Suryaa.co.in

Andhra Pradesh

తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం

– ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ వేమూరు రవికుమార్

తాడేపల్లి : ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఏపీఎన్ఆర్‌టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ వేమూరు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు భాగస్వాములై గ్రామాల రూపురేకల మార్పునకు కృషి చేశారు. ఇప్పుడు పీ4 విధానంలో భాగస్వాములై పేదరిక నిర్మూలనుకు కృషి చేస్తారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ఖండాంత్రాలు దాటి తెలుగు ప్రజలకు అండగా ఉంటామన్నారు.

తెలుగు వాళ్లు ఎక్కడున్నా నంబర్ వన్ గా ఉండాలన్న ముఖ్యమంత్రి లక్ష్యామనికి అనుగుణంగా, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తాము పనిచేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామని.., ఉద్యోగస్తులుగా ఉన్న ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ వేమూరు రవి కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై వ్యవహారాలపై మంచి పట్టున్న వేమూరు రవికుమార్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు, ఇంటూరి నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, ఏపీస్ఎస్డీసీ ఎండీ గణేష్ కుమార్, ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో హేమలత రాణి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి, శాంతి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ రవి, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్నారై మురళీ రాపాకతో పాటు పలువురు ఎన్నారైలు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE