Suryaa.co.in

Andhra Pradesh

రైతులను ఆదుకోవడమే ప్రధమ కర్తవ్యం

-బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో వేరుశెనగ, పొగాకు పంటలకు నష్టం
బొప్పాయి రైతులు కూడా అకాల వర్షాలు వల్ల నష్టం
నగదు రూపంలో పరిహారం చెల్లిస్తేకాని వారు కోలుకోలేని పరిస్తితి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులను ఆదుకోవడమే ప్రధమ కర్తవ్యంగా ప్రభుత్వం భావించాలి. అకాలవర్షాలు వస్తున్న సందర్భంలో రోజువారీ క్షేత్రస్ధాయిలో పంటల నష్టాలను అంచనావేసి రైతాంగానికి ఉపశమనం కలిగించేలా తక్షణం నగదు రూపంలో ఆర్ధిక సహకారం అందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్యమంత్రికి భహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అకాల వర్షాలు కారణంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో వరితో పాటు అపరాలు, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం జరిగింది. పొగాకు వంటి వాణిజ్య పంటలతో పాటు పిడుగులు వల్ల రైతులు పశువులను కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

క్షేత్రస్థాయిలో వెంటనే అంచనాలు వేసి ప్రభుత్వం ఏమేరకు ఆదుకుంటుందో స్పష్టమైన ప్రకటన చేయాలని, ఈ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మిర్చి రైతులు గత సంవత్సరం నష్టపోయారు ఆనాడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు నేను స్వయంగా గతంలో మిర్చి పంటను పరిశీలించి రైతులతో వారికి జరుగుతున్న నష్టాలు తెలుసుకున్నానన్నారు. ప్రస్తుత అకాల వర్షాలు కారణంగా కళ్లాల్లో ఉన్న మిర్చి పంట మరోమారు నష్టపోవడం జరిగింది తక్షణమే వారికి ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వానికి బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో వేరుశెనగ, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది.పసుపు, అరటి పంటలకు కూడా తీవ్రనష్టం కలిగింది.విజయనగం, మన్యం జిల్లాల్లో కూడా పంటలకు తీవ్ర నష్టం కలిగింది.

పొగాకు నికొటిన్ వర్షాలవల్ల తొలగిపోయి పొగాకు నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగా పొగాకు పంట చేతికి వస్తున్న దశలో ఈ నష్టం రైతుల పాలిట శాపంగా మారుతోందని.ఈ లేఖద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. బొప్పాయి రైతులు కూడా అకాల వర్షాలు వల్ల నష్టం చవిచూశారు. పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న నేలకొరిగింది వెంటనే మొక్కజొన్న రైతుకు ఏవిధంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్న విషయం స్పష్టం చేయాలి. వర్షాలు, ఈదురు గాలులు వల్ల ఉధ్యాన పంటలకు నష్టం వాటిల్లింది రాయలసీమ ప్రాంతంలో మామిడి రైతుకు నష్టం వాటిల్లింది.

పిడుగులు వల్ల మేకలు,గొర్రెలు ను కూడా రైతులు కోల్పోయారు వీటి విషయంలో ప్రభుత్వం నగదు రూపంలో పరిహారం చెల్లిస్తేకాని వారు కోలుకోలేని పరిస్తితి ఉంది.ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల్లో మిరప రైతు ప్రధానంగా నష్టపోయారు. కృష్ణ, ఏలూరు , ఉభయ గోదావరి జిల్లాల్లో వరి రైతు కూడా నష్టపోవడం జరిగింది. రాష్ట్రం లో అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ఈ భహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE