– బ్యాక్ డోర్ పాలన ఎందుకు రేవంత్ రెడ్డి?
– పేరుకు ప్రజా పాలన.. చేసేది రాజరిక పాలన
– హైదరాబాద్ నగరం అంటే సీఎం రేవంత్ రెడ్డికి ద్వేషం
– ఎమ్మెల్యే కె.పి.వివేకానంద
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం అంటే చిన్న చూపు. హైదరాబాద్ నగరాన్ని రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెత్త నగరంగా చూస్తున్నారు. తన ఊహల నగరం ఫోర్త్ సిటీ అంటూ సీఎం ఊహల్లో ఉన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రోను రద్దు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డారు.
హైదరాబాద్ నగరం అంటే సీఎం రేవంత్ రెడ్డికి ద్వేషం, కోపం. నగరంలో కాలుష్యం లేకుండా ఫార్మా సిటీ కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. హైదరాబాద్ నగరం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజహారుద్దీన్ ను మంత్రిని చేశారు. అజహరుద్దీన్ కు హైదరాబాద్ నగరంపై పూర్తి స్థాయిలో అవగాహన లేదు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కలలు కంటే హైదరాబాద్ నగరం ఆగం అవుతుంది. హైదరాబాద్ నగరం తెలంగాణ ఆర్ధిక అభివృద్ధికి గ్రోత్ ఇంజన్. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్ పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. మహేశ్వరం,మేడ్చల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను కార్పొరేషన్ లో కలిపి వారికి అన్యాయం చేస్తున్నారు.
2018లో కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొడితే, 2019 లో మల్కాజిగిరి ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించినందుకు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. బ్యాక్ డోర్ పాలన ఎందుకు రేవంత్ రెడ్డి? పేరుకు ప్రజా పాలన. చేసేది రాజరిక పాలన. 27 శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ప్రజలు,రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా శివారు మున్సిపాలిటీలను విలీనం చేశారు.
మంత్రులు,అధికారులు,మేయర్ కు తెలియకుండా జీహెచ్ఎంసీలో 300 డివిజన్లు చేశారు. రే వంత్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీకి 30 అవార్డులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు బిఆర్ఎస్ హయాంలో వచ్చింది. స్వచ్ఛ ఎక్స్ లెన్స్ అవార్డు వచ్చింది. చెత్త సీఎం కాబట్టి చెత్త నగరం కనపడుతోంది.
పెద్దల భూములు విడిచిపెట్టి పేదల జోలికి వచ్చి వేల కోట్లు కాపాడినట్లు బిల్డప్పులు ఇస్తున్నారు. హైదరాబాద్ నగరం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. హైదరాబాద్ నగర ప్రజలను రేవంత్ రెడ్డి శిక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు,కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ నగరాన్ని ఆదాయ వనరుగా మాత్రమే రేవంత్ రెడ్డి వాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. సీఎం చెప్పేది ఒకటి,చేసేది మరొకటి. రేవంత్ రెడ్డి చర్యలను హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పోరాటం చేసింది. రాబోయే సంవత్సరం లో ఇదే స్ఫూర్తి తో పోరాడుతుంది.
జీరో అవర్ జీరో ఆన్సర్ గా మారింది: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఈ సంవత్సరం 16 రోజులు మాత్రమే నడిచింది. స్పీకర్ ఇటీవల ఇంగ్లండ్ వెళ్లి వచ్చారు.అక్కడ పార్లమెంట్ సంవత్సరంలో 160 రోజులు జరుగుతుంది. అసెంబ్లీలో జీరో అవర్ జీరో ఆన్సర్ గా మారింది. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు, బూతులు ఎక్కువ అయ్యాయి.
స్పీకర్ కు అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలని ఉన్నా ప్రభుత్వం సహకరించడం లేదు. అసెంబ్లీ శీతాకాల సెషన్స్ ఎక్కువ రోజులు నడపండి. రాష్ట్రంలో హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. కేటీఆర్,హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే పదిమంది మంత్రులు అడ్డు తగులుతున్నారు. శ్రీధర్ బాబు కు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా అనుభవం ఉంది.
అసెంబ్లీని ప్రభుత్వం హుందాగా నడపాలి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు లేకుండా చూడాలి.బిఆర్ఎస్,కాంగ్రెస్ ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే అడ్డుకోండి. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపండి.