బ్రిటీష్ వారిని తరిమికొట్టిన ధైర్యం, తెగింపుతో రాష్ట్రయువత, ఏపీని ఏలుతున్న నియంత్రత్వ పాలకుల్ని తరిమికొట్టాలి : వర్ల రామయ్య
ప్రపంచంలోనే అతిగొప్పదైన, అత్యున్నతమైన లిఖితపూర్వక రాజ్యాంగం మనకు దక్కినందుకు భారతీయులుగా గర్వించాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్రవేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకావిష్కరణ గావించి, ప్రసంగించారు.
అతికర్కశంగా, అమానుషంగా, రాక్షసంగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ దొరలను, చిన్నరక్తపుబొట్టు నేలరాలకుండా, అహింస అనే ఆయుధంతో తరిమి తరి మి కొట్టిన ఆనాటి ఘట్టాలను నేడు ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలన్నారు. అదేస్ఫూర్తి, అదే తెగువ, ధైర్యంతో నేడు రాష్ట్రాన్ని ఏలుతున్న నియంతల్ని కూడా రాష్ట్రంనుంచి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఆంధ్రాయువతపై ఉందన్నారు. భరతమాత ఆశీస్సులు ప్రతిఒక్కరికీ ఉండాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు, శాంతిసామరస్యాలతో జీవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రామయ్య చెప్పారు. గణతంత్రవేడుకల్లో భాగంగా టీడీపీనేతలు, కార్యాలయ సిబ్బంది జాతీయనాయకుల చిత్రపటాలకు నివాళులర్పించారు.
కార్యక్రమంలో టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్, టీటీడీ బోర్డు మాజీసభ్యులు ఏ.వీ.రమణ, ఆహ్వానకమిటీ సభ్యులు హసన్ బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.