Suryaa.co.in

Andhra Pradesh

బస్ స్టేషన్ లో ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత

-మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం ఇవ్వాలి
-టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరం. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసి గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

LEAVE A RESPONSE