– హైదరాబాద్ జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీ
తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుల మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు , హైదరాబాద్ జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశానికి కావాలి, హైద్రాబాద్ అభివృద్ధి ని కేసీఆర్ చేసి చూపించారు అని దేశం కూడా అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని అన్నారు.
మోడీ ఉచితాలను ఎత్తి వేయాలని కోరుకుంటున్నారు విద్య వైద్యం ని మోడీ భారంగా భావిస్తున్నారని అన్నారు . అన్ని బాధలు పోవాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలి. ఈ పాలనా ఫలాలు దేశానికి
దక్కాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దళిత బంధు లాంటి గొప్ప పథకం తెచ్చిన కేసీఆర్ దేశం లో కూడా, ఇలాంటి పథకం తెచ్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలి, కేసీఆర్ నినాదం జై జవాన్ జై కిసాన్, అయితే మోడీ నినాదం పేద వాడి పొట్ట కొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడం అని అన్నారు.
తెలంగాణ లాంటి పాలన దేశం లో రావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి, బీజేపీ ని దేశం నుంచి తరిమి కొట్టాలంటే కేసీఆర్ తోనే సాధ్యం అని దేశాన్ని పీవీ తరహాలో సమర్ధంగా నడిపించే శక్తి సామర్ధ్యా లు కేసీఆర్ కున్నాయి అని అన్నారు, దేశం లో మత రాజకీయాలు పెచ్చు మీరుతున్నాయి. దళితుల పై దాడులు పెరిగి పోతున్నాయి. దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలి.