Suryaa.co.in

Devotional

ఇదే ధర్మం!

ఎలుక కొన్ని రకాల పురుగులతోపాటు ఆహార ధాన్యాలు కూడా తింటుంది. పురుగుల్ని తిన్న నోటిని మనం తినే ఆహార పదార్ధాలలో పెడితే, అది అనారోగ్యానికి కారణం అవుతుంది. అందువల్ల తరుముతామే తప్ప శత్రు మతస్తుల లాగా చంపమే?! వినాయకుడిని పూజిస్తాం కాబట్టి.. వినాయకుడితో పాటు ఉండే ఎలుకను మూషికం అని సంస్కృతంలో శంభోదించి పూజిస్తాం. ముషీకాయ నమః అంటాం గానీ ఎలుకాయ నమః అనము.

నాగ దోషం వల్ల సంతాన యోగం కలగదని హిందువుల నమ్మకం. అందువల్ల నాగదేవతని రాతి రూపంలో పూజిస్తాం, కానీ నిజమైన పాము కాటువేస్తే చనిపోతామనే భయం తో చంపుతాము, కానీ కొన్ని దేవతా సర్పాలుగా గుర్తించబడినవి. కనబడితే దండం పెట్టుకుంటాము అవి కూడా వెళ్ళిపోతాయి. పొరపాటుగా నాగుపాముని చంపితే, దానికి భక్తితో దహన సంస్కారాలు చేసే అలవాటు చాలా మందికి తెలియదు.

వయసు పైబడ్డాక చాలా మందిలో చాదస్తవు గుణం వస్తుంది. విసిగిస్తారు. అందువల్ల ఇబ్బందిగా ఉన్నా 50%మంది భరిస్తారు కొందరు వదిలేస్తారు, అయినా ఈ రోజు పిల్లలుగా ఉండి వృద్దాశ్రమంలో చేర్చిన వాళ్ళు రేపు అదే వృద్దాశ్రమానికి చేరతారు. ఏది చేస్తే దాన్నే పొందుతారు అన్నది అందుకే, దానికి ఎవరూ అతీతులు కాదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని బాధపడే వృద్ధులు యవ్వనంలో చేసింది అదే.. సంతాన ప్రాప్తికి పితృ దేవతల ఆశీస్సులు తప్పనిసరి అందుకే దండం పెడతారు.

విషాదాన్ని చూడలేక చావుల దగ్గరకు వెళ్ళరు.తప్పనిసరి ఐతే తప్ప పోరు. చేయూత ఇవ్వకపోవడానికి కారణం మనిషిలో ఉండే కృతఘ్నత లక్షణమే. మనుషుల్లో మానవత్వం లేదు అనేవాడు, తను ఎలా ఉన్నాడో నిజాయితీ తో ఆలోచించుకుంటే వాస్తవం తెలుస్తుంది.

దైవత్వం ఉండేదాన్ని రాయి అనేది నాస్తికులు, దాన్ని విగ్రహం అంటారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట, దైవత్వ ఆవాహన లు జరగడం వల్ల పూజిస్తాం. అన్ని శిలలు శిల్పాలు కావు జీవం ఉన్నవి మాత్రమే శిల్పాలు అవుతాయి. జీవాన్ని గుర్తించాలంటే శిల్ప శాస్త్రం తెలిసి ఉండాలి. అందుకే వాటిని వెదికి తెస్తారు. జీవం లేనివి మోసం చేయలేవు, మోసం, అసూయ, ద్వేషం ఉండవుకాబట్టే జీవం లేనివాటిని పూజించి, జీవం ఉన్నవాటినుండి ప్రమాదం జరగకుండా దూరం గా జరుగుతాం.

కొందరు స్వయం ప్రకటిత కంపునిస్ట్ మేధావులు వాళ్ళ పుట్టుకని మర్చిపోయి, చావు తెలివితేటలు చూపిస్తుంటారు. వాళ్ళకి ఇలా చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వండి. తాను ప్రశాంతంగా జీవిస్తూ, ఇతరుల ప్రశాంతతను భంగం చేయకుండా ఉండమని చెప్పేదే సనాతన ధర్మం.ఐతే కలికాలంలో దీన్ని.. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి వస్తే ఉతుకుతాను అని మార్చాలి.

( సేకరణ)

LEAVE A RESPONSE