Suryaa.co.in

Political News

సనాతన ధర్మానికి బద్ధ వ్యతిరేకి డీఎంకే పార్టీ

తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ .. కొన్ని కుల పార్టీల సహా కారం తో అధికారంలోకి వచ్చిన డీఎంకే పార్టీ స్టాలిన్ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు క్యాబినెట్ లో మంత్రి నిన్నటి రోజున.. “సనాతన నిర్మూలన” అనే అంశం మీద ప్రగతిశీల రచయితలు కళాకారుల సదస్సులో మాట్లాడుతూ.. ఈ దేశం నుండి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని.. కలరా, మసూచి, కరోనా కంటే ప్రమాదమని దీని నిర్మూలించాలని మంత్రి మాట్లాడారు. అదే సదస్సులో తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు.

ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ మాట అయినా మాట్లాడొచ్చు కానీ ఈ భరత భూమి పుట్టిన దగ్గర నుండి.. సనాతన ధర్మం ఆధారంగా జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రతి గ్రంథము, ప్రతి చట్టము, చివరకు రాజ్యాంగం కూడా సనాతన ధర్మ సంప్రదాయాలతో ఆధారపడి తయారు చేసింది. ఈ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ఒక మంత్రి.. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మనిషికి ఒళ్ళు బలుపెక్కి, కొవ్వెక్కి అధికారం తలకెక్కించుకొని మాట్లాడిన మాటలుగా అనిపిస్తుంది.

ఒకవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మీరు, మీ కుటుంబం, మీ మంత్రాంగం చేసిన అవినీతిని ఎండగట్టి.. డీఎంకే ఫైల్స్ పేరుతో మీ బండారాన్ని దేశ ప్రజానీకానికి తెలియచేశారు . యూపీఏ ప్రభుత్వ హయాంలో మీ అత్త మీ మామ, చేసిన అవినీతి మీద కోర్టులకెక్కి జైళ్ల కెక్కి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మీ కుటుంబం, మీ పార్టీ,ద్రవిడ వాదం తప్పు అని అన్నామలై జాతీయ వాద శక్తులను ఏకం చేస్తున్నారు.

పాదయాత్ర పేరుతో ఊరూరు తిరిగి.. మీ బండారం బట్ట బయలు చేస్తున్న పరిస్థితుల్లో దిక్కు తోచక.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మన పరిస్థితి ఏమిటా అన్న అగమ్య గోచరం. సనాతన ధర్మాన్ని నిర్మూలన చేయాలని మాట్లాడావు . దీనికి నీవు, నీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

మీ కుటుంబానికి సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే , మీ అమ్మగారు ఉదయం ఒక గుడికి, సాయంత్రం ఒక గుడికి ఎందుకు వెళ్లి పూజలు,పునస్కారాలు, నమస్కారాలు, చేసుకుంటూ దండాలు పెట్టుకొని వస్తున్నారు. మీ తాత కరుణానిధి గారు మీ కుటుంబ సభ్యులలో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయినా నయం కాని పరిస్థితుల్లో.. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం మహాలక్ష్మి దేవాలయం కెళ్ళి ఆ స్వాములతో, పండితులంతో సంప్రదించి, ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్న సన్నివేశాలు తమిళనాడు ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

I.N.D.I.A లో భాగస్వామ్యమైన పార్టీలు, కాంగ్రెస్ తదితర పార్టీలు డీఎంకే బాటలో పయనిస్తాయా? వారినే సమర్థిస్తారా ? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర ప్రజలు, హిందువులు,సనాతన ధర్మాన్ని ఆచరించి, గౌరవించి అమలు చేస్తున్న, స్వామీజీ లందరూ బయటకు వచ్చి, ఈ పోకడను ముక్త ఖంఠంతో ఖండించాలి. ఇప్పటికే బీజేపీ కొన్ని హిందూ సంస్థలు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉదయనిధి స్టాలిన్ మాటలను తప్పుపడుతూ ఎండ గడుతున్నారు.

రాబోవు ఎన్నికల్లో సనాతన ధర్మాన్ని గౌరవించి ఈ దేశం కర్మభూమి, వేద భూమి, పుణ్య భూమిగా మనగలిగేటట్టుగా, అందుకు ప్రణాళిక రచించి ఈ భరతఖండం ఉన్నంతవరకు ఈ సనాతన ధర్మం ఇదే విధంగా ఇంకా గొప్పగా ప్రజల్లోకి వెళ్లి , వాస్తవాలు తెలుసుకొని ధర్మాన్ని, సమ సమాజ నిర్మాణాన్ని కాపాడుకుందాం.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

.

LEAVE A RESPONSE