-బాధితులకు న్యాయం జరిగే వరకు వదలం
-అన్నమయ్య బాధిత రైతులతో కలిసి ధర్నా
-బిజెపి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్
-రాయచోటి కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి ధర్నా
కడప: సీఎం సొంత జిల్లా బాధితులకు న్యాయం చేయలేని వ్యక్తి మూడు నెలలు అంటే నమ్మాలా? మూడు నెలలకు పూర్తి స్థాయిలో ఇండ్లు కట్టిస్తా అని జగన్ హామీ ఇచ్చి సంవత్సరం అయినా, నేటికీ నెరవేరక పోవడం.. కేవలం బీజేపీ పార్టీ ,తానా వాళ్లు ఇచ్చిన రేకులు క్రింద నివసించాల్సిన దుస్థితి. ప్రాజెక్ట్ బాధితులను ప్రభుత్వం గాలికి వదిలేసింది.
స్థానిక శాసన సభ్యుడు, zp చైర్మెన్ ఇసుక ను బెంగళూరు తరలించండంలో పోటీ పడడం తప్ప, పేదల కష్టాలు పట్టలేదు. న్యాయస్థానంలోను, మానవ హక్కుల సంస్థలను ఆశ్రయించాల్సిన వచ్చింది, చివరి వరకు బీజేపీ అన్నిరకాలుగా పోరాడుతోంది. ప్రాణాలు, అస్తులు కోల్పోయిన బాధితులు సంపతీ చిన్నయ్య కుమారుడు రమణ,ప్రసాద్ రెడ్డి ,జగపతి మాట్లాడుతూ నేటికీ న్యాయం జరగలేదని, వ్యవసాయం చేసుకోలేక ,పనులు లేక తీవ్ర ఇబ్బందులు పాడుతున్నామని, కనీసం మేటలు వేసిన ఇసుక గొలగించలేదని, ysr బీమా కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు సుబ్బారెడ్డి, సాయిలోకేష్, పోతుగుంట రమేష్ నిర్మల్ సురేష్ రాజు శ్రీనివాస్ యాదవ్ ,శివ గంగిరెడ్డీ, బాలాజీ యదవ్, షబ్బీర్ ,శుభద్ర వెంకట్రామ్ రాజు తదితరులు పాల్గొన్నారు