Suryaa.co.in

Andhra Pradesh

తుది దశకు చేరుకున్న శ్రీనివాస సేతు నిర్మాణ పనులు

– శ్రీనివాస సేతు నిర్మాణం పనులను మంగళవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష

తిరుమలకు వచ్చే భక్తుల, తిరుపతి నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను, ఆప్కాన్స్ ప్రతినిధులను మేయర్ శిరీష ఆదేశించారు.మేయర్ డాక్టర్ శిరీష మీడియా తో మాట్లాడుతూ శ్రీనివాస సేతు నిర్మాణం పనులు తుది దశకు చేరుకుంది అని తెలియజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్మిస్తున్న శ్రీనివాస సేతు నిర్మాణం పనులు మూడు, నాలుగు వారాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు.

శ్రీనివాస సేతు మొదటి, రెండో, మూడు దశ పనులు పూర్తి చేయడం జరిగిందని, నాలుగో దశ పనులు కొంచెం ఆలస్యమైనదని తెలిపారు. నిర్మాణ పనులు ఆలస్యంపై కారణాలు తెలియజేశారు. రామానుజా సర్కిల్ నుండి రిలయన్స్ మార్ట్ వద్ద, రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులు కొరకు రైల్వే చీఫ్ ఇంజనీరింగ్ అధికారులు అనుమతి కొరకు శ్రీనివాస సేతు ప్లాన్ సమర్పించడం జరిగిందని, రెండు,మూడు రోజుల్లో అనుమతి వస్తుందని, వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి జూలై మాసంలో ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీర్ చంద్రశేఖర్, ఆప్కాన్స్ ప్రతినిధి స్వామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE