Suryaa.co.in

Andhra Pradesh

గృహ నిర్మాణాల లక్ష్యాల్ని త్వరితగతిన అందుకోవాలి

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పక్కా గృహాల నిర్మాణాల లక్ష్యాన్ని వంద రోజుల్లోపు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం గృహ నిర్మాణ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పక్కాగృహాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. సొంత స్థలం ఉండి పక్క ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలను సేకరించాలన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి అధిక సంఖ్యలో పక్కా గృహాలు మంజూరయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. పక్కా గృహం మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారిని చైతన్యపరిచి సొంతింటి కలను సాకారం చేసుకునేలా వెన్ను తట్టాలని అధికారులను కోరారు.

LEAVE A RESPONSE