Suryaa.co.in

Telangana

హైమావతి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

బేవేరేజ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవి ప్రసాద్

హైదరాబాద్: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగి తిరుమలాయపాలెం కంప్యూటర్ ఆపరేటర్ హైమావతి మరణం బాధాకరం, గత 9 రోజులుగా జరిగిన సమ్మె లో చురుకుగా పాల్గొని అనారోగ్యానికి గురైన హైమావతి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే నెల రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని హనుమకొండ లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.

కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీనితో తెలంగాణ వ్యాప్తంగా 20000 మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం. విద్యా వ్యవస్థ సంస్కరణ చేస్తామని చెప్పిన విద్యా కమిషన్ కూడా స్పందించలేదు. గుండె పోటుతో మరణించిన హైమావతి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. సమ్మె పరిష్కారం కోసం చర్చలు జరిపి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE