Suryaa.co.in

Editorial

మరగుజ్జు మేధావులకు కనిపించని మోదీ రాజనీతి గొప్పతనం

-మోదీకి పాక్ పార్లమెంటులో బ్రహ్మరథం.. భారత్‌లో విమర్శల పథం
– మన మకిలి-మరగుజ్జు ఆలోచనలు మారవు… అంతే!
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొద్దిసేపటి క్రితం నా మిత్రుడొకరు పార్లమెంటు సమావేశాల వీడియో క్లిప్పింగ్ పంపించాడు. ఇంకా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాలేదు. మరి ఇదేం క్లిప్పింగ్? బహుశా గత సమావేశాల్లో తనకు కనిపించిన ప్రత్యేక దృశ్యం కామోసని వీడియో ఓపెన్ చేశా. కానీ అది మన పార్లమెంటు కాదు. పాకిస్తాన్

పార్లమెంటు దృశ్యం. కొంచెం ఆసక్తిగా ఫార్వార్డ్ కొట్టకుండా పరిశీలించా. అక్కడ పాక్ రక్షణ మంత్రిని, విపక్షాలు మాట్లాడనీయడం లేదు. సరే అది ఎక్కడైనా సహజమే కదా అనుకున్నా. కానీ విషయం అది కాదు.

వాళ్లు మోదీని స్తుతిస్తూ, సొంత సర్కారు వైఫల్యాన్ని తూర్పారపట్టారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పాక్ పిల్లలను తీసుకురావడంలో పాక్ సర్కారు వైఫల్యం, అదే భారత్‌కు చెందిన పిల్లలను, మోదీ జయప్రదంగా ఇండియాకు తీసుకువచ్చిన వైనాన్ని విపక్షాలు గుర్తు చేస్తూ… మోదీ..మోదీ అంటూ నరేంద్రుడి నామస్మరణ చేస్తున్నారు.

సుత్తి లేకుండా టోటల్‌గా ఆ వీడియో సారాంశం అదీ. నాకు ఆశ్చర్యం వేసింది. నాకే కాదు. ఈపాటికి వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన వారెవరయినా దానిని చూసి హాశ్చర్యపోవలసిందే మరి. ఎందుకంటే.. పాక్‌లో మోదీని విపక్షాలు పొగుడుతున్నందుకు కాదు. భారత్‌లో విపక్షాలు అదే అంశంపై మోదీని అభినందించడం బదులు… ఆయనను విమర్శించడంతోపాటు, భారత్ సర్కార్ ఏమీ చేయడం లేదంటూ, యుపిలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతాశ్రీ పుత్రికారత్నంతో అబద్ధపు వీడియో వైరల్ చేసినందుకు!
modi-india
అవును. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆసియా ఖండానికి చెందిన దేశాల చిరంజీవులు చిక్కుకుపోయారు. అక్కడ మెడిసిన్ చదువుతున్న వారు ఆ యుద్ధఘోషకు భీతావహులయ్యారు. వారి దుస్థితిని చూసి చలించని హృదయాలంటూ లేవు. చావు ఎవరికయినా భయమే కదా మరి?! ఈ విపత్కత, విషాద పరిస్థితిపై మోదీ వెంటనే స్పందించి, రాజనీతి ప్రదర్శించారు. రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి.. భారత విద్యార్ధుల పరిస్థితి వివరించారు.

అంతకుముందే.. అక్కడికి ప్రత్యేక విమానాలు పంపించి, మన విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేలా చూశారు. మోదీ అభ్యర్ధన మన్నించిన పుతిన్.. తన దేశ యుద్ధాన్ని ఓ ఆరుగంటల పాటు
students నిలిపివేసి, ఆ సమయంలో భారత విద్యార్ధులను వెళ్లే వెసులుబాటు కల్పించారు. రష్యా గగనతలంపై ఈ యుద్ధ సమయంలో ఎగిరింది ఒక్క భారత్ విమానాలు మాత్రమే. విజయవంతంగా జరిగిన ఈ ‘ఆపరేషన్ గంగ’ ప్రక్రియ నడుస్తున్న సందర్భంలో, కర్నాటకకు చెందిన ఓ విద్యార్థి మృతి చెందడం విషాదమే.

అంతేనా.. భారత్‌కు చె ందిన సంతతి వారు, విద్యార్ధులు తమ ఇళ్లపై భారత్ జెండా ఎగుర వేస్తే, వాటిపై దాడులు చేయబోమన్న మరో గొప్ప భరోసా కూడా రష్యా నుంచి మోదీ పొందడం గొప్పతనమే. భారత్ విద్యార్ధులు జెండాలు పట్టుకుని ప్రాణాలు రక్షించుకుంటున్న తీరు చూసిన పాక్ పిల్లలు కూడా.. మన దేశ
modi-students జెండాలు పట్టుకుని తామూ ఇండియన్లమేనని అబద్ధం చెప్పి, ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ ఆ అధ్భుతదృశ్యం చూస్తే.. పరాయి దేశం వారితో కూడా భారత్ పతాకం పట్టించిన మోదీని మెచ్చుకోకుండా ఉండలేం.

