసుకునే అర్హత కూడా లేదు. నేను కేవలం టెయింటెడ్ ఆఫీసర్లు గురించే మాట్లాడుతున్నాను…
8 నుండి 12 గంటల మధ్య కుటుంబ సభ్యులకు అరెస్టు చేసిన వ్యక్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. కానీ చెప్పలేదు.
బాధితురాలి ఫిర్యాదు కాపీని చదివి వినిపించారు….జగదీష్ వికృత చర్యలను మీడియాకు వివరించారు…
ఇటువంటి నేరచరిత్ర కలిగిన ఆఫీసర్లను సీఐడీ డ్యూటీల్లో కొనసాగిస్తోంది…
వెంకటేష్ ను చిత్రహింసలకు గురిచేస్తే అతని ఎముకలు విరిగితే, డాక్టర్లు ఇచ్చిన ఆ రిపోర్టులను కూడా సీఐడీ అధికారులు తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు…
నారాసుర రక్తచరిత్ర అంటూ వివేకా హత్య కేసును నాకు ఆపాదిస్తూ సాక్షి పెద్ద ఎత్తున కథనం రాస్తే ఇంతవరకు వాళ్ల మీద చర్యలేవి? సాక్షి ఎమ్.డి భారతీరెడ్డిని అరెస్టు చేస్తారా? డీజీపీ, సీబీసీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి.
వెంకటేష్ కు ఎక్కడి నుండో వచ్చిన ఫేస్ బుక్ పోస్టు ను ఫార్వర్డ్ చేయడం తప్పు అయితే, పిచ్చిరాతలు రాసిన సాక్షి కంటే పెద్ద నేరమా? డీజీపీ సమాధానం చెప్పాలి.
వెంకటేష్ పోస్ట్ చేస్తే…సాంబశివరావు ఏం చేశాడు? అతన్ని హింసపెట్టడం ఏంటి?
టీడీపీ మహానాడుకు పోలీసులు గ్రౌండ్ ఇవ్వలేదు, కార్యకర్తల బస్సులను రానివ్వలేదు. అయినా ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తా? మీ వల్ల కాదు…
కేసులతో భయపెట్టడం మీ వల్ల కాదు గుర్తు పెట్టకోండి ఖబడ్దార్…
అమ్మఒడిపై ప్రశ్నించిన గౌతు శిరీషను వేధించారు..
కదిరి ఎమ్మెల్యే ఓబుల రెడ్డి పనితీరును ప్రశ్నించిన వ్యక్తి ఉగాండాలో ఉంటే…70సంవత్సరాల తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు…
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు, దందాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు..
ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఉండవల్లి అనూషను సీఐడీ కేసులతో ఇబ్బందులకు గురిచేశారు…
70సంవత్సరాల వయస్సు ఉన్న ఎన్జీఓ రంగనాయకమ్మపై సీఐడీ కేసులు పెట్టి వేధించారు..
నలంద కిషోర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి కరోనా అంటించి పంపి చంపేశారు…
మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిపై నిలదీసిన అక్కోజి వినోద్ ను కొట్టి, తప్పుడు కేసులు పెట్టారు.
పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య అక్రమాలను ఎత్తిచూపిన మణిరత్నంను అరెస్టు చేసి బెదిరింపులకు గురిచేశారు..
రాజమండ్రిలో వై సురేష్ ను ఇబ్బంది పెట్టారు…
పోలీసులు చట్టప్రకారం పనిచేయడం నేర్చుకోండి…పోలీసు కస్టడీలో టార్చర్ మానండి.ప్రైవేటు కేసులు వేస్తాం, చట్టం ముందు నిలబెడతాం…
టెయింటెడ్ ఆఫీసర్లను పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే..మేమూ అదేవిధంగా ప్రవర్తిస్తాం…
చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం…
ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పడూ విభేదిస్తూనే ఉంటాం….
ప్రజాపోరాటంలో అన్యాయంగా వ్యవహరిస్తే ఏ అధికారినీ వదిలిపెట్టం..ఎప్పటికైనా శిక్ష పడడం ఖాయం…
తప్పు చేయని వారిని శిక్షించిన పోలీసులకు శిక్ష తప్పదు…
అర్థరాత్రిపూట ఎవరి ఇంటికైనా 41ఏ నోటీసు ఇస్తామంటే మాకు చెప్పండి, లాయర్లను పంపిస్తాం…లాయర్ సమక్షంలోనే నోటీసులు తీసుకోండి…పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే మాకు ఫోన్ చేయండి..మన కార్యకర్తలను పంపిస్తాం…అందరం కలిసి ఆ పోలీసులను నిలదీద్దాం…
అధికారం శాశ్వతం కాదు…పోలీసుల అరాచకాలన్నీ రికార్డు పెడతాం…ఏ ఒక్కరూ తప్పించుకోలేరు….
