Suryaa.co.in

Andhra Pradesh

2024లో ముఖ్యమంత్రి పదవి ఓ ముళ్ల కిరీటం అనిపిస్తుంది

– 1995 నాటి పరిస్థితులు 2024లో రాబోతున్నాయి
– కానీ కష్టాలను అధిగమించి రైతులను ఆదుకోవడమే మా కర్తవ్యం
– రైతుల బాధలు పోవాలంటే..బాబు సీఎం కావాలి
• వైసీపీ పాలనలో సున్నా వడ్డీ రుణాలు లేవు, ఇన్సూరెన్సులు లేవు.
• జగన్ రెడ్డికి రైతు సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు
– జగన్ రెడ్డికి మాట తప్పడం…మడమ తిప్పడం అలవాటు.
తంబళ్లపల్లి నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద టమాటా రైతులతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

• అనురత్నం నాయుడు, బికొత్తకోటమండలం: టమాటా అనేది మాకు చాలా ముఖ్యం. పెట్టుబడి లక్ష నుండి లక్షన్నర వరకు అవుతోంది. డ్రిప్ ఇరిగేషన్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉండేది. గత పాలనలో మంచి విత్తనాలు దొరికేవి, పంట మంచిగా వచ్చేది. నేడు కల్తీ విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. పెట్టుబడి తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం రూ.800కి బుట్ట అమ్మినా గిట్టుబాటు కావడం లేదు. కమీషన్లు కూడా బోర్డు ఒక రకంగా, వసూలు మరో విధంగా ఉంటున్నాయి. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక టమాటా రైతులను ఆదుకోవాలి.
• మదనపల్లి మార్కెట్ కు 40శాతం ములకలచెరువు మార్కెట్ సహకరిస్తోంది. ఈ మార్కెట్లో కమీషన్లు భారీగా నొక్కేస్తున్నారు. ఎవరూ నియంత్రించడం లేదు. మీ ప్రభుత్వం వస్తే టమాటా రైతులను ఎలా ఆదుకుంటారు? – ఓ రైతు.
• రైతు, చిన్నమామిడి గ్రామం:వైసీపీ పాలనలో రైతులంతా నానా బాధలు పడుతున్నాం. జగన్ రెడ్డి అవగాహనలేమి వల్ల రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. యూరియా దొరకడం లేదు. ఆర్బీకేల్లో తమకు కావాల్సిన వారికే వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నారు. రాజకీయ కోణంలో రైతులను వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.
• రెడ్డప్ప,రెడ్డికోట పంచాయతీ: టమాటా రైతులకు కూలి ఖర్చులు లక్షలు పెట్టాల్సి వస్తోంది. రైతుకు నరేగా ద్వారా కూలి సౌకర్యం కల్పిస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలు రైతులను పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక దీనిపై చర్యలు తీసుకోవాలి.
• నారాయణరెడ్డి: రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రతి రైతుకు న్యాయం చేయాలి.
• శంకర,ములకలచెరువు: వ్యవసాయం పోటీ పడి చేయడం రైతులకు వ్యసనంగా మారిపోయింది. కానీ పంటలు వరుసగా పోవడం వల్ల రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఖర్చులు తగ్గించేందుకు మీరు అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకోవాలి. సాగుకు ముందే మట్టి పరీక్షలు, ఏం మందులు వాడాలి, ఏం ఎరువులు వాడాలో రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. మట్టిపరీక్ష కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలి.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….
2024లో ముఖ్యమంత్రి పదవి ఓ ముళ్ల కిరీటం అనిపిస్తుంది. 1995 నాటి పరిస్థితులు 2024లో రాబోతున్నాయి. కానీ కష్టాలను అధిగమించి రైతులను ఆదుకోవడమే మా కర్తవ్యం. వైసీపీ పాలనలో సున్నా వడ్డీ రుణాలు లేవు, ఇన్సూరెన్సులు లేవు. జగన్ రెడ్డికి రైతు సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. రైతుల బాధలు పోవాలంటే..బాబు సీఎం కావాలి. రైతు రాజ్యాన్ని తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. రైతులేని రాజ్యాన్ని చేస్తున్నాడు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉంది.ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధరలు అమాంతం పెంచేశారు. రూ.3,500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రైతులను నడిరోడ్డున పడేసిన రైతు ద్రోహి జగన్ రెడ్డి.

రాయలసీమ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్ రాయలసీమ ద్రోహి, శనిగా మిగిలిపోయాడు. హంద్రీనీవాను 90శాతం టీడీపీ పూర్తిచేస్తే.. మిగిలిన 10శాతం పూర్తిచేయలేదు, గాలేరు నగరిని గాలికొదిలేశాడు. కేంద్రం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కడుతుంటే 31మంది ఎంపీలను పెట్టుకుని జగన్ నోరెత్తలేదు. ఇదే కొనసాగితే రాయలసీమ శాశ్వతంగా రాళ్లసీమగా మిగిలిపోతుంది.చంద్రబాబు పాలనలో రూ.11,000కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చుపెట్టారు.పాడి రైతుల కోసం పశుగ్రాసం ఇచ్చారు. హార్టీ కల్చర్ రైతులను ఆదుకున్నారు. పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం నిధులు ఇస్తున్నా..కనీసం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు.మదనపల్లిలో మీటింగ్ పెట్టిన జగన్ కెచప్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పి..విస్మరించాడు.జగన్ రెడ్డికి మాట తప్పడం…మడమ తిప్పడం అలవాటు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన టమాటా రైతులు..అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డికి కనిపించకపోవడం దారుణం.

400కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి యేడాదిలోనే కోల్డ్ స్టోరేజ్, పల్ప్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేం నిలబడతాం. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉంది. టమాటా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోర్టు దొంగ. ఇతను కోర్టులో దొంగతనం చేసి, సీబీఐ అధికారులు తనను ఎప్పుడు అరెస్టు చేస్తారోనని ఇంట్లో దాక్కుని తిరుగుతున్నాడు. రైతులను పట్టించుకునే మంత్రి జగన్ రెడ్డి సర్కార్ లో లేడు.జగన్ రెడ్డి రైతు రాజ్యం పేరుతో…రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు. పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు జగన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. ఆ మీటర్లే రైతు మెడకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. రైతులు ఈ మీటర్లను ఆమోదిస్తే..విద్యుత్ ఛార్జీల భారంతో అప్పుల ఊబిలో దిగిపోతారు. మీటర్లు పెట్టేందుకు రైతులు ఒప్పుకున్నారనే సాకు చూపి..జగన్ రెడ్డి అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. రైతు భరోసా పథకం మోసం చేసే ఓ పథకం.. జగన్ రెడ్డి రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రూ.6వేలు బకాయిపడ్డాడు. 5ఏళ్లలో రూ.30వేలు రైతుకు జగన్ రెడ్డి బకాయి పెడుతున్నాడు. చంద్రబాబు పాలన ముగిసే నాటికి ఒక్కో రైతుపై తలసరి అప్పు రూ.70వేలు అయితే…జగన్ రెడ్డి పాలనలో నేడు ఒక్కో రైతుపై తలసరి అప్పు రూ.2.50లక్షలు ఉంది.

భారతదేశంలో అత్యధిక తలసరి అప్పు ఉన్న రైతుల జాబితాలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. చంద్రబాబు ఓ రైతు బిడ్డ. మా తాత బెల్లం తయారు చేసి డబ్బులు సంపాదిస్తే..ఆ సంపాదనతో నా తండ్రి చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా రైతుల పక్షంగా చంద్రబాబు పరిపాలన చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం. టమాటా ధరలు వేగంగా మారిపోతున్నాయి.కోల్డ్ స్టోరేజీలు పెట్టి ధరలు పెరిగే వరకు అందులో నిల్వ ఉంచుకోగలిగితే రైతుకు ఉపయోగంగా ఉంటుంది. కానీ జగన్ కోల్డ్ స్టోరేజీలు నిర్మించడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక టమాటా పల్పింగ్ యూనిట్ పెడతాం. మదనపల్లి టమాటా మార్కెట్ బాధ్యతలను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇస్తున్నా. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనను టీడీపీ ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఇన్ పుట్ సబ్సిడీ, రైతు రథాలు, డ్రిప్ సబ్సిడీ ఇచ్చిన చంద్రబాబు.. పురుగు మందులు కొట్టేందుకు డ్రోన్లను తీసుకురావాలని ఆలోచించారు…ప్రభుత్వం మారిపోవడం వల్ల ఈ విధానం వెనకబడిపోయింది.ముద్దులు పెట్టిన వ్యక్తిని తెచ్చుకున్నారు. కానీ నేడు మెడమీద కూర్చొని గుద్దులు గట్టిగా గుద్దుతున్నాడు.ఒక్క ఛాన్స్ అని ముందుకు వచ్చి…రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టాడు.

ఏపీలో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలను పక్క రాష్ట్రాలకు జగన్ రెడ్డి తరిమేశాడు. కష్టకాలంలో మాత్రమే చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తున్నారు..పరిస్థితులు చక్కబడిన తర్వాత చంద్రబాబును మరిచిపోతున్నారు. దీనివల్లే ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీకి అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చి…అధికారంలోకి వచ్చాక రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు వచ్చాయి. టమాటా రైతులకు నరేగా ద్వారా కూలి ఖర్చులను ఇచ్చి ఆదుకునేందుకు మేం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం. కేంద్రంతో మాట్లాడి నిర్ణయం తీసుకుని రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటాం. పెట్రోల్‌, డీజిల్ ధరలు అధికంగా ఉండడం వల్ల రైతులకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ధరలను తగ్గిస్తాం…రైతులకు అండగా నిలుస్తాం.చెరకు ఫ్యాక్టరీల భూములను కొట్టేసేందుకు జగన్ రెడ్డి వాటిని కుట్రపూరితంగా మూత వేస్తున్నాడు. రాయలసీమలో మిగిలి ఉన్న ఒక్క చెరకు ఫ్యాక్టరీని కూడా మూసేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెంచారు. ఇన్ని పెంచి రైతు భ‌రోసా పేరుతో కేవలం రూ.7,500ఇస్తే అవి ఎలా ఉపయోగకరమో రైతులంతా ఆలోచించాలి. జగన్ రెడ్డి ప్రతి యేటా భూసార పరీక్షలు చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని విస్మరించారు. చంద్రబాబు పాలనలో భూసార పరీక్షలు చేయించి, రైతులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమలు నిర్వహించారు. 2024లో అధికారంలోకి వచ్చాక వ్యవసాయంలో అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకునేందుకు మేం పూర్తి చర్యలు తీసుకుంటాం. ఆర్బీకే కేంద్రాలన్నీ తాళాలు వేసి ఉంటున్నాయి. వాటి వల్ల రైతులకు ఉపయోగం లేదు. జగన్ ఇప్పటికే రూ.10లక్షల కోట్ల అప్పులు చేశాడు. రానున్న కాలంలో రూ.2లక్షల కోట్ల అప్పులు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

LEAVE A RESPONSE