– ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ అనే దళిత వ్యక్తి మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం వాస్తవాలు బయటకు పెట్టాలి. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా నారాయణ చనిపోయారు అనే కుటుంబ సభ్యుల వాదనకు అధికారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
పోస్టుమార్టం అయ్యాక 40 మంది పోలీసులు బాధిత కుటుంబాన్ని భయపెట్టి…వారి సంప్రదాయానికి విరుద్ధంగా మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి బదులు ఎందుకు దహనం చేశారు? ఘటనకు కారణమైన ఎస్సై పై ఎంతో కాలంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అతని మీద చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఎవరు?
పోలీసుల దాడుల్లో దళితులు ప్రాణాలు కోల్పోతే నిందితులను రక్షించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన నారాయణకు భార్య, ముగ్గురు చిన్నపిల్లలు, దివ్యాంగురాలైన సోదరి ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి?ప్రభుత్వం వెంటనే నారాయణ కుటుంబాన్ని ఆదుకుని పరిహారం అందించాలి. అలాగే దళిత వ్యక్తి మృతికి కారణమైన పోలీసులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.