ఇంకొంచెం ముందుకు వెళితే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపే శక్తి ఒక్క భారత ప్రధాని మోదీకే ఉంది కాబట్టి, ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలంటూ ఉక్రెయిన్ రాయబారి.. అత్యంత తెలివితో చేసిన దీనప్రార్ధన ఒక్కటి చాలు, ప్రపంచంలో భారత్ విలువేమిటో చెప్పడానికి! అయితే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నేతాశ్రీ కూతురు, తాము ఉక్రెయిన్‌లో చిక్కుకుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని, భారత రాయబార కార్యాలయ అధికారి ఫోన్లు తీయడం లేదంటూ విడుదల చేసిన ఓ వీడియో సిగ్గుమాలిన చేష్టకు, దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. తీరా పోలీసులు దానిపై విచారణ చేస్తే.. అసలా వీడియోలోని మహిళ ఉక్రెయిన్‌లో చదవడం లేదని తేలిందట. దానితో పోలీసులు అగ్గిరాముళ్లు అవడంతో.. ‘నాకేమీ తెలియదు. నాన్నారు చెప్పమన్నారు. నేను చెప్పానంతే’నని అసలు నిజాన్ని చల్లగా చెప్పిందట.

పోలీసులు రంగంలోకి దిగి నిజం సంగతి తేల్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అబద్ధమే ప్రపంచం అంతా చుట్టి వచ్చి, దేశం పరువు గంగలో కలిసేదే కదా? ఇలాంటి అబద్ధాలు ఈ సమయంలో కాళ్లు కడుక్కుని రెడీగా ఉండటమే సిగ్గుచేటు. ఒకవైపు యావత్ ప్రపంచమంతా యుద్ధ సమయంలో భారత్‌కు, రష్యా ఇస్తున్న వెసులుబాటును చూసి ఈర్ష్యతో కుళ్లుకుంటుంటే, మన దేశంలో మాత్రం ఇలాంటి మరగుజ్జు మేధావులు, పైశాచికమూకలతో చేయిస్తున్న ఇలాంటి దుష్ప్రచారం వల్ల పోయేది మన దేశం పరువే.

సరే.. మన దేశంలో కాంగీయులు, కామ్రేడ్లు, వారి చంకలో ఉండే రాజకీయ పార్టీలు గానీ, ఈ బాపతు బ్యాచ్‌కి ఊతమిచ్చి, ఆక్సిజన్ అందించే వామపక్ష పెయిడ్ కాలమిస్టులు గానీ, గంగానమ్మ జాతరలో హిస్టీరియో వచ్చినట్లు టీవీ డిబేట్లలో ఊగిపోయే శునకానంద మేతావులు గానీ, ఇప్పటివరకూ దేశ ప్రధాని చొరవను ప్రశంసించకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఆ బాపతు వర్గం నుంచి దానిని ఆశించడం కూడా అత్యాశనే.

బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ రాజకీయ నిర్ణయాలలో అనేక లోపాలు ఉండవచ్చు. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ చెప్పులోనే కాలుబెట్టి, కార్పొరేట్లకు సేవచేస్తుండవచ్చు. దేశాన్ని గుజరాతీయులతో నింపేసి ఉండవచ్చు. వారి వ్యాపారాలను తన చెప్పు చేతుల్లో ఉండే ముఖ్యమంత్రుల ద్వారా విస్తరింపచేయవచ్చు. వేల ఎకరాలు కట్టబెట్టించి ఉండవచ్చు. మోదీ వచ్చినా, దేశంలో మెజారిటీలపై ఇంకా మైనారిటీలదే పైచేయిగా కొనసాగవచ్చు. కాంగ్రెస్ దారిలోనే సీబీఐ-ఈడీలను ప్రయోగించి, విపక్షాలను దారికి తెచ్చుకునే ‘మాయోపాయ’ పార్టీ కావచ్చు.

కళంకితులెవరయినా తన పార్టీలో చేరితే వారిక నిష్కళంకులని భ్రమించవచ్చు. రాజకీయ అవసరార్ధం జైళ్లకు వెళ్లిన వారికి దొడ్డిదారిలో గొడుగు పట్టి, వారిని కాపాడే అవలక్షణాలు ఒక రాజకీయ పార్టీగా బీజేపీకీ ఉండవచ్చు. కాదనలేం. అలాంటి అవలక్షణాలను ఎవరూ సమర్ధించనవసరం లేదు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఏమీ పులుకడిగిన ముత్యమేమీ కాదన్నది నిష్ఠుర నిజం.

అది రాజకీయ కోణం. కానీ.. రాజకీయాలు వేరు, దేశం వేరు! దేశభక్తి ఉన్న వాళ్లంతా బీజేపీనే కానవసరం లేదు. బీజేపీ వాళ్లకు మాత్రమే దేశభక్తి ఉంటుందనీ కాదు. దేశభక్తి బీజేపీ పేటెంటీ కాదు. కానీ.. మన దేశ పాలకుల సమర్థత-చొరవను ప్రత్యర్ధి దేశాలు కూడా ప్రశంసిస్తుంటే, మనం మాత్రం మన దేశాన్ని మనమే కించపరచుకోవడమే దివాళాకోరుతనం. భారత ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిలో సమర్ధవంతంగా వ్యవహరించిందని ప్రకటిస్తే.. బహుశా తాము కట్టుకున్న ‘సెక్యులర్ మడిబట్టలు’ ఎక్కడ కాలిపోతాయన్న భయమే వారి మౌనానికి కారణమేమో?!

LEAVE A RESPONSE