– ఎ.ఆర్. రహ్మాన్‌కు ఈ ఇళైయరాజా గొప్పతనం ఎందుకు తెలియలేదు?
ఇళయరాజా (ఇళయరాజా కాదు) గొప్పతనం ఏమిటి?
ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు; కవి, రచయిత, 1000 సినిమాలకు పైగా సంగీతం చేసిన వ్యక్తి; అత్యంత వేగంగా పాటల్ని సృజించగల సంగీత దర్శకుడు 30 నిమిషాలలో 7, 8 పాటల పూర్తి సినిమాకు పాటలు చేసిన సంగీత దర్శకుడు… ఇలా మరికొన్నీ ఇళైయరాజా గురించి వాస్తవాలు ‘ఆరుబయట ఒలకబోసి ఉన్నాయి’ (ఈ అర్థంతో తమిళ్ష్‌లో ‘వెట్టవెళియిల్ కొట్టిక్కిడక్కిన్ఱన’ అని ఇళైయరాజా ఒక పుస్తకం రాశారు).
ఇంతకు మించి లేదా ఈ స్థాయి గొప్పతనం ఇళైయరాజాలో మరొకటీ ఉంది! ఆ ఇళైయరాజా గొప్పతనం ఏమిటి?
ఇళైయరాజా కులం, మతం రెండిటినీ విడిచిపెట్టాశారు! ఇళైయరాజా కమ్యూనిస్ట్ కూడా కాదు. అర్థ శతాబ్ది క్రితమే ‘పరయ’ (మాల) అనబడుతున్న తన కులాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టేశారు! కులాన్ని విడిచిపెట్టేసి ఇళైయరాజా కులం నుంచి బయటకు వచ్చేసి మనిషిగా, గొప్ప కళాకారుడిగా (కమ్యూనిస్ట్ కాకపోవడం వల్ల) సమాజానికి ప్రయోజనకారిగా జీవిస్తున్నారు. ఇది (కూడా) ఇళైయరాజా గొప్పతనం ఔతుంది!
ఇళైయరాజా లేకపోతే సినిమాలు లేవు అన్న స్థితి కొంతకాలం తరువాత తొలగిపోయినా, తన ప్రభ తగ్గిపోయినా “నేను దళితుణ్ణి కాబట్టి నాకు సినిమాలు తగ్గాయి” అని ఇళైయరాజా నికృష్టపు పేలాపన చెయ్యలేదు!
‘తాను కళాకారుణ్ణి, తాను మనిషిని తన పని తనది, తన తీరు తనది, తన నాణ్యత తనది, తన ప్రతిభ తనది, తన పనితనం తనది’ అన్న స్థితిలో ఇళైయరాజా ‘కులం మాట’ లేకుండా ‘మలం జీవి’లా కాకుండా, కమ్యూనిస్ట్ కాకుండా మాన్యతతో మనుగడ సాగించారు.
ఎ.ఆర్. రహ్మాన్‌కు ఈ ఇళైయరాజా గొప్పతనం ఎందుకు తెలియలేదు?
ఇళైయరాజా ‘కులం’ను వదిలేసుకున్న గొప్ప మనిషి! “కులం కులం” అంటూ వికృతంగా బతుకుతున్న ప్రతి ‘కులం జీవీ’ ఇళైయరాజాను ఆదర్శంగా తీసుకుని మామూలు మనిషి, మేలైన మనిషి అవ్వాలి.
తినడానికి తిండి కూడా లేని స్థితిలోనూ ఇళైయరాజా ‘కులం బతుకు’ బతక లేదు! ఉన్మాదంతో సమాజాన్ని దూషించలేదు!!
నాకు చదువు లేదు, రాదు… నాకు ప్రతిభ, పనితనం లేవు, రావు… నేను చాతకాని వాణ్ణి నాకు రిజర్వేషన్ కావాలి అని అసాంఘీకమైన రచ్చ చెయ్యలేదు. అందుకే ఇళైయరాజా ‘రె(రి)జర్వేషన్ వ్యక్తిగా కాకుండా రెవరెన్షిఅల్ వ్యక్తి’ అయ్యారు.
కులం, మతం మనిషిగా కాదు, ‘రెజర్వేషన్ మనిషిగా కాదు
మనిషి రెవరెన్షిఅల్ మనిషి’ అవ్వాలి. అందుకు అదుగో ‘ఇళైయరాజా ఒక ప్రమాణం’.
– రోచిష్మాన్
9444012279