Teacher with students around explaining or teaching from book on classroom - concept of support, education, assistance and guidance.
– ఉపాధ్యాయుడు “మాంత్రికుడు” కాదు… “మార్గదర్శకుడు” మాత్రమే !
– నేటి విద్యావిధానం పై ప్రత్యేక విశ్లేషణాత్మక నివేదిక !!
“ఫలితం ఉపాధ్యాయుడి చేతిలో ఉంటే… దానికి కావలసిన ముడిసరుకు (Raw Material) ఎవరు ఇవ్వాలి ?”
నేటి విద్యావ్యవస్థలో “విద్యార్థి వైఫల్యానికి ఉపాధ్యాయుడే ఏకైక బాధ్యుడు ” అనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. కానీ ఇది వాస్తవానికి ఎంత దూరమో , శాస్త్రీయంగా ఎంత అసంబద్ధమో నిరూపించే నిష్ఠుర సత్యం ఇది .
1. విద్యా వ్యవస్థ అనేది “ఏకపక్షం” కాదు… “త్రిముఖ వ్యూహం “!
చదువు అనేది కేవలం బడిలో మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. ఇది మూడు బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క స్తంభం బలహీనపడినా, ఫలితం శూన్యం .
ఉపాధ్యాయుడు (33%): మార్గదర్శకుడు, బోధకుడు .
విద్యార్థి (33%): గ్రహీత, అభ్యాసకుడు (Learner ).
తల్లిదండ్రులు/సమాజం (34%): పర్యవేక్షకులు, సహకారులు
దురదృష్టం ఏమిటంటే: మిగిలిన రెండు వర్గాల వైఫల్యాలను (67%) కూడా… కేవలం ఉపాధ్యాయుడి (33%) ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటున్నారు .
2. ద్రోణాచార్యుడి “క్లాస్రూమ్” ఏం చెబుతోంది ? ( చారిత్రక సాక్ష్యం )
మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటే… అది కేవలం కథ కాదు, ఒక కేస్ స్టడీ .
గురువు ఒక్కడే: ద్రోణాచార్యుడు .
సిలబస్ ఒక్కటే: అస్త్ర విద్య .
స్టూడెంట్స్: 105 మంది (100 కౌరవులు + 5 పాండవులు ).
ఫలితం: కేవలం “అర్జునుడు” మాత్రమే మహాయోధుడు అయ్యాడు .
ప్రశ్న: మిగిలిన 104 మంది ఎందుకు అర్జునుడిలా కాలేదు ?
గురువులో లోపమా? కాదు .
పాఠంలో లోపమా? కాదు .
లోపం విద్యార్థి “గ్రహణ శక్తి” (Aptitude) మరియు “శ్రద్ధ” (Focus)లో ఉంది .
ప్రపంచంలో ఏ గురువూ అందరినీ ఫస్ట్ ర్యాంకర్లుగా మార్చలేడు . ఇది ప్రకృతి ధర్మం. “ఇన్పుట్ (Input) సరిగా లేనప్పుడు, ఔట్పుట్ (Output) అద్భుతంగా ఎలా వస్తుంది ?”
3. కంసాలి – బంగారం సిద్ధాంతం (Goldsmith Logic )
ఉపాధ్యాయుడిని ఒక స్వర్ణకారుడితో (Goldsmith) పోల్చండి .
స్వచ్ఛమైన బంగారం ఇస్తే: కంసాలి అద్భుతమైన ఆభరణం తయారు చేస్తాడు .
మట్టిని చేతిలో పెట్టి: “దీనిని బంగారు హారంగా మార్చు” అంటే అది సాధ్యమా ?
నేటి పరిస్థితి ఇదే
ఇంటి దగ్గర క్రమశిక్షణ లేని పిల్లలు …
చదువుపై ఏమాత్రం ఆసక్తి లేని పిల్లలు …
టీవీలకు, మొబైల్ ఫోన్లకు బానిసలైన పిల్లలు …
వీరందరినీ తరగతి గదిలోకి పంపి, ఉపాధ్యాయుడిని “అద్భుతాలు చేయమంటే” ఎలా సాధ్యం ? మట్టిని బంగారం చేయడం సైన్సుకే సాధ్యం కాదు, ఉపాధ్యాయుడికి ఎలా సాధ్యం ?
4. గణితం ఏం చెబుతోంది? (6 గంటలు Vs 18 గంటలు )
ఒక రోజులో విద్యార్థి జీవితాన్ని గమనించండి :
పాఠశాలలో: 6 గంటలు (ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ).
ఇంటి వద్ద/సమాజంలో: 18 గంటలు (తల్లిదండ్రుల పర్యవేక్షణలో )
ప్రమాదం ఎక్కడ ఉంది ?
ఆ 18 గంటల సమయంలో … ఇంట్లో గొడవలు, పేదరికం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థిని మానసికంగా దెబ్బతీస్తున్నాయి .
18 గంటల పాటు జరిగిన నష్టాన్ని, ఉపాధ్యాయుడు 6 గంటల్లో ఎలా సరిచేయగలడు ?
5. వాస్తవికత Vs అంచనాలు
సిస్టమ్ అడిగేది: 100% ఫలితాలు, అందరూ పాస్ అవ్వాలి .
వాస్తవం: తరగతిలో ప్రతి విద్యార్థి ఐక్యూ (IQ) వేరు, నేపథ్యం వేరు, ఆసక్తి వేరు .
తల్లిదండ్రులు కనీసం “హోం వర్క్ చేశావా?” అని అడగని రోజుల్లో … పిల్లల చదువు బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయుడి నెత్తి మీద పెట్టడం … ” బాధ్యతారాహిత్యం” అవుతుంది తప్ప, విద్యా విధానం అనిపించుకోదు .
ముగింపు (Final Verdict )
” కత్తికి పదును ఉంటేనే యుద్ధం గెలవగలం. అలాగే… విద్యార్థికి ‘జిజ్ఞాస’ (నేర్చుకోవాలనే తపన) ఉంటేనే గురువు గెలవగలడు .”
ఇకనైనా ఆపండి
❌ ఉపాధ్యాయులను నిందించడం ఆపండి .
❌ అశాస్త్రీయమైన లక్ష్యాలను (Targets) పెట్టడం ఆపండి .
✅ తల్లిదండ్రులను బాధ్యులుగా చేయండి .
✅ విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పుపై దృష్టి పెట్టండి .
ఉపాధ్యాయుడు “మాంత్రికుడు” కాదు… “మార్గదర్శకుడు” మాత్రమే !
: – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యం