అడ్వొకేట్ ను రాకుండా చేయడానికి మీకు ఏ అధికారం ఉంది? గోడలు దూకే అధికారం ఎవరు ఇచ్చారు? గ్రేట్ సీబీసీఐడీ సమాధానం చెప్పాలి.
మీ తప్పులతో పోల్చుకుంటే వెంకటేష్, సాంబశివరావు చేసింది అసలు తప్పా? డీజీపీ గారు సమాధానం చెప్పాలి, సీబీసీఐడీ సమాధానం చెప్పాలి.
టెయింటెడ్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం….
‘’సీఐ జగదీష్ ఎటువంటివాడో తెలిసే పోలీసు ఉన్నతాధికారులు అతన్ని ఉద్యోగంలో పనిచేయనిస్తున్నారా? ఎంత మంది మహిళల జీవితాలను పాడు చేశాడో తెలియదా? ఎంత మంది రౌడీషీటర్లతో అతనికి పరిచయాలు ఉన్నాయో తెలియదా? వెంకటేష్ ను అరెస్టు చేయడానికి అతనికి ఏం అర్హత ఉంది. అతను తప్పలు చేయలేదా? అన్యాయం పై ప్రశ్నించే హక్కు ఈ సమాజంలో ఎవరికీ ఉండకూడదా? మహిళలు, సమాజాన్ని రక్షించడానికి ఇటువంటివాడిని పోలీసు అధికారిగా కొనసాగించడం సరికాదు. ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి’’ – సీఐ జగదీష్ బాధితురాలు..
మీడియా ప్రశ్నలకు చంద్రబాబు స్పందిస్తూ….ఉదయగిరిలో దళితుడైన నారాయణ చనిపోతే, తన భార్యను పోలీసులు బెదిరించారు. అతని భౌతికకాయాన్ని పూడ్చి పెడితే రీ పోస్టు మార్టం చేసే అవకాశం ఉందని తగులబెట్టారు. అక్కడ ఐపీఎస్ అధికరి ఉన్నారా? గుర్తు పెట్టుకోండి. ఏదీ మరిచిపోం…తప్పు తప్పే…మేం అధికారంలోకి వచ్చాక దేన్నీ విడిచేది లేదు. నారాయణ మా పార్టీ కాకపోయినా ఆ కుటుంబానికి మేం అండగా నిలబడ్డాం. సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాద్యత రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. ఎంత మందిని ఈ పోలీసులు చంపుతారో నేను రేపట్నుంచి చూస్తాను. నాలో మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దు. మీరు మాకు సహకరించాలి, రౌడీలకు కాదు. జగదీష్ నువ్వు ఎక్కడికీ తప్పించుకోలేవు. ఎవరో ఏదో చేస్తారని ప్రజలు భయపడి ఇళ్లలో దాక్కుంటే వెంకటేష్, సాంబశివరావుల మాదిరిగా అందరినీ చేయాలని పోలీసులు చేస్తున్నారు. అన్యాయంగా ప్రవర్తించిన వారిని అంతకంతకు ఎదర్కొంటాం…వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం…నేటి పోలీసుల తీరు చూశాక కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ మర్డర్లు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రానికి వస్తే అక్రమంగా కేసులు పెడతారని భయపడి ఎంపీ రఘురామకృష్ణరాజు ముందుగానే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం, మంత్రులకు సిగ్గు అనిపించడం లేదా? ఎమ్మెల్యేలకు బాధ అనిపించలేదా? రానున్న కాలంలో మీరు రాష్ట్రంలో ఉండరా? వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలకు రానున్న కాలంలో ముకుతాడు వేస్తాం.
వాళ్ల మీటింగులన్నీ వెలవెల, మా మీటింగులు బ్రహ్మాండం, చోడవరం మహానాడుకు వీధులు సరిపోనంత జనం, బాదుడే బాదుడుకు విపరీతమైన స్పందన, గడప గడపకు వైసీపీ ఎత్తిపోయింది…గడప గడపకు మన ప్రభుత్వం ఎక్కడ చూసినా నిలదీతలే…బస్సుయాత్ర తుస్సుమంది..ప్లీనరీ సమావేశాల్లో కుర్చీలు గాల్లో లేస్తున్నాయి…ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. వీటన్నిటినీ తప్పించుకోవడానికి ఎడాపెడా మాట్లాడితే ఎలా కుదురుతుంది? వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే కుదరదు. అని చంద్రబాబు అన్నారు. ప్రజలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.