Suryaa.co.in

Andhra Pradesh

సిపియస్ రద్దుపై సీఎం ఇచ్చిన హామీ అమలు చేయాలి

– 7వ రోజు నిరసన కార్యక్రమాలు
– ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయడానికి రవాణాశాఖ, ఆర్టీసి డిపోలలోపాటు, సమాచార, పౌరసంబందాలశాఖ,డైరెక్టర్ ఆఫ్ మెడికిల్ ఎడ్జుకేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, కమీషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కార్యాలయాలు నేడు సందర్శించి ఉద్యోగులను ఉద్యమాలకు సన్నద్ధం చేసిన బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు

మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపియస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి సిపియస్ ఉద్యోగులకు ఇచ్చిన హామిని అమలు చేయాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంచటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు డిమాండ్ చేశారు. బుదవారం ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేపట్టిన నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలను జయప్రధం చేయాలని కోరుతు విజయవాడలో ఆర్టిసి కాంప్లెక్స్ లో ఉన్న రవాణాశాఖ కార్యాలయం హెడ్ ఆఫీసులో ఉన్న సిబ్బందిని కలసిన సందర్బంగా ఏపిజెఏసి అమరావతి నాయకులు మాట్లాడుతూ…

సిపియస్ రద్ధుచేస్తామని ఇచ్చిన హామీని అమలు చెేయకుండా ప్రభుత్వం కొత్త కొత్త ప్రతిపాధనలతో ప్రతి సమావేశంలోను ప్రభుత్వం ముందుకు వస్తుందని, అటువంటి పరిస్థితుల్లో సదరు ఆలోచనలను ప్రభుత్వం మానుకొని ఓపియస్ ను ప్రవేశపెడతామంటేనే, సిపియస్ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కాగలమని, లేని పక్షంలో మేము సమావేశాలకు రాలేనని తేల్చి చెప్పిన జేఏసీ “ఒక్క ఏపిజెఏసి అమరావతి మాత్రమేనేనని” వారు తెలిపారు. సిపియస్ రద్ధుచేస్తామని హామిలు ఇవ్వని పక్కరాష్ట్రాలు సిపియస్ ను రద్దుచేసి ఓపియస్ ను అమలు చేస్తుంటే,ఆంధ్రప్రధేశ్ లో మాత్రం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపియస్ ను రద్దుచేస్తామని హామి ఇచ్చినప్పటికి నేటికీ హామీని అమలు చేయలేదని, తక్షణమే సిపియస్ ను రద్దు చేసి, పాత పింఛను విధానం అమలు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. అలాగే సిపియస్ ఉద్యోగుల పెన్షన్ కొరకు చెల్లించే 10% అంటే గత 11నెలలుగా NSDL కు చెల్లించని 1300 కోట్ల రూపాయలు+ ప్రభుత్వ వాటా 1300 కోట్లు వెరసి 2600 కోట్ల రూపాయలు తక్షణమే ప్రభుత్వం పెన్షన్ పద్దుకు చెల్లించాలని కోరారు.

ఆర్టీసీ (పిటిడి)ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతుంది ఏపి జెఏసి అమరావతి నాయకత్వం
ఏపియస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సంస్దలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉత్పన్నమౌతున్న అనేక ఇబ్బందులు అనగా ఏడునెలలు గా పెండింగు పెట్టిన ఓవర్ టైమ్ డ్యూటీ(ఓటి)లు, ఇతర అలవెన్సులు, ఆర్టీసి ఉద్యోగులకు విలీనంకు ముందున్న మెడికిల్ సౌకర్యాలు,ఇతర అలవెన్సులు అన్ని ఇప్పించేందుకు,30 రెగ్యులేషన్ లో ఉన్న క్లరికల్ సిబ్బందిని క్రమబద్దికరించేందుకు విలీనం ముందున్న పాతసర్వీస్ అమలు తదితర డిమాండ్ల సాధనకు ఏపి జెఏసి అమరావతి రాష్ట్ర కమిటి ఇచ్చిన నిరసన కార్యక్రమాలను జయప్రధం చేయాలని కోరుతు విజయవాడ డిపో మరియు గవర్నర్ పేట 1&2 డిపోలవద్ద ఆర్టిసీ ఉద్యోగులను కలిసిన సందర్భంగా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి మరియు ఏపిజెఏసి అమరావతి స్టేట్ జెనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదరరావులు తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి,ఔట్ సోర్శింగు సిబ్బందికి జీతాలు పెంచాలి
బుదవారం ఉద్యమకార్యచరణను విజయవంతం చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికిల్ ఎగ్జుకేషన్ ఆఫీసులలో సిబ్బంది కలసిన నిరసన కార్యక్రమాలను జయప్రధం చేయాలని కోరుతూ బొప్పరాజు & దామోదరరావు మాట్లాడుతూ మఖ్యమంత్రి గారూ ఇచ్చిన హామీ మేరకు అర్హతగల కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఇప్పటికే గత 22 సంవత్సరాలుగా ఎలాంటి బెనిఫిట్స్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, అలాగే ఔట్ సోర్శింగు సిబ్బందికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు, ఫణిపేర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ,ఉపాద్యాయ,కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు మరియు ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపుమేరకు ఈనెల 9 నుండి చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏఫ్రిల్ 5 వరకు కొనసాగుతాయని 13 లక్షలు మంది ఉద్యోగుల భవిష్యత్ ను కాపాడు కొనేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో ఉద్యోగులందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లాస్ ప్లోర్ ఎంప్లాయిస్ రాష్ట్రఅధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు, వి ఆర్ ఒ రాష్ట్రకార్యదర్శి ఏ.సాంబశివరావు, జెఏసి ప్రచారకార్యదర్శి బి.కిశోర్ కుమార్, యన్.టి.ఆర్ జిల్లా ఎపిజెఏసి అమరావతి జిల్లా చైర్మన్ డి.ఈశ్వర్, ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాసరావు, రెవిన్యూఅసోషియేషన్ NTR జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీనివాస్,బత్తినరామకృష్ట, గ్రామసచివాలయ రాష్ట్ర కార్యదర్శి బగ్గా జగధీష్, రెవిన్యూఅసోషియేషన్ రాష్ట్రకార్యదర్శి ప్రవీన్ కుమార్ రెడ్ఢి తధితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE