అనంత బాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్న జగన్ రెడ్డి…అతనితో కలిసి వేదిక ఎలా పంచుకున్నాడు?
– దళితుడిని కిరాతకంగా చంపిన వాడితో సీటు, స్వీట్లు పంచుకోవడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
• దళితుల్ని వంచించడానికే జగన్ రెడ్డి తనపార్టీ తరుపున అనంత బాబు సస్పెన్షన్ పై ఉత్తుత్తి ప్రకటనలు చేయించాడా?
• మాట్లాడితే నాఎస్సీలు అని గుండెలు బాదుకుంటూ గొంతు చించుకునేజగన్ రెడ్డి అనంతబాబుపై ఏం చర్యలు తీసుకుంటాడో దళితులకు సమాధానం చెప్పాలి
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
దళితుల ఓట్లు గంపగుత్తగా దండుకొని ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఏలుబడిలో అదే దళితులపై 2,000వరకు దారుణాలు జరిగాయని, వైసీపీ నేతలే హత్యలు, అత్యా చారాలు, దూషణలు, దాడులకు తెగబడుతున్నా ఏనాడూ జగన్ రెడ్డి మాటమాత్రంగా కూడా స్పందించలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బా బు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
దళితుల్ని మోసగించనడానికే జగన్ రెడ్డి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఉత్తుత్తి ప్రకటనలు ఇచ్చాడు
“ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ్ భాస్కర్) తన వద్ద డ్రైవర్ గా పనిచేసే దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపి, అతని శవాన్ని డోర్ డెలి వరీ చేసి, ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మృతుడి భార్యను బెదిరించి వెళ్లాడు. అంత అమానుషానికి పాల్పడిన తనపార్టీ ఎమ్మెల్సీపై ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఒక్క చర్యకూడా తీసుకోలేదు. పైగా అతనికి ఇంకా అధికప్రాధాన్యత ఇచ్చి, అక్కున చేర్చుకున్నాడు ఈ నీతిమాలిన ముఖ్యమంత్రి.
తన డ్రైవర్ ను చంపింది తానేనని అనంతబాబు ఒప్పుకు న్నందున అతన్ని తమపార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ జిల్లా వైసీపీ నాయకత్వం మొక్కుబడిగా చేతులు దులుపుకుంది. జగన్ రెడ్డి అధికారంలో ఉంటే, అతని కింద పనిచేసే పోలీసులు హత్యానేరం ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్సీపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు?
ఎమ్మెల్సీని సస్పెండ్ చేశామని చెప్పిన వారు… తరువాత మరలా వైసీపీ సమావేశంలో అతనికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి మరీ జగన్ రెడ్డి పక్కనే కూర్చొబెట్టి రాచ మర్యాదలు చేయడమేంటి? అంటే దళితుల్ని మోసగించ డానికి ఊరికే అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు ఉత్తుత్తి ప్రకటనలు ఇచ్చారా? సస్పెండ్ అయిన వ్యక్తి పార్టీ సమావేశానికి వచ్చాడని తోటి వైసీపీ సభ్యులెవరూ ఆ పార్టీ జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్రనాయకత్వాన్ని ప్రశ్నించలేదు.
నా ఎస్సీలు అని గుండెలు బాదుకుంటూ గొంతు చించుకునే జగన్ రెడ్డి దళితుడిని చంపిన అనంతబాబుని ఎందుకు వైసీపీలో కొనసాగిస్తున్నాడు?
దళితుడిని చంపానని చెప్పిన వ్యక్తి తమపార్టీలో కొనసాగుతూ.. తమతో చెట్టాపట్టాలే సుకొని తిరుగుతుంటే, వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. శవాలను భుజానేసుకొని ఇళ్లముందు పడేసే వ్యక్తికి నిస్సి గ్గుగా మధ్ధతివ్వడం వైసీపీ దళితనేతలకే చెల్లింది. మాట్లాడితే గుండెలు బాదుకుంటూ నా ఎస్సీలు… నాఎస్టీలు అని గొంతు చించుకునే జగన్ రెడ్డి దళితుడిని చంపిన ఎమ్మె ల్సీని పార్టీలో ఎలా కొనసాగిస్తున్నాడు? తమపార్టీ సమావేశాలకు ఎలా రానిస్తున్నాడు?
హత్యచేసి బెయిల్ పై బయటకు వచ్చినంత మాత్రాన అనంతబాబు నిర్దోషి అయి పోతాడా? అనంతబాబుకి బెయిల్ రావడానికి జగన్ రెడ్డే సహకరించాడు. వివేకా హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డి తరుపున న్యాయస్థానంలో వాదన లు వినిపించిన ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీనే… అనంత్ బాబు తరు పున అతని బెయిల్ పిటిషన్ పై వాదించాడు.
జగన్ రెడ్డి తన పార్టీ సొమ్ము లాయర్ల కు ఇచ్చి అనంతబాబుకి బెయిల్ వచ్చేలా చేశాడు. ప్రభుత్వ సహకారాలతో తానే హత్య చేసిన వాడికి బెయిల్ ఇప్పించి, తానే అతన్ని మీటింగుల్లో పక్కన కూర్చొబెట్టుకోవ డం ద్వారా తాను దళితజాతికి వ్యతిరేకమని, వారి పొడే తనకు గిట్టదని చెప్పకనే చెప్పాడు.
వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ.. ముఖ్యమంత్రి దళితద్రోహి అనడానికి అనంతబాబు విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరే నిదర్శనం
దళితుడిని చంపిన అనంతబాబు బహిరంగసభ పెట్టుకోవడానికి కూనవరంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కేటాయించి, ఆ సభకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అనంతబాబు జైల్లో ఉన్నప్పుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అతని చిత్రపటా నికి పాలాభిషేకాలు చేయించారు. వైసీపీ నుంచి నిజంగా అనంతబాబు సస్పెండ్ అయి తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పోలీసులు అతనికి ఈ విధంగా ఊడిగం చేస్తారా?
ఉత్తుత్తి సస్పెన్షన్ తో దళితుల్ని జగన్ రెడ్డి వంచించాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏ ముంటుంది? వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ.. ముఖ్యమంత్రి దళిత ద్రోహి అనడానికి అనం తబాబు వ్యవహారమే నిదర్శనం. అనంతబాబుపై చర్యలు తీసుకోకుండా అతన్ని వెన కేసుకొచ్చిన జగన్ రెడ్డికి, అతని పార్టీకి వచ్చేఎన్నికల్లో దళితులు చెప్పుతో కొట్టినట్టు బుద్ధిచెప్పాలి.
గిరిజన ప్రాంతంలో అనంతబాబు చేసే అరాచకాలు అన్నీ..ఇన్నీకావు
అధిక వడ్డీకి గిరి జనులకు, దళితులకు డబ్బులిస్తూ వారి నుంచి ఎక్కువసొమ్ము కొట్టేస్తూ, వారి రక్తా న్ని తాగుతుంటాడు. తాను ఎస్టీనని తప్పుడు ధృవీకరణ పత్రం పొంది ఎంపీపీగా పోటీ చేశాడు. అదే అనంతబాబు తరువాత ఓసీ కోటాలో జడ్పీ ఛైర్ పర్సన్ గా పోటీ చేశాడు. 2019 ఎన్నికలకు ముందు ఒక దశలో జగన్ రెడ్డి.. అనంతబాబుకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతని కులంపై అభ్యంతరాలు రావడంతో నాడు జగన్ వెనక్కి తగ్గాడు. ప్రశాంతతకు మారుపేరైన ఏజెన్సీ ప్ర్రాంతాన్నిగంజాయి సాగు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు.
రంపచోడవరం మన్యం ప్రాంతంలో వందలకోట్ల విలువైన గంజాయి సాగు చేస్తూ, దాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ, రంగురాళ్ల వ్యాపారంచేస్తూ, గిరిజనుల సంపద దోచుకుంటూ, ఎప్పటికప్ప డు తాడేపల్లి ప్యాలెస్ కు వందలకోట్ల కప్పం కడుతున్నాడనే అనంతబాబు పై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ధైర్యం చేయడం లేదు. జగన్ రెడ్డి నాయకత్వంలో దళితులపై జరిగిన దాడులు.. దారుణాలు లెక్కలకు అందనన్ని జరిగాయి.
దేశమంతా ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సమర్థవంతంగా అమలవుతుంటే, జగన్ జమా నాలో మాత్రం ఆ యాక్ట్ వైసీపీ వారికే ఆయుధంగా మారింది. జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణమే అనంతబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. దళితు డిని చంపిన వాడితో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సీటు..స్వీట్లు ఎలా పంచుకున్నాడో జగన్ రెడ్డి దళితులకు చెప్పాలి. చేవచచ్చి బతుకుతున్న వైసీపీ దళితనేతలు.. మంత్రులు ఇప్పటికైనా దళితద్రోహి జగన్ రెడ్డిని కాలర్ పట్టుకొని నిలదీయాలి.” అని ఆనంద్ బాబు సూచించారు.