Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్‌లో వాస్తవాలు లేవు

– వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు
– ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌

టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్‌లో వాస్తవాలు లేవు.మార్ఫింగ్ చేశారని ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేశారు.వీడియో తనది కాదని మాధవ్ చెప్పారు. మాధవ్ వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్టు అంటూ కొందరు విడుదల చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే రిపోర్టులకు విలువ ఉండదు.అసలు..ఆ వీడియోను ఎవరూ షూట్ చేశారు.మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ఫోరెన్సిక్‌కు పంపి.. రిపోర్ట్ తీసుకున్నారు.ఒరిజినల్ ఫుటేజ్ దొరికినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లగలం.

అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్‌ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు.ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నాం. నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు

LEAVE A RESPONSE