– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమం జరిగింది. కాళోజీ నారాయణ రావు, చాకలి ఐలమ్మ ల చిత్రపటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజలను కవి కాళోజీ కదలించారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారన్నారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… కవికి మరణం ఉండదు. కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తాయి. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మస
అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉంది. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో మనం ముందుకు కదలాలి. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలిపోయిందని సీఎం అన్నారు. నిన్న మాత్రం అదే ప్రాజెక్ట్ లో భాగమైన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. 1500 కోట్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చవచ్చు.
కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారు. 1500 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు 7500 కోట్లకు చేరిందో చెప్పాలి.
తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాదు. ప్రాజెక్ట్ విలువ రూ. 7500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తాం. తెలంగాణ జాగృతి ఉన్నత మైన లక్ష్యంతో ముందు అడుగు వేయాలని నిర్ణయించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి విశ్రమించదు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ టు రైట్ అందరినీ కలుస్తాం. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుంటాం. తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తాం.
మూడో సారి గెలిస్తే కేసీఆర్ సామాజిక తెలంగాణ చేసే వారు. వారి అజెండాను మేం ముందుకు తీసుకెళ్తాం.
అందరికీ అవకాశాలు ఉండే సమాజాన్ని నిర్మించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గాన్నేసామాజిక తెలంగాణ కోసం మేం ఎంచుకుంటాం. తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలి. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలుపాలి. ఎన్నికల కమిషనర్ గా శేషన్ ఏ విధంగా పదవికి వన్నె తెచ్చారో…సుదర్శన్ రెడ్డి కూడా ఉపరాష్ట్రపతి పదవికి అలా వన్నె తెస్తారని భావిస్తున్నా