Suryaa.co.in

Political News

ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన వేళ..ఆత్మ గౌరవం తలెత్తుకుని నిలబడ్డ రోజు

– చరిత్రకు వేదికైన హుజురాబాద్..అక్కడి ప్రజల తీర్పు మేధావులకు అందని చైతన్యం
సామాన్య ప్రజల పట్ల కనీస గౌరవం లేని, అహంకారపూరిత రాజ్యం. మనుషులను కేవలం ఓటు వేసే ఒక జంతువుగానే చూస్తూ, మందు పోసి, పైసలిచ్చి కొనుక్కోవచ్చుననే దుర్మార్గపు దొర మనస్తత్వం. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. తానొకవైపు, తన కుటుంబ సభ్యులొకవైపు, తన కింది నాయకులు మరొకవైపు లక్షల కోట్ల అవినీతి, భూ ఆక్రమణలు. తానాతందానా గాళ్ల దోపిడీ, అరాచకాలు సరేసరి. ఇటువంటి పాలన ఎప్పుడైనా ఊహించామా?
ఒక ప్రజాస్వామ్య పాలనలో ఉండకూడని సకల అవలక్షణాలతో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి కాస్తా మనసున్నవారు, నిజాయితీకి విలువనిచ్చేవారు కన్నీళ్లు పెట్టడం నిజం. నోరెత్తితే తప్పుడు కేసులు, వేధింపులతో అప్పుడెప్పుడో నిజాం, రజాకార్లను మరిపించారు. ఈ దోపిడీ, ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఏంటి? అని దిగులు పడ్డ మంచివారికి ఒక సమాధానం దొరికింది. దుర్మార్గానికి అంతం లేదాయని బుగులు పడిన మనుషులకు ఊరట కలిగింది. అబద్ధం అవినీతి అహంకారం అన్యాయం నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం తప్పదని చాటిన హుజురాబాద్ ప్రజల తీర్పు మంచి కోరుకునే ప్రజలకు ధైర్యాన్నిచ్చింది.
ఇంకా న్యాయం బతికే ఉంది అనే విశ్వాసం కలిగించింది .అందుకే చాల సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు తెలంగాణ సమాజం .మంచి గెలిచి నిలవాలన్నదే వారి ఆశయం దాని కోసం బరిలో నిలిచి గెలిచి తెలంగాణ ప్రజలంటే నీతి నిజాయితీ ,న్యాయం కోసం కోట్లాడే వాళ్ళు అనేది నిరూపితమైంది .ఒక నొక స్థాయిలో కొంత మంది వైఖరి చూసి వీళ్లు మన తెలంగాణ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలేనా అనే స్థాయిలో కొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కుత్రంత్రాలు ప్రజలు గమనించారు .

– శ్రీశైలం, షాద్‌నగర్

LEAVE A RESPONSE