– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
జెన్కో, డిస్కమ్ ల పరిస్థితిని ప్రభుత్వం అధ్వాన్నంగా మార్చిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం జూమ్ కాల్ ద్వారా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు అధికమయ్యాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి పునాదులు గట్టిగా నిర్మించడంతో నేడు విద్యుత్ సంస్ధలు దృఢంగా ఉన్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల జెన్కో, డిస్కమ్ లు దివాలా తీసే పరిస్ధితికి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సీడీలో తీసుకున్న అప్పులు డిస్కమ్ లకు చెల్లించడం లేదు. జెన్కో, డిస్కమ్ లు కుప్ప కూలే పరిస్ధితికి వచ్చాయి.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ను తయారు చేసుకోవడానికి, రూ.5లకు, రూ.6లకు పవర్ విక్రయ అగ్రిమెంట్లు ఉండేవి. ఈ అగ్రిమెంటును 25 సంవత్సరాలపాటు చేసుకొంటే జగన్ ముఖ్యమంత్రికాగానే వాటని రద్దు చేశారు. అధికారంలోకి రాకముందు జగన్ రాష్ట్రంలో 25వేల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యముందని అన్నారు, దాన్ని వినియోగించకుంటూ రూ.3 కే విద్యుత్ తయారు చేయొచ్చు అని ప్రగల్భాలు పలికారు. దాని వల్ల చాలా తక్కువ ధరకే ప్రజలకు విద్యుత్ విక్రయించొచ్చు అని నమ్మబలికారు.
ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు ఎందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది? రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందో తెలియడంలేదు. నేడు ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ ను అందించలేకపోతున్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన విద్యుత్ అగ్రిమెంట్లను రద్దు చేసి ప్రజలకి రూ.20 నుంచి 22లకు విక్రయిస్తున్నారు. అయినా విద్యుత్ అందని పరిస్థితి. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 7సార్లు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. సెప్టెంబర్ నుంచి 8వ సారి ప్రజల పై భారాన్ని వేయడానికి సిద్ధమయ్యారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఫిబ్రవరి 2020లో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి పై.90లు పెంచి దాదాపు 13వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల పై మోపారు. రెండు నెలలకే స్లాబ్ మార్పులు చేసి 2వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేశారు. ఏప్రిల్ 2020లో యూనిట్ కి రూ.10 లు, సెప్టెంబరు 2021లో ట్రూఅప్ ఛార్జీలు అని దాదాపు 3వేల కోట్ల రూపాయలు, సెప్టెంబర్ లో రెగ్యులర్ ఛార్జీలు అని 4వేల కోట్ల రూపాయలు, ఫ్యూయల్ ఛార్జీలు పేరుతో 3 నెలలకు ఒకసారి 1000కోట్ల రూపాయలు వసూలు చేశారు. 2022 ఏప్రిల్ లో 45శాతం విద్యుత్ ఛార్జీలు పెంచి 5వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల పై మోపారు. వచ్చే సెప్టెంబర్ లో ట్రూఅప్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమయ్యారు. దీని వల్ల ఎన్ని కోట్ల రూపాయల భారం ప్రజల పై పడనుందో తెలియదు. ఇలా నేడు పెంచే విద్యుత్ ఛార్జీలతో కలిపి 8వ సారి పెంచి దాదాపు 20వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేస్తున్నారు.
గతంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి, అధికారంలోకి రాగానే విద్యుత్ ధరలు తగ్గిస్తామని చెప్పి.. విద్యుత్ ఛార్జీలు పలుమార్లు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నారు. చంద్రబాబు హయాంలో రూ.100లు కరెంటు బిల్లు చెల్లిస్తే నేడు రూ.300లు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారాన్ని ప్రజల పై మోపితే సామాన్య ప్రజలు ఏ విధంగా బతకాలి? 20వేల కోట్ల రూపాయల్ని ప్రజల నుంచి వసూల్ చేస్తూ రైతులకి ఉచిత కరెంటుని సరఫరా చేస్తున్నాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడీలను డిస్కమ్ లకు చెల్లించకుండా 25వేల 5వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. ప్రశ్నిస్తే తెలుగుదేశం హయాంలో జరిగిందని తప్పడు ఆరోపణలు చేస్తున్నారు.
చంద్రబాబు అధికారం నుంచి తప్పుకునే సమయానికి 18వేల కోట్ల బకాయిలు మాత్రమే వున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్ లో డ్యూ డేట్ వచ్చింది. వాటిని చెల్లించడానికి ఆ సమయానికి డ్యూ డేట్ రాలేదు. నేడు జగన్ రెడ్డి 3సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టారు. జెన్కో, డిస్కమ్స్ దివాలా తీసే పరిస్ధితికి తీసుకొచ్చారు. కనుకనే కేంద్రం చెప్పిన మాటల్ని రాష్ట్ర ప్రభుత్వం వినాల్సిన పరిస్ధితి వచ్చింది. కేంద్రం రాష్ట్రానికి ఆంక్షలు పెడుతోంది. ఈ దివాలా పరిస్ధితుల వల్ల నేడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవలసిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి.
నేడు 26వేల మంది విద్యుత్ కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్ పై పనిచేస్తున్నారు. వాళ్లందరి ఉద్యోగాలు పరమనెంట్ చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు పట్టించుకున్న పాపాన పోలేదు. 2020 జూలైలో విద్యుత్ కార్మికులు జగన్ రెడ్డికి మెమోరాండమ్ ఇస్తే తీసుకొని పక్కన పడేశారు.
డిస్కం రంగాన్ని దిక్కులేని రంగంగా మార్చారు. జెన్కో ఉద్యోగస్థులకు సమయానికి జీతాలు అందడంలేదు. వచ్చినా ఎప్పుడొస్తాయో తెలియదు. జెన్ కో, డిస్కంలను దివాలావైపుకు తీసుకెళ్తున్నారు. జెన్ కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగస్థులకు మీరు చెప్పినట్లుగా పరమనెంట్ చేయలేదు. వారికి చట్టపరంగా రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కువ జీతాలు వస్తుంటే తగ్గేటట్లు చూడండి అని సూచిస్తున్నారు. చట్టపరంగా రావాల్సిన పీఆర్సీని ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరెవరకి జీతాలు వస్తున్నాయో పరిశీలించి రివర్స్ పీఆర్సీ జీవో ఇచ్చారు. ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగస్థులకు అన్యాయం జరుగుతోంది.
దాదాపు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ప్రజలపై పెనుభారం మోపారు. ఇంకా ఎన్నిసార్లు పెంచుతారో తెలియదు. ఐదారు రూపాయలకు విద్యుత్ తెస్తుంటే దాన్ని రద్దు చేసి విద్యుత్ దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న తప్పుడు పనులతో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కేంద్రం ఎలా చెబితే అలా ఆడే పరిస్థితికి వచ్చారు. ఎంప్లాయిస్ పరిస్థితి అగమ్యగోచరం. పీఆర్సీలు లేవు. డిస్కమ్ పేరుతో 25 వేల కోట్లు అప్పు తెచ్చారు.
తెచ్చిన అప్పు దేనికి వాడారో తెలియదు. విద్యుత్ తో సహా అనేక రంగాలను నాశనం చేశారు. విద్యుత్ సామర్థ్యం పెంచడంలేదు. బాగుపరచాలన్న ఆలోచన కనిపించడంలేదు. బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చి అందరినీ ధరలతో తెగ బాదుడు బాదుతున్నారు. ఎన్నికలకు ముందు తక్కువ ధరకే విద్యుత్ ను అందిస్తామని చెప్పిన మాట ప్రస్తుతం ఏమైందో చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు.