-పాముకాటుతో విద్యార్ధి మృతి బాధాకరం
– నారా చంద్రబాబు నాయుడు
విజయనగరం జిల్లా కురుపాంలోని ప్రభుత్వ వసతిగృహంలోని విద్యార్ధి పాము కాటుకు గురై మృతి చెందడం ఆందోళనకు గురి చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గతంలో వసతి గృహాల్లో ఉండే వసతి సదుపాయాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చూసి.. సీట్ల కోసం ముందుకొచ్చిన విద్యార్ధులు.. ఈ రోజు ప్రాణాలతో ఉండాలంటే వసతి గృహాల్లో చేరకుండా ఉంటే మేలు అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన వసతి గృహాల్లో సదుపాయాల లేమి, భద్రత లేమి చూసి విద్యార్ధులు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కల్పించారు. కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి.