Suryaa.co.in

Andhra Pradesh

పేదల పక్షపాత ప్రభుత్వానికి.. స్కాంల పార్టీ టీడీపీకి మధ్య ఎన్నికల యుద్ధం

2,75,931 మందికి ఐదో విడత వాహన మిత్ర సాయం కింద రూ. 275.93 కోట్లు
ఇది జగనన్న ప్రభుత్వం కాదు మనందరి ప్రభుత్వం
సీఎం జగన్

“మన ప్రభుత్వం వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ లెస్‌ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం మ‌న‌ది ఇప్ప‌టికే 99శాతం హామీలు అమలు చేశాం. ఈ ఎన్నికల్లో ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారు. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి”- సీఎం జ‌గన్ వరుసగా వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర పథక ఐదో విడత ఆర్థిక సా­యాన్ని శుక్రవారం అందించారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉండేందుకు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదా­రులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని అన్నారు.

దీనితో కలిపి వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు మీ జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుందని అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి రూ.50 వేల సాయం అందిచామని సీఎం జగన్ తెలిపారు. బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకమని తీసుకువచ్చామని, ఈ పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని సీఎం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు ఇన్స్యూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు కచ్చితంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు.

ఇది జగనన్న ప్రభుత్వం కాదు మీఅందరి ప్రభుత్వం

జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నామని, పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామని, వాలంటీర్‌ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామని అన్నారు. చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు, వైఎస్సార్‌ కాపునేస్తంతో రూ.2,029 కోట్లు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తంతో రూ.1257 కోట్లు, రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందించామని, మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచామని అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచామని, పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశామని, మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

వాళ్లకి అధికారం కావాల్సింది పేదలకు మంచిచేయటానికి కాదు.. దోచుకోవటానికి, పంచుకోని తినుకోవటానికి- సీఎం
ఈ ఎన్నికలకు కురుక్షేత్ర యుద్దం జరగబోతుందని ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వానికి నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. మేనిఫేస్టోలో చెప్పిన ప్రతి హామిని అమలు చేశామని కానీ, ఎన్నికల మేనిఫేస్టోని చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు.

వీళ్లకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేయటానికి కాదని, అధికారంతో దోచుకని, పంచుకని తినటానికే అని సీఎం దుయ్యబట్టారు. గతంలోనూ ఇదే బడ్జెట్ ఉందని కానీ సీఎం మాత్రమే వేరని గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? అని సీఎం ప్రశ్నించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుందని, వీళ్ల మాదిరి తనకు దత్తపుత్రుడు లేడని, ఎల్లో మీడియా లేదని చెప్పారు. తాను నమ్ముకున్నది దేవుడి దయను ఆతర్వత ప్రజల్నే నమ్ముకున్నాని సీఎం తెలిపారు.

LEAVE A RESPONSE