Suryaa.co.in

Telangana

గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వం హత్యే

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: ఏడాది పాలనతో గురుకులాల విద్యను దిగజార్చారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా ఎదిగిన గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల పాఠశాల, వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం కనీసం సమీక్షించడం లేదు. విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. శైలజ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వం హత్యే.

LEAVE A RESPONSE