-శరత్ బాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రముఖ తెలుగు సినీ నటుడు శరత్ బాబు మృతి బాధాకరం. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన శరత్ బాబు ఇండస్ట్రీలో స్వయంకృష్టితో ఎదిగారు. తెలుగు, తమిళ, మళయాళ , హిందీలో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. శరత్ బాబు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.