Suryaa.co.in

Andhra Pradesh Entertainment

వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్

– కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు ,టీవీ 5 చానెల్ ఎండి బీఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చా
– రాంగోపాల్ వర్మ పై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పై డిజిపి కి ఫిర్యాదు చేసిన రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్

మీడియాతో ఆర్జీవీ ఏమన్నారంటే.. నిన్న రాత్రి టీవీ 5 లో కొలికిపుడి శ్రీనివాస్ డిబేట్ లో ఒక సుపారి (కాంట్రాక్ట్) ఆఫర్ ఇచ్చారు నన్ను చంపడానికి. ఆ డిబేట్ ని కొనసాగించింది అంటే అది యాజమాన్యం ది కూడా తప్పు. ఆ మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదు. ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు సూపారి ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు నేను కంప్లైంట్ కూడా చెయ్యలేదు.

వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్. మీరేమి తప్పు చెయ్యనప్పుడు భయపడటం ఎందుకు? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటుంన్నారు ఎందుకు వీళ్లంతా? మీడియా లో ఎవరిని మాట్లాడిన ఒకరిని ఆశాసినేట్ చేస్తాం జనరల్ గా. నేను కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు ,టీవీ 5 చానెల్ ఎండి బీఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చాను. ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటాము అని డీజీపీ చెప్పారు.

LEAVE A RESPONSE