– స్వామివారి ఆస్తులకు తీరని ద్రోహం
– టూరిజం భూమి విలువ కేవలం రూ.18 కోట్లు
– అందుకు బదులుగా ఒబెరాయ్ రూ.460 కోట్ల భూదోపిడీ
– ఈ భూమి విలువ బహిరంగ మార్కెటలో రూ.3 వేల కోట్ల పైనే
– ఇది ముమ్మూటికీ స్వామి వారి ఆస్తులను దోచిపెట్టడమే
– గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్
– రూ.2 కోట్ల బిల్డింగ్ ఫండ్, రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ
– ఎవరి ప్రయోజనం కోసం ఈ తతంగం
– ఇది పరకా మణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి
– ప్రభుత్వ భూ దోపిడీపై స్వాములు, పీఠాధిపతులు ప్రశ్నించాలి
– ప్రతి హిందువు దీన్ని వ్యతిరేకించాల్సిందే
: ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షకుడిగా తనను తాను అభివర్ణించుకుంటూనే… వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని ప్రైవేటు హోటల్ కి కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు స్వామివారికి తీరని ద్రోహం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు భూములు కట్టబెట్టడం పై తమండిపడ్డారు. కేవలం రూ.18 కోట్లు విలువైన టూరిజం భూమికి బదులుగా, రూ.460 కోట్ల విలువైన 20 ఎకరాలు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది టీటీడీకి తీరని ద్రోహమని… బహిరంగ మార్కెట్ లో రూ.3వేల కోట్ల విలువైన విలువైన భూమిని… ఒబెరాయ్ కి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయడాన్ని, స్వామి వారి ఆస్తులను దోచిపెట్టడమేనని చెప్పారు.
దీన్ని పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడీగా అభివర్ణించారు. ఒబెరాయ్ కు భూమి కేటాయింపులతో రూ.2 కోట్ల బిల్డింగ్ ఫండ్, రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేయడాన్ని తప్పు పట్టారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ తతంగం నిర్వహిస్తున్నారని నిలదీసిన భూమన… ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అతిపెద్ద అవినీతి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూ దోపిడీపై స్వాములు, పీఠాధిపతులు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేసిన ఆయన… ప్రతి హిందువు దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
● నీతులు చెబుతూనే స్వామి వారికి చంద్రబాబు ద్రోహం…
రోజూ నీతులు చెబుతూ, తిరుమల పవిత్రను కాపాడే విశ్వక్షేనుడులా మాట్లాడుతూ… మేం తిరుమల కొండమీద అరాచకాలు చేశామని మా మీద అభాండాలు వేస్తున్న సీఎం చంద్రబాబు… ఇంకా మా మీద నేరారోపణలు చేస్తూనే కాలం గడుపుతూ టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు.
తిరుమల తిరుపతి పవిత్రను కాపాడ్డానికే తాను పుట్టానని చెప్పుకునే వ్యక్తి.. అలిపిరి నుంచి వెళ్లే దారి అత్యంత పవిత్రమైనదని తెలిసినా కూడా, పెద్దలు అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. టూరిజం శాఖ భూమి తీసుకుని దానికి బదులుగా టీటీడీ భూమిని కట్టబెట్టడం ఆశ్చర్యం.
బెరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి, టీటీడీ బోర్డులోనే తీర్మానం చేసి, ఆ సానువుల్ని కాపాడాలి, పవిత్రతను పరిరక్షిస్తామంటూ చెప్పిన చంద్రబాబే…. టూరిజం వాళ్లు ఒబెరాయ్ హోటల్ కి కేటాయించిన దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైన స్దలాన్ని చంద్రబాబు నాయుడు కేటాయించారు. డిసెంబరు 11 వ తేదీన కేబినెట్ మీటింగ్ లో ఆ భూమి బదలాయింపును ఆమోదించి, 13వ తేదీన జీవో కూడా జారీ చేశారు.
● ఖరీదైన భూములు కారుచౌకగా కేటాయింపులు…
పాత టూరిజం స్దలం 1 ఎకరా రూ.90 లక్షలు విలువ చేస్తుందని.. రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా చెబుతున్న మార్కెట్ వాల్యూ. ఇవాళ టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చిన స్థలం రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ వాల్యూ ప్రకారం గజం రూ.49వేలు అంటే.. అంటే ఎకరాకి 4800 గజాలు చొప్పున, రూ.26.52 కోట్లు అయితే… 20 ఎకరాల విలువ రూ. 460 కోట్లు. టూరిజం శాఖ దగ్గర నుంచి తీసుకున్న ఆ భూమి ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.18 కోట్లు. ఇవాళ ఒబెరాయ్ కి ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భూమి విలువ రూ. 460 కోట్లు.
ఇంత ఖరీదైన స్థలాన్ని ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన లీజు అమౌంట్ ను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. అంటే ఒబెరాయ్ హోటల్స్ కి చేస్తున్న మేలు రూ.26 కోట్ల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసింది. అంతేకాకుండా పాత ధరల ప్రకారం అంటే ఎకరా రూ.90 లక్షలు అనుకుంటే… అందులో ఒక శాతం చొప్పున ప్రతీ ఏడాది రూ.90వేలు కట్టాలి. కానీ ఎకరా ఇప్పుడు రూ.26 కోట్లు అంటే దాదాపు రూ.1.17 కోట్లు కట్టాలి.
కానీ ముందు కేటాయించిన రూ.90 లక్షల ఖరీదు చేసే భూమికి ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే టీటీడీ నుంచి టూరిజం, టూరిజం నుంచి టీటీడికి ఎక్సేంజ్ కి సంబంధించిన అమౌంట్ దాదాపు రూ.32,60,95,000 కూడా మాఫీ చేసింది. వందల సంవత్సరాల ఒక సత్ బ్రాహ్మణుడి క్రితం భగవంతుడికి ఈనామ్ గా ఇచ్చిన భూమిని… ఇవాళ ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి మళ్లే విధంగా చంద్రబాబు పూర్తి చేశారు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే రూ.466 కోట్లు, బహిరంగ మార్కెట్ లో రూ.3వేల కోట్లు విలువ చేస్తుంది.
కోహినూర్ వజ్రానికి ఎలా వెలకట్టలేమో ఈ టీటీడీ స్థలానికి కూడా అదే మాదిరిగా వెలకట్టలేం. ఇది అర్భన్ ల్యాండ్ లో ఉంది. ముందు కేటాయించిన పాత స్థలం రూరల్ ఏరియాలో ఉంది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి, అర్భన్ ఏరియాలో ఉన్న ల్యాండ్ కి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వర స్వామి వారి పేరు చెబుతూ టీటీడీకే ఎసరు పెట్టారు. రూ.3 వేల కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని అప్పనంగా ఒబెరాయ్ హోటల్స్ అప్పగించారు.
ఒబెరాయ్ వాళ్లు ముంతాజ్ హోటల్ పేరును స్వరా అనే పేరు మార్చారు. శంకరయ్య సులేమాన్ గా మారినట్టు… ముంతాజ్ హోటల్ పేరు మార్చారు. చంద్రబాబే పేరు మార్చమని చెప్పి ఉంటారు. ఆ తర్వాతే ఈ తతంగమంగా నడిపించి 5వ తేదీన రిజిస్ట్రేషన్ చేస్తే… ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలో కనబడ్డం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్ సైట్ లో నిల్ అని కనిపిస్తోంది. దాపరికం ఎందుకు?
● అనుమతి లేకుండానే నిర్మాణ పనులు…
అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉంది. 15 రోజులగా వర్క్ ఆర్డర్ లేకుండానే పని చేస్తున్నారు. ఇదేంటని అడిగితే… కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతితోనే పనులు జరుగుతున్నాయన్న సమాధానం వచ్చింది. వేదవిశ్వవిద్యాలయం పక్కన వందల సంఖ్యలో ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఒబెరాయ్ హోటల్ కి కేటాయించిన స్థలంలో మాత్రం పనులు వేగంగా జరుగుతున్నాయి.
100 రూముల హోటల్ కి 20 ఎకరాల స్దలం అవసరమా? ఈ హోటల్ వలన 1500 ఉద్యోగాలు వస్తాయని… కేబినెట్ మీటింగ్ లోనే చెబుతున్నారు. హోటల్ లో, రెస్టారెంట్ లో భోజనానికి కూడా 1500 మంది ఉండరు. టూరిజం ల్యాండ్ ను టీటీడీ తీసుకుంది. అలాంటప్పుడు టీటీడీ ల్యాండ్ ను ఎందుకు ఒబెరాయ్ హోటల్స్ కి ఇచ్చారు? ప్రభుత్వం దగ్గర వేలాది ఎకరాల భూమి, తిరుపతి చుట్టుపక్కల వందలాది ఎకరాలు ఉండగా… మీరు ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి రూ.3వేల కోట్ల ఖరీదు చేసే భూమిని ఎందుకు ఇచ్చారు? దాన్ని మీరు ఎలా సమర్ధించుకుంటారు?
● పరకామణి దొంగతనం కంటే పెద్ద దోపిడీ
పరకామణి దొంగతనం కంటే ఇది కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా? ఇది దేవుడ్ని దోపిడీ చేసి, ఒబెరాయ్ హోటల్స్ కి ధారాదత్తం చేయడం కాదా? ఇది సాంప్రదాయంగా మారదా? దేవదేవుని ఆస్ధైన స్దలాన్ని ప్రైవేటు సంస్థకు, హోటల్ కి ఎలా ఇస్తారు? టీటీడీ స్థలం ఒబెరాయ్ హోటల్ కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి? కనీసం అర్ధరూపాయి లాభం కూడా లేకుండా భగవంతుడ్ని దోపిడీ చేసి.. ప్రైవేటు హోటల్ కి ఇన్ని మినహాయింపులతో ఎలా ఇచ్చారు? రూ.2 కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జెస్ట్ చేశారు. రూ.26 కోట్ల స్టాంపు డ్యూటీ మాఫీ చేశారు.
● దివంగత వైయస్సార్ హయాంలోనే స్పష్టమైన జీవో..
మా నాయకుడు దివంగత నేత వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా.. 2007 జూన్ 2వ తేదీన తిరుమల దివ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం ఏడు కొండలతో జీవో తెచ్చారు. ఇవాళ మీరు ప్రైవేటు వ్యక్తులకు హోటల్ కోసం కేటాయించిన 20 ఎకరాలు కూడా అందులో భాగంగానే ఉన్నాయి. మీరు ఏ రకంగా వారికి కేటాయిస్తారు? ఇది దోపిడీ కాదా?
రూ.3వేల కోట్ల స్థలాన్ని ఒబెరాయ్ కి ఇచ్చి చంద్రబాబునాయుడు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామికే మూడు నామాలు పెట్టాడు. ఇంతకంటే పెద్ద దోపిడీ, అన్యాయం, అక్రమం, టీటీడీ చరిత్రలోనే జరగలేదు. మీరా స్వామి వారి పవిత్రతను కాపాడేది? మీరా స్వామి వారి ప్రాశస్త్యాన్ని పెంచేది?
అప్పనంగా వేల కోట్ల భూమిని అప్పగించి… 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారని అబద్దాలు చెబుతున్నారు. అటవీశాఖ అనుమతి లేకుండా ఆ భూమిలో చెట్లు ఎలా తొలగించారు?
● స్వాములు, పీఠాధిపతులు మౌనం వీడాలి?
తిరుమల కొండమీద అటవీశాఖ అధికారులు నిర్మించిన రోడ్లు చాలా ఉన్నాయి. అవి కూడా క్షేత్రంలో భాగమే. మరోచోట రెవెన్యూ భూములు ఇచ్చే అవకాశం ఉన్నా.. అత్యంత విలువైన భూములను ఒబెరాయ్ కి చంద్రబాబు కేటాయించడం ముమ్మూటికీ తప్పదమే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో ముంతాజ్ హోటల్ నిర్మాణసమయంలో స్వాములు, పీఠాధిపతులు ఆందోళన చేశారు.
ఇప్పుడు స్వామి పాదాలకు దగ్గర ఉన్న స్థలాన్ని చంద్రబాబు నాయుడు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీరు కూడా ఎందుకు ఆందోళన చేయడం లేదన్న అనుమానం ప్రజల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు తనకు కావల్సిన పత్రికలు, ప్రసార మాధ్యమాలను తన గుప్పిట్లో ఉంచుకుని తాను ఎంత తీవ్రమైన తప్పులు చేసినా భయటకు రాకుండా కప్పిపెడుతున్నారో.. స్వాములు కూడా స్పందించకపోతే అదే విధంగా అనుకునే ప్రమాదం ఉంది.
● పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పితీరాలి?
పాత రెంట్ ఎకరా రూ. రూ.90 లక్షలు అయితే కొత్తగా కేటాయించిన భూమి ఇవాళ రూ.26 కోట్లు అయితే రెండింటికీ ఒకే రెంట్ ఎలా ఇస్తారు? మీకున్న ప్రత్యేకమైన ప్రేమ వెనుక కావాల్సినంత అవినీతి దాగి ఉన్నదా? వందలాది ఎకరాల రెవెన్యూ భూమి ఉన్నా కూడా… ప్రభుత్వ విలువ ప్రకారం రూ.460 కోట్లు, బహిరంగ మార్కెట్ లో రూ.3వేల కోట్లు విలువైన స్థలాన్ని కేటాయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి.
ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. తమిళనాడులో ధ్వజస్ధంభం గురించి అన్ని మాటలు మాట్లాడిన సనాతన ధర్మ పరిరక్షకుడి చెప్పుకునే పవన్ కళ్యాణ్… ఇన్ని వేల కోట్ల రూపాయులు విలువైన స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రైవేటు హోటల్ కి ధారాదత్తం చేస్తుంటే నోరు మెదపకపోవడం నేరం కాదా? టూరిజం మంత్రి మీ పార్టీకే చెందిన కందుల దుర్గేష్ ఉన్నారు. మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?
హోటల్ వద్దని ఎందుకు చెప్పలేదు? మీరంతా కుమ్మక్కయ్యారు కాబట్టే… మీరేం మాట్లాడలేదని చెప్పారు. అందుకే అత్యంత విలువైన శ్రీవెంకటేశ్వరస్వామి స్థలాన్ని అప్పనంగా అప్పగించడంపై… ప్రతి హిందువు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం, బాధ్యత ఉందని భూమన పిలుపునిచ్చారు.