Suryaa.co.in

Andhra Pradesh

కోర్టులెందుకో జగన్ పట్ల సరైన రీతిలో స్పందించడంలేదు

-ఎందుకు ఒక ముఖ్యమంత్రికి ఇంతగా వెసలుబాటు?
-న్యాయవ్యవస్థ మీద గౌరవం పెరుగుతుందా? లేక తరుగుతుందా?
-ఆయనకు ఎందుకిన్ని వాయిదాలిచ్చారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
-జగన్ రెడ్డి రూ.4 లక్షల కోట్లకు పైగా ఆస్తికి యజమానిగా ఎలా ఎగబాకారు?
-బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50కి పైగా సూట్ కేసు కంపెనీలకు, వేలాది ఎకరాల భూములకు, 9 నగరాల్లో అధునాతనమైన ప్యాలెస్‌కు అధిపతి ఎలా అయ్యాడు?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… జగన్ ఏ సభకు వెళ్లినా ‘తాను అత్యంత పేదవాడిని’ అని మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల క్రితం పేదవాడిగా ఉన్న వైఎస్ఆర్, జగన్ నేడు కోట్లకు పడగలెత్తారు. 2003లో వైఎస్ఆర్ కుటుంబం కడు పేదది. అందులో ఎటువంటి సందేహం లేదు. 2003లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఐటీ రిటర్న్ చూస్తే అర్థమౌతుంది. జగన్ అన్ని దుర్మార్గాలు చేసి ఈ స్థాయికి వచ్చాడు.

2003లో వైఎస్ కుటుంబ ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆస్తి రూ.9,19,951 మాత్రమే. అధికారంలోకి వచ్చాక ప్రజానీకానికి సేవ చేయాలిగానీ.. జగన్ లాగ మోసం చేయకూడదు. ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ సంక్షేమం కోసం పనిచేయాలి గాని సంక్షోభం సృష్టించకూడదు. ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోరాలి. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి, తన అధికారాన్ని ఉపయోగించుకొని కోట్లు వెనకేసుకున్నారు. జగన్ అవినీతిని చట్టబద్దత చేస్తూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్ కోట్లాది రూపాయలు దిగమింగారు. సహజ వనరులను కూడా దోచుకు తింటున్నారు.

లక్ష కోట్లు దోచుకున్నట్లు సాక్షాధారాలు చూపినా.. ప్రెస్ మీట్ లు పెట్టి చెప్పనా వైసీపీ నాయకులు నోరు మెదపరు. నాలుగున్నర సంవత్సరాల్లో జగన్, జగన్ కుటుంబం, శ్రేయోభిలాషులు దోచుకున్నదానిపై హైకోర్టులో పిల్ వేస్తే హై కోర్టు మీకు నోటీసులు సర్వ్ చేసింది. దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా? పదేళ్లుగా జగన్ బెయిల్ పై తిరుగుతున్నారు. నేడు అధికారం, డబ్బు ఒకటయ్యాయి. ఎవరైనా సరే చిన్న పిక్ పాకెట్ దొంగ కేసు నమోదైనా అతనికి వెంటనే వారంట్ ఇచ్చి జైల్లో వేస్తున్నారు. అయితే జగన్ విషయంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు.

బెయిల్ పై పది సంవత్సరాల నుంచి తిరుగుతూ కోర్టుకు వెళ్లకుండా వ్యవస్థలను మెనేజ్ చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచకాలు జరుగుతున్నాయి, ఇసుక, మద్యం దోపిడీ యదేచ్ఛకగా జగన్ అస్మదీయ సంస్థలకు చెందిన కాంట్రాక్టులు ఇచ్చారు. కాంట్రాక్టులన్నీ జగన్ సొంత మనుషులకిచ్చారు. అడిగే నాధుడు లేడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో పంచభూతాలను కూడా వదలలేదు. ప్రకృతి సంపద అయిన ల్యాండ్, శాండ్, మైన్ లను కొల్లగొడుతున్నారు. అక్రమ కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రితో సహ నిందితుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో పడి దోచుకుంటున్నారు.

క్విట్ ప్రోకో విధానం ద్వారా దోచుకుంటున్నారు. విశాఖపట్నం భూములు యదేచ్ఛగా దోచుకుంటున్నారు. బే పార్కు ఇలా దేన్నీ వదలడంలేదు. దేశంలోనే అత్యంత అవినీతి అనకొండగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తయారయ్యాడు. రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా లేదు. జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని పెట్రేగిపోతున్నారు. తనకు పేపర్ లేదన్నారు. పేపర్ లేదని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? జగన్ సతీమణి భారతీరెడ్డి సాక్షి సంస్థలకు ఛైర్మన్ గా ఉన్నారు. అయినా సాక్షి మీడియా నాది కాదు అని ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారు. సాక్షి పేపర్ కు అడ్వర్ టైజ్ మెంట్ రూపంలో ప్రజా ధనాన్ని కోట్లాది రూపాయలు కట్టబెడుతున్నారు.

సొంత సంస్థ అయిన భారతీ సిమెంటు రేట్లు అమాంతం పెంచేశారు. సిమెంటు సంస్థలన్నీ సిండికేట్ అయి సిమెంటు బస్తాపై 150 రూపాయలు పెంచి పేదవాడితో ఆడుకుంటున్నారు. మద్యం విషయంలో జగన్ అబద్దాలు చెప్పారు. అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి అమలు చేయలేదు. మద్యం లిక్కర్ తయారీ కంపెనీలను సొంత సంస్థలుగా మార్చుకుని జగనే తయారు చేసి వైసీపీ నాయకులే అమ్ముతున్నారు. మద్యం దోపిడి యదేచ్ఛగా సాగుతోంది. రూ. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ని రూ.200 చేశారు. డిస్టలరీలన్నీ జగనే పెట్టుకున్నారు. లక్షల కోట్లు దోచుకున్న మాట నిజం కాదా?

2004లో కేవలం కోటి 73లక్షలు మాత్రమే ఆస్తి కలిగి, హైదరాబాద్‌ ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి నేడు రూ.4 లక్షల కోట్లకు పైగా ఆస్తికి యజమానిగా అమాంతం ఎలా ఎగబాకారు? బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50కి పైగా సూట్ కేసు కంపెనీలకు, వేలాది ఎకరాల భూములకు, 9 నగరాల్లో అధునాతనమైన ప్యాలెస్‌కు అధిపతి ఎలా అయ్యాడు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్లు దోచుకున్న వైనంపై జరిగిన సీబీఐ, ఈడీ తదితర సంస్థల విచారణలో జగన్ రెడ్డిపై 38కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిపై రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ… :
జగన్ పై 2012లోనే సీబీఐ 11 చార్జ్ షీట్లు వేసింది. కోర్టు 11 ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంది. విచారణ తరువాయి. విచారించి నేరం చేస్తే శిక్ష వేస్తారు. నేరం చేయకపోతే ఆయనను వదిలేస్తారు. అయితే విచారణ ప్రక్రియ ఆగిపోయింది. 2012లో వేసిన ఛార్జి షీట్ తరువాత జగన్ 2014, 2019లో రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్లలేదు. కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు వేయించుకుంటున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టాలు అందరికీ సమానం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ లకు కొన్ని మినహాయింపులుంటాయి. ముఖ్యమంత్రులకు ఉండవు. గతంలో జైళ్లకు వెళ్లిన అనేక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఆర్టికల్ 14ని దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయమూర్తులను తప్పు పట్టడంలేదుగానీ.. కోర్టులెందుకో ముఖ్యమంత్రి పట్ల సరైన రీతిలో స్పందించడంలేదు. సీఎం జగన్ కేసుల్లో న్యాయ సమీక్ష అవసరముంది. 2012లో ఛార్జిషీట్ వేసిన వ్యక్తి ఇంతవరకు ఆ కేసుల్లో విచారణకు రాకపోతే ఎందుకు రావటంలేదని సుప్రీం కోర్టు లీగల్ జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రికి ప్రత్యేక న్యాయం ఉండదు. ముఖ్యమంత్రి ప్రతి మూడు నెలలకొకసారి ముద్దాయిలు కోర్టు కు అటెండ్ అవుతున్నారా లేదా అని రివ్యూ చేస్తారు. ఈయనే హాజరవ్వరు. సీబీఐ కోర్టు ఆయనకు వెసలుబాటు కల్పించిందా అని అనుమానం కలుగుతోంది.

ఎందుకు ఒక ముఖ్యమంత్రికి ఇంతగా వెసలుబాటు కల్పిస్తున్నారు. భారత రాజ్యాంగంపై, భారత న్యాయవ్యవస్థ మీద గౌరవం పెరుగుతుందా? లేక తరుగుతుందా? సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టీస్ రివ్యూ చేయాలి. జగన్ సీఎం అవ్వచ్చు, కానీ ఆయనకు ఎందుకిన్ని వాయిదాలిచ్చారు? ఈ విషయంపై రివ్యూ చేయాల్సిన అవసరముందని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేడు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. 1949లో నవంబర్ 26వ తేదిన అంబేద్కర్ రాసిన రాజ్యంగం ఆమోదించబడింది.

జగన్ లాంటివారు ఉంటారని రాజ్యాంగం రచించే రోజుల్లో ఆలోచన రాలేదు. ఇన్ని కేసుల్లో ఇరుక్కొని, 43 వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని కొట్టేసి, 11 కేసుల్లో ఛార్జిషీట్ లు ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటూ సీబీఐ చే అరెస్టు కాబడి 16 నెలలు చెంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి కూడా ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తూ ప్రజా పరిపాలన చేస్తాడన్న విషయం ఆరోజు ఆయనకు తెలియదు. లేకుంటే రాజ్యాంగంలో మెలిక పెట్టి ఉండేవాడు. రాజకీయ నాయకులందరూ అవినీతిపరులని ఊహించలేదు. న్యాయవ్యవస్థ ఆలోచించాలి.

పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… :
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అత్యంత అవినీతిపరుడు సీఎం వ్యవస్థలు మేనేజ్ కాపాడుతున్నార. జగన్ నోరు విప్పాలి. కోర్టుల ఆయనపై దృష్టి పెట్టాలి 11 సంవత్సరాల నుంచి 11 సీబీఐ కేసులు ఈడీ కేసులు, 420 కేసులు ఉండి మనేజ్ దేశ చరిత్రలోనే కాదు. ప్రజం చరిత్రలోనే ఉండరు. జగన్ రికార్డు సృష్టించారు. దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలకు యజమానిగా జగన్ ప్రజల వాగ్దానమిచ్చొ ఓట్లు వేయించుకొని కుబేరుడిలా దేశంలో పెత్తందారు లేరు. దేశంలోని 29 రాష్ట్రాంలో ధనవంతుల్లో జగన్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్. నిరూపణ అయింది .

20 సంవత్సరాల క్రింద నీకున్న ఆక్తి ఎంత? టాటా, బిర్లాలను మించిపోయారు. సంపాదించని విధంగా ఏ విధంగ సంపాదించారు. లక్షల కోట్లు న్యయా స్థానాలు ఆలోచించాలి. సామాన్యుడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయం జగన్ కేసులోలో నిరూపితమైంది. 4 వేల వాయిదాల్లో ఒక్క రోజుకూడా జగన్ కోర్టు ముఖం చూడలేదు. ఇది సామాన్యుడికి సాధ్యం కాదు. ఇన్ని క్రిమినల్ కేసుల్లో ముద్దాయి.. కోర్టు సాధ్యమా? కోర్టు మెట్టు కూడా ఎక్కలేదు. 5 సంవత్సరాల నుం చి హెట్రో, రామ్ కీ, ఇండియా సిమెంట్స్, రఘురామ్, పెన్నా, హిందూ టెక్, లేపాక్షి, ఏపీ హౌసింగ్ ప్రాజెక్టు కేసుల్లో ఏ వన్ గా ఉన్న జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక ఇన్ని కోట్లు ఏ విధంగా సంపాదించాడో పెత్తందారు జగన్ మోహన్ రెడ్డి.

LEAVE A RESPONSE